ఆధ్యాత్మికత పెంపొందించే లక్ష్యంతో.. వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం.. ఎక్కడంటే..

ఎండలు మండుతున్న తరుణంలో చిన్నారులు బయటకిపోకుండా చిన్న వయసులో భక్తి మార్గం వైపు వారి మనసును మళ్లించే విధంగా దేవ, దేవతలకు సంబంధించిన నామాలు చిన్నారులు చేత జపించడం, పటిష్టం చేయడం, భక్తి మార్గం వైపు వెళ్లే విధంగా చూడటం జరుగుతున్నది. భక్తి మార్గం వైపు చిన్న వయసులో చిన్నారులను మల్లిస్తే వారు భవిష్యత్ లో ఉన్నత రంగాల్లో ముందుకు రావడం జరుగుతుంది. సమాజంలో మంచి ఏదీ... చెడు ఏది అన్న విషయాలపై క్లారిటీ ఉంటుందన్నారు.

ఉమ్మడి జిల్లాలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో సనాతన ధర్మ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణలో భాగంగా వేసవి శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరగతులు సోమవారం నుంచి మే 27 వరకు రోజూ ఉదయం 8.00 నుంచి 10.30గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Zero Interest Loan: భారీ శుభవార్త.. సొంత ఇంటి నిర్మాణానికి వడ్డీ లేని రుణం.. ఉచితంగానే..

16 ఏళ్లలోపు బాలబాలికలకు వివిధ దేవత సంబంధమైన ధ్యాన శ్లోకాలు, విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతకంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 16 ఏళ్లు పైబడిన విద్యార్థినీ, విద్యార్థులకు లలితా సహస్రనామ స్తోత్రం, వివిధ దేవతా స్తోత్రాలు, వ్రతాలు, నవవిధభక్తి మార్గాల పట్ల అవగాహన, సనాతన ధర్మం పట్ల అవగాహన, వేదాలకు సంబంధించి స్వశాఖాపర మైన సంధ్యావందనం నేర్పనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు అడ్మిషన్ల 95500 71629, 90008 50325 కొరకు సంప్రదించాలని ఆయన కోరారు.

2024-05-06T08:45:14Z dg43tfdfdgfd