ఈ అడవిలో ఒక అందమైన అమ్మాయి స్కార్ఫ్ పోగొట్టుకుంది.. అది ఎక్కడ ఉందో చెప్పండి..

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ తెగ వైరల్‌ అవుతున్నాయి. వీటిలో పిక్చర్ పజిల్స్ బుర్రకు పని పెడుతూ మరింత మందిని ఆకట్టుకుంటున్నాయి. పిక్చర్ పజిల్స్ (Picture Puzzles) పరిష్కరించడం ద్వారా టైమ్‌ పాస్ కావడమే కాకుండా మెదడుకు పదును పెట్టుకున్నట్లు కూడా అవుతుంది. ఈ పజిల్స్‌లో క్లిష్టమైన చిత్రాలలో తెలివిగా దాగిన వస్తువులను కనుగొనాల్సి ఉంటుంది. పిక్చర్ పజిల్స్ ద్వారా పరిశీలనా శక్తిని పరీక్షించుకోవచ్చు. ఏకాగ్రతను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఇవి ఒక మంచి మార్గం. ఈరోజు మీకోసం ఒక డిఫికల్ట్ పిక్చర్ పజిల్ తీసుకొచ్చాం.

పైన పిక్చర్ పజిల్ ఇమేజ్‌ను చూడవచ్చు. ఈ ఇమేజ్‌లో పచ్చటి పొదలు, పెద్ద చెట్లు, పక్షులు, కోతులు, కొండపై నుంచి కిందకి పారుతున్న ఒక కాలువ, పర్యాటకులను చూడవచ్చు. ఈ జంగిల్ పిక్చర్‌లో చాలానే వివరాలు ఉన్నాయి. అయితే ఇందులో ఒక స్కార్ఫ్ (Scarf) కూడా ఉంది. ఒక మహిళ అడవిలో తన స్కార్ఫ్ పోగొట్టుకుంది. దాన్ని వెతికి పెట్టడమే ఈ పజిల్ టాస్క్. కానీ అది చిత్రంలో పూర్తిగా కలిసిపోయింది. ఇందుకు మీకు 8 సెకన్ల సమయం మాత్రమే ఇచ్చారు.

చిత్రంలో దాగి ఉన్న స్కార్ఫ్ కనిపెట్టాలంటే ప్రతి భాగాన్ని జూమ్ చేసి ఆకారాలను గమనిస్తూ ఉండాలి. ఈ వస్త్రం ఏ రంగులో, ఎక్కడైనా దాగి ఉండొచ్చు. అందువల్ల రీజనింగ్ స్కిల్స్ కూడా ఉపయోగించాలి. అద్భుతమైన కంటిచూపు, పరిశీలన నైపుణ్యాలను ఉపయోగిస్తూ దీనిని చూడాలి. ఒకవేళ ఆ వస్త్రాన్ని కనిపెట్టడం కష్టంగా అనిపిస్తే మేం ఒక హింట్ కూడా ఇస్తున్నాం.

* హింట్

స్కార్ఫ్‌ క్లాత్ చివర్లలో టవల్ లాగానే కొన్ని దారాలు కనిపిస్తుంటాయి. ఆ ఆకారాలు ఎక్కడ కనిపిస్తాయో గమనించడం ద్వారా దీనిని వెంటనే పసికట్టవచ్చు. ఇచ్చిన సమయంలోగా దానిని గుర్తించగలిగారా..? అయితే మీ కంటి చూపు, అబ్జర్వేషన్స్ స్కిల్స్ సూపర్ అని చెప్పవచ్చు. దీనిని కనిపెట్టలేక పోతే టైమర్ ఆఫ్ చేసి ప్రశాంతంగా చిత్రాన్ని పరిశీలించవచ్చు. ఎంత ప్రయత్నించినా దొరకకపోతే కింద ఇచ్చిన సొల్యూషన్ పిక్చర్ చెక్ చేయవచ్చు.

* సొల్యూషన్..

పైన ఇచ్చిన సొల్యూషన్ పిక్చర్‌లో బ్లాక్ కలర్ సర్కిల్ తో స్కార్ఫ్‌ హైలెట్ చేశాం. ఈ క్లాత్ పారుతున్న నీటిలో ఒక పక్షి ముందు S ఆకారంలో దాగి ఉంది. ఈ పజిల్‌ను ఎంజాయ్ చేసి ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయవచ్చు. ఇలాంటి మరెన్నో పజిల్స్ సాల్వ్ చేయాలనుకుంటే న్యూస్‌ 18 తెలుగు వెబ్‌సైట్ చెక్ చేయవచ్చు. న్యూస్18 తెలుగు అఫీషియల్ ఫేస్‌బుక్ అకౌంట్ కూడా ఈ తరహా పజిల్స్ షేర్ చేసుకుంటుంది.

ఈ పజిల్స్ కేవలం కాలక్షేపం అందించడం మాత్రమే కాకుండా, మెదడుకు ఒక మంచి వ్యాయామంగా నిలుస్తాయి. చిత్రంలో దాగి ఉన్న వస్తువులను కనుగొనడానికి మనం చాలా శ్రద్ధగా పరిశీలించాలి. దీని ఫలితంగా పరిశీలనా శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

2024-04-24T11:43:45Z dg43tfdfdgfd