MOTHERS DIET PLAN: అమ్మ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినిపించండి..

Diet Plan for Mothers: ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే తల్లులు వారి ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. మరి అలాంటివారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉందిగా అందుకోసం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

ఈ సంవత్సరం మే 12 అంతర్జాతీయ మాతృ దినోత్సవం. ఈ నేపథ్యంలో వారి గురించి, వారి ఆరోగ్యం గురించి కాస్తా శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. రోజంతా రాత్రి, పగలు ఇంట్లోని వారందరి బాగోగులు చూసే తల్లులు వారి విషయంలో అంతగా పట్టించుకోరు. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని దూరం చేయాలంటే ఏం చేయాలో, వారు ఫిట్‌గా హెల్దీగా ఉండేందుకు ఎలాంటి ఈజీ టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకోండి. యాక్టివ్‌గా ఉండేలా..

ఎవరైనా యాక్టివ్‌గా ఉండడం చాలా ముఖ్యం. ఇందుకోసం రోజుకి 30 నుంచి 40 నిమిషాల పాటు నడిచేలా చూసుకోండి. వర్కౌట్ చేయడం వల్ల బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ సోకవు. ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి, తల్లులు కార్డియో, డంబెల్ వర్కౌట్స్ చేసేలా చూడండి. దీంతో పాటు హెల్దీ ఫుడ్ తీసుకునేలా మీరే పుష్ చేయాలి.

విటమిన్ డి రిచ్ ఫుడ్స్..​ ​

హెల్త్ చెకప్స్..

అదే విధంగా, నేటి కాలంలో ప్రతి ఒక్కరూ రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అమ్మకి కూడా హెల్త్ చెకప్స్ చేయించండి. థైరాయిడ్, హైబీపి, షుగర్ వంటి సమస్యల గురించి ఈ టెస్ట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి 3 నెలలకి ఓ సారి చెకప్స్, ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ చెకప్స్, దీనికి సంబంధించిన సెల్ఫ్ టెస్ట్ ఇంట్లోనే 6 నెలలకి ఓ సారి చేయించడం మంచిది. ​Also Read : పరగడపున జ్యూస్‌లు తాగుతున్నారా.. జాగ్రత్త..

పోషకాహారం..

అదే విధంగా, వారు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్దీ ఫుడ్‌ని అందించండి. వారి డైట్‌లో పాలు, గుడ్లు, నట్స్, సోయా వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్‌ని యాడ్ చేసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు తినే చూడండి. దీంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉండేలా నీటితో పాటు, గ్రీన్ టీ, హెర్బల్ టీలను తాగించండి. వీటితో పాటు హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి ఫుడ్స్‌, అలానే కాల్షియం, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకునేలా చూడండి. ​Also Read : రాత్రుళ్లు నిద్రపోయాక ఈ లక్షణాలు కనిపిస్తే షుగర్ ఉన్నట్లేనట..

బోన్ హెల్త్..

మెనోపాజ్ తర్వాత స్త్రీల ఎముకల బలహీనపడతాయి. దీంతో హార్మోన్ల పరిమాణం చెదిరిపోతుంది. ఈ కారణంగా ఎముకల్లో నొప్పులు ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్ డి, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం మార్నింగ్ ఎండలో ఉండడం వల్ల విటమిన్ డి అందుతుంది. దీని వల్ల బోన్ హెల్త్ బావుంటుంది. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Health News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T05:50:24Z dg43tfdfdgfd