ఇక్కడ విదేశీ అతిధులు మిమ్మల్ని పలకరిస్తారు.. మీ స్నేహం కోరుకుంటారు.. వారెవరంటే !

పక్షుల కిలకిల రాగాలు వింటే ఎవరి మనసుకైనా ఆహ్లాదం కలుగుతుంది. కోయిల కుహు కుహూ రాగాలు వింటుంటే మనసుకు ఏదో తెలియని ఉత్తేజం కలుగుతుంది. కాలక్రమేణా పక్షి జాతి అంతరించి పోయే పరిస్థితులు మన కళ్ల ముందే మనకు కనిపిస్తున్నాయి. ఆధునికత పెరుగుతున్న కొద్దీ పక్షి జాతుల రకాల గురించి నేటి యువత కు అంతగా అవగాహన ఉండడం లేదనే చెప్పవచ్చు. అయితే కొందరు పక్షి జాతి ప్రేమికులు మాత్రం నేటికీ పక్షుల పెంపకం చేస్తూ.. పక్షి జాతి మనుగడ అంతరించి పోకుండా కృషి చేస్తున్నారు. ఇలా వీరి కోసమే కొందరు మార్కెట్ లో పలు రకాల పక్షులను విక్రయిస్తూ.. పలువురు ఉపాధి పొందుతున్నారు.

హనుమకొండ లో పెట్రోల్ పంప్ ఎదురుగా విజయ్ కుమార్ అనే వ్యక్తి వాణి పెట్ షాప్ ను గత 5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. దీనితో స్థానికంగా గల పక్షి ప్రేమికులు వీటిని కొనుగోలు చేస్తూ.. ఈ పెట్ షాప్ ను ఆదరిస్తున్నారు.

మొదట్లో కేవలం శునకం పిల్లలు మాత్రమే అమ్మడం ప్రారంభించి, కస్టమర్ల కోరిక మేరకు రకరకాల జాతుల పక్షులను, కుందేళ్ళను తీసుకువచ్చి విక్రయించడం ప్రారంభించారు. దేశ, విదేశాల్లో లభ్యమయ్యే పలు రకాల జాతుల పెంపుడు డాగ్స్, పక్షులు  ఈయన విక్రయిస్తున్నారు. కొంతమంది పిల్లులను పెంచుకుంటారు. అలాంటి వారికోసం ఆకర్షణీయంగా కనిపించే పిల్లలను విక్రయిస్తున్నారు. పెంపుడు కుక్కలతో పాటు వాటికి కావలసిన బెల్ట్ లతో పాటు ఉపయోగించే ఆహార పదార్థాలను కూడా అందుబాటులో ఉంచారు ఇక్కడ.

Painting: మహిళలు, మగవారు, స్టూడెంట్స్‌‌కు డబ్బే డబ్బు.. ఇలా చేస్తే రూ.లక్షల్లో సంపాదన!

కుందేళ్లు, పావురాలను కూడా అందుబాటులో ఉంచడంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. పక్షులు, పావురాలను కొనుగోలు చేసిన వారు ఇంట్లో పెంచుకోవడానికి కొరకు బోనులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాటికోసం ఎక్కడికో వెళ్లి శ్రమ పడకుండా వివిధ సైజులలో అందుబాటులో ఉంచామని నిర్వాహకులు విజయ్ కుమార్, లోకల్ 18 తో తెలిపారు. అలాగే శునకాలకు ఆరోగ్య సమస్యలు వచ్చిన సమయంలో ఉపయోగించే మందులను కూడా వీరి వద్ద అందుబాటులో ఉన్నాయట.

తల్లి ఇచ్చిన ప్రోత్సాహమే సినారెకు ఇంతటి ఖ్యాతి తెచ్చింది - లోకల్18 తో సినారె గ్రామస్తులు!

ఎటువంటి జాగ్రత్తలు పాటించి పెంపుడు జంతువులను పెంచుకోవాలి. వాటికి ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది కూడా కొనుగోలు చేసిన కస్టమర్లకు సలహాలు, సూచనలు ఇస్తుండడంతో వ్యాపారం మెరుగ్గా సాగుతుంది అంటున్నారు విజయ్. ఆన్లైన్లో కూడా మా షాపు వివరాలు తెలుసుకొని చాలామంది మమ్మల్ని సంప్రదించారని షాపు యజమాని విజయ్ కుమార్ తెలిపారు.

2024-05-02T06:29:31Z dg43tfdfdgfd