ఈ ఆలయంలో రామకోటి రాస్తే ఊహించని ఫలితాలు చూస్తారు..!!

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం అనే శ్లోకాన్ని కష్టాల్లో ఉన్నప్పుడు మనసులో తలచుకోగానే ఏదో తెలియని ధైర్యం కష్టాల్లోనుండి సులువుగా బయట పడే మార్గం దొరుకుతుంది అని భక్తుల నమ్మకం. అంతే కాక భయాందోళనలకు గురవుతున్నప్పుడు గానీ మానసికంగా ఆందోళనలో ఉన్నప్పుడు గాని హనుమాన్ దేవాలయాలు సందర్శిస్తే ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా స్వయంబుగా వెలసిన హనుమాన్ దేవాలయాల్లో పుస్తకాల్లో రామకోటి రాస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇలా ఎంతో విశిష్టత కలిగి ఉన్న స్వయంభువుగా వెలసిన అభయాంజనేయ స్వామి దేవాలయ చరిత్రపై హనుమాన్ జయంతి సందర్భంగా లోకల్ 18 ప్రత్యేక కథనం.

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లో స్వయంబువుగా వెలసిన శ్రీ అభయాంజనేయ దేవాలయానికి ప్రత్యేక విశిష్టతలు ఉన్నాయి. 1995 వ సంవత్సరములో శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం ఇక్కడ దొరకడం వల్లే ఇక్కడ పీఠాధిపతుల తో స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు ఆలయ పూజారి రుద్రబట్ల శ్రీకాంత్ తెలిపారు. స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తుల పూజలు అభిషేకాలు అందుకుని కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా పేరు గాంచిన దేవాలయం దిన దిన అభివృద్ది చెందినట్టు పూజారి తెలిపారు.

Free Gas and Stove: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఉచితంగా గ్యాస్ సిలిండర్, స్టవ్..

ఆలయం చుట్టూ ఆహ్లాదం..

అభయాంజనేయ దేవాలయం లో ప్రకృతి ఆహ్లాదం పంచుతూ ఆలయానికి వచ్చే భక్తులకు నీడను ఇవ్వడం తో పాటు ప్రశాంతత దొరుకుతుంది అని భక్తులు అంటున్నారు. ఆహ్లాదంతో పాటు ఆలయంలో భక్తులకు జ్ఞానోదయం చేసే భగవద్గీత, మహాభారతం, వంటి పద్యాలతో మంచి గోడలపై అమర్చారు.

రామకోటి అక్షర నామస్మరణ...

ఈ అభయాంజనేయ దేవాలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయంలో రామకోటి రాసేందుకు ప్రత్యేకంగా పుస్తకాలను ఏర్పాటు చేసారు. కోటి సార్లు రామ నామ స్మరణ రాయాలి అలా ఇప్పటి వరకు 40 లక్షల రామకోటి రాశారు భక్తులు. ప్రతి రోజు వచ్చి 108 సార్లు రామ కోటి రాసి వెళ్తారు. ఇలా చేయడం వల్ల భక్తులు కోరిన కోరికలు తీరుతాయని భక్తురాలు హారిక తెలిపారు. హారిక గత నాలుగు నెలలుగా ప్రతి రోజు ఉదయం ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని108 రామకోటి రాసి వెళ్తుంటారని హారిక తెలిపారు.

---- Polls module would be displayed here ----

ఘనంగా హనుమాన్ జయంతి...

రామగుండం ఎన్టీపీసీలో స్వయంబువుగా వెలసిన అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ప్రతి యేట ఘనంగా నిర్వహిస్తారు.భక్తులు,హనుమాన్ మాల ధరించిన స్వాముల నడుమ పర్మనెంట్ టౌన్ షిప్ లో గల్లి గాలికి హనుమాన్ యాత్ర నడుస్తుంది.ఇందులో మహిళా కోలాటం, స్వాముల ఆట పాటలు, భక్తుల ఆనందాల మధ్య జై శ్రీరామ్ అనే నిదానంతో ఈ ప్రాంతంలో హనుమాన్ జయంతి వేడుక కోలాహలంగా జరుగుతుంది.

2024-04-22T14:51:57Z dg43tfdfdgfd