ఆంజనేయుని చేతిలో ఆత్మలింగం ఉన్న ఆలయం ఇదే.. భక్తులపాలిట కల్పతరువు!

అడవులకు నెలవై, సుందరమైన ప్రకృతి రమణీయతలకు నిలయమై తెలంగాణా కాశ్మీరంగా పిలువబడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. అందులో పురాతనమైన దేవాలయాలు, ప్రాచీన కట్టడాలు కూడా ఉన్నాయి. అయితే జిల్లాలోని ప్రసిద్ద ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్న ఒక్కో క్షేత్రం ఒక్కో చరిత్రను కలిగి ఉంది. అందులో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండలవాడ గ్రామంలోని శ్రీ ఆత్మలింగ హనుమాన్ దేవాలయం ఒకటి. దాదాపు నాలుగు వందల యేళ్ల ప్రాచీన చరిత్రను కలిగి ఉన్న ఆలయం ఇది. పండుగ రోజుల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ భక్తుడు ఈ ఆలయంలోని ఆత్మలింగ హనుమంతుడి దర్శనం కోసం వస్తారు. కోరి వచ్చిన భక్తులపాలిట కొంగు బంగారంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది.

ఇదిలా ఉంటే దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ పెండలవాడ ఆలయంలో ఆంజనేయస్వామి చేతిలో ఆత్మలింగాన్ని ఉండి భక్తులకు దర్శనమిస్తారు. కుడి చేయిని పైకి ఎత్తి అందులో ఆత్మలింగాన్ని చూపిస్తూ హనుమంతుడు సుందరంగా దర్శనమిస్తారు. ఈ విగ్రహం ఎనిమిది అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు కలిగి ఉంది. ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. హనుమాన్ జయంతితో పాటు మహాశివరాత్రికి ఇక్కడ వేడుకలు జరుగుతాయి. ఇది ఆంజనేయస్వామి ఆలయం అయినప్పటికి ఇక్కడ పరమశివుడికి కూడా పూజలు చేయడం విశేషం. ఈ ఆత్మలింగ హనుమాన్ ఆలయంలోనే శ్రీసీతారామలక్ష్మణుల విగ్రహాలు, నంది, శివ లింగం, పాండురంగడి విగ్రహాలు ఇంకా నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆత్మలింగ హనుమాన్ తో పాటు అందరు దేవుళ్లకు పూజలు చేసి వెళతారు. పక్కనే కళ్యాణ మండపం, ఆలయం వెనుక పెన్ గంగా నది ప్రవహిస్తు ఉంటుంది.

రైతులకు అదిరే శుభవార్త.. అకౌంట్లలోకి మళ్లీ రూ.2 వేలు, వచ్చేది ఆరోజే?

అయితే ఈ ఆలయ చరిత్రను గురించి స్థానికులు కథలు కథలుగా చెబుతారు. ఆలయంలోని విగ్రహం పెన్ గంగా నదిలో కొట్టుకొని వచ్చిందని, అయినా దాన్ని ఎవరు గుర్తించలేదని, చివరకు గ్రామ పెద్ద కలలోకి దైవం ప్రత్యక్షమై తాను నదిలో ఉన్నట్లు చెప్పడంతో, అక్కడకు వెళ్ళి ఆ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్టించి పూజలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడి ఆంజనేయస్వామి చేతిలో ఆత్మలింగ ఉండటం వల్ల మహా శివరాత్రికి ఇక్కడ మహాన్యాస రుద్రాభిషేకం చేస్తామని, ఐదు రోజులపాటు జాతర కూడా కొనసాగుతుందని ఆలయ పూజారి లోకల్18తో తెలిపారు.

రూ.3.6 లక్షలకే ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కి.మి వెళ్లొచ్చు!

ఇది మహామహిమాన్వితమైన క్షేత్రమని, ఇక్కడికి సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తారని అన్నారు. కాగా ఆత్మలింగ హనుమాన్ కోరిన కోరికలు నెరవేరుస్తారని, ఇటువైపు ఎప్పుడు వచ్చినా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని వెళతానని కోప్ మండికి చెందిన భక్తుడు తెలిపారు.

2024-05-06T05:44:46Z dg43tfdfdgfd