అవకాడో గింజలు తినవచ్చా.. తింటే ఏమైనా ప్రమాదమా.. నిపుణులు ఏమంటున్నారు..!

అవకాడో (Avocado) అద్భుతమైన రుచి, అనేక పోషకాలకు నిలయం. అవకాడో గింజలను కూడా ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో అనేక వీడియోలు, రీల్స్ అవకాడో గింజల ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తున్నాయి. అందుకే అవకాడో గింజలను వృథాగా పడేయవద్దు. ఈ గింజలు తింటే ఎలాంటి ప్రత్యక్ష హాని కలిగే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉన్న పోషకాలు పండు గుజ్జులో లభించే పోషకాల కన్న తక్కువగా ఉంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అవకాడో గింజల్లో అధిక సాంద్రతలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. వాటిలో ఫెనోలిక్ కాంపౌండ్స్, ప్రోసయనిడిన్స్ అనే రెండు రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ కలిసి మొత్తం అవకాడో పండులో ఉన్న యాంటీఆక్సిడెంట్ లక్షణాలలో 38% వరకు దోహదపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పించే అవకాశం ఉంది. అధ్యయనాల ప్రకారం, అవకాడో సీడ్స్ పౌడర్ మొత్తం కొలెస్ట్రాల్, చెడు (LDL) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

మధుమేహ పరీక్షల్లో, అవకాడో సీడ్ ఎక్స్‌ట్రాక్ట్ మధుమేహ వ్యాధి నివారణ మందుల వలెనే ప్రభావవంతంగా ఉందని కనుగొన్నారు. జంతు అధ్యయనాలు అవకాడో సీడ్ ఎక్స్‌ట్రాక్ట్ రక్త నాళాలకు విశ్రాంతి అందించి రక్తపోటును తగ్గిస్తుందని సూచిస్తున్నాయి. ఈ గింజల్లోని ఫైబర్ డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి, పేగు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి వీటిని తీసుకోవచ్చని అంటున్నారు. కానీ కొన్ని విషయాలను తప్పక పరిగణలోకి తీసుకోవాలి అవేవో చూద్దాం.

- విషపూరిత పదార్థాలు

అవకాడో గింజల్లో కొంత మొత్తంలో విషపూరిత పదార్థాలు కూడా ఉన్నాయి. వీటిలో పెర్సిన్ అనే ఒక ఫంగిసైడ్ టాక్సిన్ ఉంటుంది. అధిక మొత్తంలో తినడం వల్ల వాంతులు, వికారం, అతిసారం వంటి సమస్యలు రావచ్చు. కాలిఫోర్నియా అవకాడో కమిషన్ నుంచి వచ్చిన డేటా ప్రకారం, అవకాడో గింజల్లో యాంటీన్యూట్రియెంట్స్ కూడా ఉన్నాయి. టానిన్లు, సైయనోజెనిక్ గ్లైకోసైడ్స్, ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్ వంటి ఈ పదార్థాలు శరీరం ఖనిజాలు, విటమిన్లను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

- గింజలు తినవచ్చా?

ఇటీవల చాలా వీడియోలు అవకాడో గింజలను ముక్కలుగా కోసి, పొడి చేసి తినమని చెబుతున్నాయి. కానీ, ఇలా చేయడం వల్ల గింజల ప్రతికూల ప్రభావాలు తొలగిపోవని చెబుతున్నారు. వాస్తవానికి అవకాడో గింజలను తినడానికి సురక్షితమైన మార్గం నిజానికి లేదు. అయినా, గింజలను వృథా చేయకుండా ఉండాలనుకుంటే, వాటి నుంచి నూనె తీయించవచ్చు. లేదా పొడిగా చేసి వంటల్లో వాడవచ్చు. అవకాడో గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది.

- ఇలా చేయడం ఉత్తమం

అవకాడో రుచికరమైన గుజ్జునే తినాలి. అందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు అధికంగా ఉండే అవకాడో గుజ్జునే ఆస్వాదించాలి. మిగిలిన గింజలు నాటి అవకాడో చెట్టును పెంచడం ఉత్తమం.

2024-04-20T10:36:12Z dg43tfdfdgfd