ఈ ఆలయంలో స్వామి వారికి పసుపును సమర్పిస్తారు... ఈ ఆచారం ఎందుకో తెలుసా?

ఆ పరమశివుడి ప్రతి రూపమే మల్లికార్జునుడు. తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో ఒకటైన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఎంతో చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో కొలువై ఉంది. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం చాళుక్యుల కాలంలోనే నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల భిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుడి ఆ స్థానంలో మంత్రిగా ఉన్న అయ్యన్న దేవుడు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది.

ఆయన పేరు మీద ఈ ప్రాంతానికి అయినప్రోలుగా పేరు రాగా, కాలక్రమేణా అధి కాస్త అయినవోలు, ఐనవోలుగా మార్పు చెందింది. ఈ ఆలయం అష్టోత్తర స్తంభాలు, రాతి పకారాలు, విశాల మండపంతో ఒక రథాన్ని పోలి ఉండటం విశేషం. ఆలయం చాళుక్యుల కళ నైపుణ్యానికి అద్దం పడుతుంది. పూర్వం మనిమల్లారసులు అనే రాక్షసులు గోరతపస్సుతో బ్రహ్మ దేవుడిని సాక్షాత్కరింప చేసుకున్నారు.

Tirumala Rs 300 Darshanam Tickets: తిరుమలలో రూ.300 దర్శనం టికెట్స్ కావాలా? సులువుగా పొందండి ఇలా

ఎర్రబొట్టు,తెల్ల బొట్టు పెట్టుకునే వారితో మరణం లేకుండా వరం పొందారు. ఈ వర గర్వంతో ఆ రాక్షసులు ఋషులను, దేవతలను హింసిస్తుంటే వారు విష్ణు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆయన శివుడి వద్దకు వెళ్ళమన్నాడట. ఆ పరమశివుడు వారిని సంహరించే వాడిని నేనే అని అభయమిచ్చాడట.

---- Polls module would be displayed here ----

అయితే ఆ రాక్షసులను చంపడం కోసం శివుడు కర్ణాటకలోని మైలార్ ప్రాంతంలో రాజ కుటుంబంలో జన్మిస్తాడు. ఆ రాక్షసులతో యుద్ధం చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఎరుపు,తెలుపు బొట్లు ఉంటే వారు చనిపోరు కాబట్టి ఈ మైలార్ స్వామి శరీరం మొత్తం పసుపు రుద్దుకొని యుద్ధానికి వెళ్తాడు. మనిమల్లరసులను హతం చేస్తాడు. చనిపోయేముందు ఆ శివుడుని అ రాక్షసులు వరం కోరుకుంటారు. స్వామి మా పేరు మీద నిన్ను కొలవాలి అదే విధంగా మీ పాదాల కింద మా శిరస్సు ఉండాలని కోరుకుంటారు. ఆ స్వామివారు మనిమల్లసురు రాక్షసులను సంహరించారు కాబట్టి మైలర్ స్వామీ, మల్లన్న స్వామిగా అవతరించి ఇక్కడికి వచ్చి వెలిశారని చరిత్ర చెబుతుంది.

Trains Cancelled: సెలవుల్లో ఊరెళ్తున్నారా? విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు

మల్లన్న స్వామి 10 అడుగుల ఎత్తుతో విశాల నేత్రాలతో కోరమీసాలతో చతుర్భుజాల్లో ఖడ్గం, డమరుకం, పాన పాత్రలతో కనిపిస్తారు. ఇరువైపులా బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలు కొలువై ఉంటారు. ఆ స్వామివారి మొదటి భార్య బలిజ మేడలమ్మ కర్ణాటక ప్రాంతీవాసి, రెండో భార్య గొల్ల కేతమ్మ ఈమె మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ పట్టణానికి చెందిన అమ్మవారిగా చెప్తుంటారు.

ఆ మల్లన్న స్వామి గొల్ల కేతమ్మను వివాహం చేసుకున్నారు కాబట్టి గొల్ల, కురుమలంతా తమ దేవుడిగా భావిస్తుంటారని ఆలయ అర్చకులు రవీందర్ తెలిపారు. ఈ పసుపు బొట్టును బండారిగా భావిస్తుంటారని చెప్పారు. ఈ మల్లన్న స్వామి ఉన్న చోట ఆ పసుపును ఒక ఔషధంగా వాడుకుంటారని తెలిపారు. అందుకే ఈ ఆలయానికి వచ్చే భక్తులు కిలోల కొద్దిగా బండారిని తీసుకువచ్చి తమ భక్తిని చాటుకుంటారని చెప్పారు.

ఈ ఐనవోలు దేవాలయం తెలంగాణలో ఉన్న అతిముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలలో ఒకటని తెలిపారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఆ స్వామివారికి పట్నాలు, బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. నిత్యం ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు.

2024-04-24T05:12:34Z dg43tfdfdgfd