ఇంట్లోని అద్దాలను ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

మన ఇంట్లో ఎన్నో చోట్ల అద్దాలు ఉంటాయి. ఇన్ని అన్నింటినీ క్లీన్ చేసినా.. రోజూ ముఖం చూసుకునే అద్దాలను మాత్రం క్లీన్ చేయడం మర్చిపోతుంటారు.అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఇంట్లోని అద్దాలన్నింటినీ తలతల మెరిసేలా చేయొచ్చు. అదెలాగంటే? 

ఇంట్లో అద్దాలు ఉండటం చాలా కామన్. ఇంటి గోడలపై, బాత్రూమ్ లో లేదా డ్రెస్సింగ్ టేబుల్ ఇలా.. ఎన్నో చోట్ల అద్దాలను పెడుతుంటాం. అయితే చాలా మంది అద్దాలను క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల అద్దాలకు దుమ్ము, ధూళి పట్టి మురికిగా మారుతాయి. మురికిగా మారిన అద్దాలను క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే కొన్ని నిమిషాల్లో అద్దాలను తలతల మెరిసేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

టాల్కమ్ పౌడర్ 

టాల్కమ్ పౌడర్ తో కూడా మీరు అద్దాలను క్లీన్ చేయొచ్చు. సాధారణంగా చాలా మంది నీళ్లు పెట్టి అద్దాలను తుడుస్తుంటారు. కానీ నీళ్లకు బదులుగా మీరు టాల్కమ్ పౌడర్ ను ఉపయోగించొచ్చు. గ్లాసులను క్లీన్ చేయడానికి మీరు దానిపై టాల్కమ్ పౌడర్ చల్లి కాసేపు అలాగే ఉంచండి. కొద్ది సేపటి తర్వాత కాటన్ క్తాత్ తో తుడిచేస్తే అద్దం కొత్తదానిలా మెరిసిపోతుంది.

 

వైట్ వెనిగర్ 

అద్దాలను శుభ్రం చేయడానికి వైట్ వెనిగర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం అద్దంపై వైట్ వెనిగర్ వేసి శుభ్రమైన గుడ్డతో తుడవండి. ఇది గ్లాసులకు పట్టుకున్న దుమ్మును, ధూళిని వదిలిస్తుంది.

 

నిమ్మరసం 

నిమ్మరసంతో కూడా మనం ఎన్నో వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు. నిమ్మరసంలో నీళ్లు కలిపి గ్లాసును శుభ్రం చేసుకోవచ్చు. ఈ నీటిని గ్లాసు మీద కాసేపు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో గ్లాసు తలతల మెరిసిపోతుంది.

వార్తాపత్రిక 

గాజును శుభ్రం చేయడానికి మీరు వార్తాపత్రికను కూడా ఉపయోగించొచ్చు. వార్తాపత్రికతో గ్లాసును రుద్దడం వల్ల గ్లాస్ కొత్తగా మెరిసిపోతుంది. దుమ్ము, ధూళి తొలగిపోయి అందంగా మారుతాయి.

 

ఉప్పు, నిమ్మరసం 

నిమ్మరసం, ఉప్పుతో కూడా గ్లాసులను అందంగా మెరిపించొచ్చు. ఇందుకోసం నిమ్మరసంలో కొద్దిగా ఉప్పును మిక్స్ చేసి గ్లాస్ మీద అప్లై చేయండి. కాసేపటి తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడుచుకుంటే గ్లాస్ కొత్తగా కనిపిస్తుంది. 

 

బేకింగ్ సోడా 

గ్లాసును శుభ్రం చేయడానికి మీరు బేకింగ్ సోడాను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం బేకింగ్ సోడాను గ్లాసుపై చల్లండి. తర్వాత పొడి శుభ్రమైన గుడ్డను తీసుకుని రుద్దండి. అంతే అద్దానికి అంటుకున్న దుమ్ము, ధూళి మొత్తం తొలగిపోతాయి. 

ఇతర చిట్కాలు-

ఇవన్నీ కాకుండా షేవింగ్ క్రీమ్, ఆల్కహాల్ వంటి వాటిని ఉపయోగించి కూడా మీరు గ్లాసులను శుభ్రం చేసుకోవచ్చు. 

2024-05-01T09:21:35Z dg43tfdfdgfd