ఇంట్లో ఈ చెట్లు పెంచితే వాతావరణం చల్లగా మారుతుందట..

వేడి పెరిగిపోయింది. ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాం. అలాంటప్పుడు కొన్ని నేచురల్ టిప్స్ ఇంటివాతావరణాన్ని చల్లబరుస్తాయి. అవేంటో తెలుసుకోండి.

చెట్లు పెంచితే ఇల్లు, ఇంటి పరిసరాలు చల్లగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇందులో మరీ ముఖ్యంగా కొన్ని చెట్లు ఇంట్లో పెంచడం వల్ల వాతావరణం చల్లగా మారుతుంది. అవి ఏం చెట్లు తెలుసుకోండి. డ్రాకేనా..

ఈ చెట్టు కూడా ఇంట్లోని వేడిని తగ్గించే మొక్క. ఈ మొక్కని ఇంటి లోపల పెంచితే వేడి వాతావరణం తగ్గించి గాలి నాణ్యతను పెంచుతుంది. కాబట్టి, దీనిని హ్యాపీగా పెంచుకోవచ్చు.

పోథోస్..

పోథోస్ అనే చెట్టు కూడా ఏ టెంపరేచర్‌లోనైనా ఈజీగా పెరిగే మొక్క. దీనిని ఇంట్లో పెంచితే గాలి శుద్ధి అవుతుంది. వేడిని పీల్చుకుని ఇంటిని చల్లబరుస్తుంది. ఇంటి గదిలో దీనిని పెంచితే గది వాతావరణం చల్లగా ఉంటుంది.

బాంబూ పామ్..

ఇంట్లో ఈ చెట్టుని పెంచడం వల్ల కూడా వేడి తగ్గుతుంది. ఇది వాయు కాలుష్యాన్ని తగ్గించి తేమని కూడా తగ్గిస్తుంది. చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. కాబట్టి, హ్యాపీగా దీనిని పెంచుకోవచ్చు. ​Also Read : కొత్త ఇంట్లోకి మారేటప్పుడు ఇవి పాటిస్తే సంపాదనకి కొదువ ఉండదట..

బోస్టన్ ఫెర్న్..

ఈ మొక్క చూడ్డానికి క్రిస్మస్ ట్రీలా ఉంటుంది. దీనిని పెంచడం వల్ల గాలిని శుద్ధి చేసినట్లుగా ఉంటుంది. ఈ చెట్టు గాలిలో తేమని నిలిపి ఇంటిని చల్లగా ఉంచుతుంది. కాబట్టి, ఈ చెట్టుని హ్యాపీగా ఇంట్లో పెంచొచ్చు.

రబ్బర్ ప్లాంట్..

ఇది చూడ్డానికి చక్కగా, అందంగా ఉంటుంది. దీనిని ఇంట్లో పెంచడం వల్ల వేడిని గ్రహించి గదిలోపల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. కాబట్టి, దీనిని కూడా హ్యాపీగా పెంచుకోవచ్చు.

స్పైడర్ ప్లాంట్..

ఇది చూడ్డానికి స్పైడర్‌ లానే ఉంటుంది. ఈ మొక్కలు గాలి నుండి ఫార్మాల్డిహైడ్, జిలీన్‌లను తొలగించేందుకు సాయపడతాయి. ఇంటి లోపల పెంచడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది. ఎక్కడైనా దీనిని వేలాడదీయడం మంచిది. ​Also Read : వాషింగ్‌మెషిన్‌ని 2 వారాలకి ఓసారి ఇలా క్లీన్ చేస్తే బట్టల మురికి చక్కగా పోతుంది..

స్నేక్ ప్లాంట్..

ఇవి చూడ్డానికి కాస్తా పాముల్లానే ఉంటాయి. ఇవి చక్కని డెకరేషన్ మొక్కలా కూడా ఉంటుంది. అందుకే, వీటిని ఇంట్లో ఎక్కడైనా పెంచడి. దీని వల్ల ఇండోర్ మలినాలు, ట్యాక్సిన్స్‌ని దూరం చేస్తుంది. కాబట్టి, హ్యాపీగా దీనిని పెంచుకోవచ్చు.

కలబంద..

కలబంద ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. దీనిని పెంచడం వల్ల ఇంట్లోని వేడిని గ్రహిస్తుంది. గాలిని శుద్ధి చేస్తుంది. తేమని పెంచి ఇంట్లో వేడిని తగ్గిస్తుంది. దీనిని మనం అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా వాడుకోవచ్చు. మీకు వీలైతే చిన్న కుండీలో చెట్టుని పెట్టి ఇంట్లో ఎక్కడైనా దీనిని పెట్టండి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T05:58:58Z dg43tfdfdgfd