ఇంట్లోనే తయారు చేసిన ఈ సీరమ్‌తో ముఖం మెరుస్తుంది..

ముఖం అందంగా, యవ్వనంగా మెరవాలని అందరికీ ఉంటుంది. అందుకోసం విటమిన్ ఇ కొరియన్ ఫేస్ సీరమ్‌ని ఇంట్లోనే ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

కొరియన్స్‌లా మెరిసే చర్మం కావాలని అందరికీ ఉంటుంది. అందుకోసం కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి. వీటి వల్ల యవ్వనంగా మెరుస్తూ ముడతలు లేని చర్మాన్ని పొందొచ్చు. ఇందుకోసం ఇంట్లోనే తయారు చేసిన కొన్ని పదార్థాలను వాడొచ్చు. అందులో విటమిన్ ఇ ఫేస్‌ సీరమ్ ఒకటి.విటమిన్ ఇ సీరమ్..

ఈ సీరమ్ చర్మానికి చాలా మంచిది. దీని వల్ల చర్మం బిగుతుగా, మృదువుగా, యవ్వనంగా కనిపిస్తుంది. నిజానికీ చాలా బ్యూటీ ప్రోడక్ట్స్‌లో విటమిన్ ఇ ఉంటుంది. అయితే, దీనిని సహజంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

ఈ సీరమ్ తయారు చేయడానికి కొన్ని పదార్థాలు కావాలి. అవి 3, 4 విటమిన్ ఇ క్యాప్సూల్స్, 1 స్పూన్ జోజోబా ఆయిల్, రోజ్ షిప్ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, ఐదారు చుక్కల ఎసెన్షియల్స్ ఆయిల్స్ లావెండర్ ఆయిల్ అయితే బావుంటుంది. ఇవన్నీ కూడా చర్మానికి అనేక లాభాలని అందిస్తాయి. ​Also Read : కాఫీ పౌడర్‌లో ఈ రెండు కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖం మెరుస్తుంది..

మెరిసే చర్మానికి విటమిన్ సి సీరమ్..​ ​

ఎలా తయారు చేయాలి..

ముందుగా ఓ గ్లాస్ డ్రాపర్ బాటిల్ తీసుకోండి. అందులో ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నింటినీ వేయండి. జొజోబా ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, రోజ్ షిప్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషకాలని అందిస్తాయి. లావెండర్ ఆయిల్ చర్మాన్ని కాపాడుతుంది. వాపు, అలర్జీలు, దురద వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. ఇక ఎసెన్షియల్ ఆయిల్స్ చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. ​Also Read : శనగపిండిలో వీటిని కలిపి ప్యాక్ వేస్తే ముఖం, చర్మం మెరిసిపోద్ది..

అప్లై చేయడం..

ముందుగా తయారు చేసుకున్న ఆయిల్‌ని మొత్తం చక్కగా కలపాలి. దీనిని ఎండ తగలని ప్లేస్‌లో పెట్టాలి. ప్రతిరోజూ కొద్దిగా తీసుకుని క్లీన్ చేసుకున్న ఫేస్‌కి అప్లై చేసి మసాజ్ చేయాలి. మొత్తం పీల్చుకునేవరకూ అలానే ఉంచి ఇతర ప్రోడక్ట్స్ రాసుకోవచ్చు.

బెనిఫిట్స్..

ఈ సీరమ్ రాయడం వల్ల చర్మంపై మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతి వంతంగా తయారవుతుంది. అన్ని సహజమైనవే కాబట్టి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే, అన్ని పదార్థాలు అందరికీ పడవు కాబట్టి, ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి వాడడం ఉత్తమం. దీని వల్ల మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Beauty News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-27T06:29:35Z dg43tfdfdgfd