ఆమె టీచర్ కాదు.. కామ పిశాచి.. విద్యార్థులతో అఫైర్లు.. షాకవుతున్న తల్లిదండ్రులు

మనందరికీ టీచర్లంటే ఎంతో భక్తి. తల్లిదండ్రుల తర్వాత వారిని దైవ సమానులుగా చూస్తాం. పేరెంట్స్ తమ పిల్లల్ని ఎక్కడికి పంపేందుకైనా భయపడతారేమో గానీ.. స్కూల్‌కి పంపేందుకు సందేహించరు. ఎందుకంటే.. స్కూల్‌ని దేవాలయంగా, టీచర్లను గౌరవంగా చూస్తారు. కానీ కొంత మంది టీచర్లు.. పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నారు. అలాంటి ఓ టీచర్.. బ్రిటన్‌లో ఇద్దరు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది.

ఆ కామ పిశాచి ఓ లెక్కల టీచర్. పేరు రెబెక్కా జాయ్‌నెస్. వయసు 30 ఏళ్లు. 2021లో ఓ పిల్లాడు లెక్కలు సరిగా చెయ్యలేకపోతుంటే.. ఎక్స్‌ట్రా క్లాసులు తీసుకుంది. ఆ టీచర్‌కి పిల్లలపై ఎంత శ్రద్ధ అనుకున్నారు తల్లిదండ్రులు. ఐతే.. ఈ దొంగ టీచర్.. క్రమంగా ఆ పిల్లాడికి ఫోన్ నంబర్ ఇచ్చింది. తర్వాత చాటింగ్ చేసింది. తర్వాత కాల్స్ మొదలయ్యాయి. తర్వాత.. షాపింగ్‌కి తీసుకెళ్లి.. రూ.36వేల విలువైన గూచీ బెల్ట్ కొంది. అది చూసి ఆ పిల్లాడు ఆనందపడిపోయాడు. అదంతా అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.

తర్వాత ఆ పిల్లాణ్ని తన అపార్ట్‌మెంట్‌కి తీసుకెళ్లింది. అక్కడ లైంగిక సంబంధం పెట్టుకుంది. ఇలా కొన్నాళ్లు గడిచింది. ఓ రోజు ఆ పిల్లాడు ఈ విషయాన్ని తన ఫ్రెండ్‌కి చెప్పాడు. ఆ పిల్లాడు స్కూల్ అంతా టాంటాం చేశాడు. దాంతో విషయం తల్లిదండ్రులకీ, తర్వాత పోలీసులకీ చేరింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కానీ ఎలాగొలా మేనేజ్ చేసి.. బెయిల్‌పై బయటకు వచ్చింది.

మళ్లీ అదే తంతు:

ఒక కేసులో విచారణ ఎదుర్కొంటూ కూడా.. రెబెక్కా.. మరో పిల్లాణ్ని లొంగదీసుకుంది. ఇందుకోసం స్నా్ప్ చాట్‌ని వాడుకుంది. ఆ పిల్లాడికి ఎక్స్‌పోజింగ్ ఫొటోలు పంపింది. ఎట్రాక్ట్ చేసింది. తర్వాత మళ్లీ అపార్ట్‌మెంట్‌కి తెచ్చుకుంది. మళ్లీ సేమ్ సీమ్ రిపీట్. ఈసారి రెండో పిల్లాడి వల్ల ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో.. మొదటి కేసు విచారణ తీవ్రతరం అయ్యింది. ఆమె చేసిన రెండు నిర్వాకాలనూ లాయర్లు బయటపెట్టారు. ఆమె మాత్రం.. రెండో పిల్లాడి విషయంలో తాను ఏ తప్పూ చెయ్యలేదనీ.. అతనికి 16 ఏళ్లు నిండిన తర్వాతే లైంగిక సంబంధం పెట్టుకున్నానని సమర్థించుకుంది.

ఈ విషయం తెలిసిన స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ముక్కున వేలేసుకుంటున్నారు. చేసిందంతా చేసి.. మళ్లీ సమర్థించుకోవడమేంటి... అసలు టీచర్ అయివుండి.. ఇదేం పని.. అంటూ వారు ఫైర్ అవుతున్నారు. యూరప్ దేశాల్లో ఇలాంటి కేసులు తరచూ తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఈ కేసు మరింత కలకలం రేపుతోంది. ఇది తెలుసుకొని.. చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లల విషయంలో మరింత కేర్ తీసుకోవాలని భావిస్తున్నారు.

2024-05-08T09:07:18Z dg43tfdfdgfd