ఈ ఇమేజ్‌లోని అరటిపండును 10 సెకన్లలో కనిపెడితే.. మీ కంటి చూపు సూపర్ !..

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్లు (Brain teasers), పజిల్స్ (Puzzles) వైరల్ అవుతున్నాయి. బ్రెయిన్‌కి బోలెడంత ఎక్సర్‌సైజ్‌ అందిస్తున్నాయి. వివిధ రకాల పజిల్స్ వివిధ కోణాల్లో మెదడుకు సవాలు విసురుతున్నాయి. ఈ పజిల్స్‌లో ఆప్టికల్ ఇల్యూషన్స్‌ (Optical illusion puzzles) పజిల్స్ పాపులర్ అయ్యాయి. అవి మెదడును కొత్త మార్గాల్లో ఆలోచించేలా చేస్తాయి. సమస్యలను పరిష్కరించడానికి కొత్త వ్యూహాలను కనిపెట్టేలా మెదడును ప్రేరేపిస్తాయి. వీటిని తరచుగా సాల్వ్ చేస్తూ ఉంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అబ్జర్వేషన్‌ స్కిల్స్‌ ఇంప్రూవ్ అవుతాయి. క్రియేటివ్‌గా థింక్ చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది. వీటితో చాలా కాలక్షేపం అవుతుంది. రోజువారీ ఒత్తిడి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. ఈరోజు మీ కోసం ఒక ఛాలెంజింగ్ ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ తీసుకొచ్చాం.

* మీ ముందున్న ఛాలెంజ్‌ ఏంటంటే?

ఈ పజిల్ పిల్లలకు, ఆహార ప్రియులకు ఒక ఆహ్లాదకరమైన ఛాలెంజ్‌గా నిలుస్తుంది. ఈ ఇమేజ్‌లో పిల్లలు ఆడుకుంటున్నారు. వారి మధ్య ఒక అరటిపండు దాగి ఉంది. దానిని కనిపెట్టడమే ఈ పజిల్ టాస్క్. దీన్ని సాల్వ్‌ చేయడానికి 10 సెకన్ల సమయం మాత్రమే ఉంది. అరటి పండు (Banana) దొరకాలంటే అబ్జర్వేషనల్‌ స్కిల్స్‌ ఉపయోగించాలి. ఇమేజ్‌లోని ప్రతి చిన్న అంశంపై దృష్టి పెట్టాలి. టైమర్ స్టార్ట్ చేసి ఇమేజ్‌ను జూమ్ చేస్తూ వివరాలను పరిశీలించాలి.

ఇందులో దాగి ఉన్న అరటిపండు బాగా పండింది. అది ఎల్లో కలర్‌లో ఉంటుంది. ఆ కలర్, అరటిపండు ఆకారం కోసం వెతకడం ద్వారా ఈ పజిల్ ను త్వరగా సాల్వ్ చేయవచ్చు. అరటిపండు కనిపెట్టడంలో కష్టంగా అనిపిస్తే ఒక హింట్ కూడా ఇస్తున్నాం. అదేంటంటే ఓన్లీ ఎల్లో కలర్ ఉన్నచోట మాత్రమే గమనించాలి. పదునైన కంటి చూపు, అద్భుతమైన అబ్జర్వేషన్స్ స్కిల్స్ ఉన్నవారు మాత్రమే ఇచ్చిన సమయంలోగా పజిల్‌ సాల్వ్‌ చేయగలరు. మిగతా వారికి చాలా ఎక్కువ సమయం పట్టవచ్చు.

10 సెకన్ల లోపు అరటిపండును కనిపెడితే అభినందనలు! మీ కంటిచూపు, అబ్జర్వేషన్స్ స్కిల్స్, ఏకాగ్రత, దృష్టి అన్నీ కూడా హై-లెవెల్‌లో ఉన్నాయని పరిగణించవచ్చు. ఒకవేళ కనిపెట్టలేక పోతే టైమర్ ఆఫ్ చేసి ప్రశాంతంగా అరటి పండు కోసం వెతకవచ్చు. ఎప్పటికీ కనిపెట్టలేకపోతే కింద ఇచ్చిన సొల్యూషన్ పిక్చర్ చెక్ చేయవచ్చు.

* సొల్యూషన్ ఇదే

పైన ఇచ్చిన ఇమేజ్‌లో అరటిపండును రెడ్ కలర్ సర్కిల్‌తో హైలెట్ చేశాం. ఆ పండు చిన్న బాలుడి టీ షర్ట్‌లో తెలివిగా కలిసిపోయింది. ఈ పజిల్‌ ఎంజాయ్ చేసి ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి సవాలు విసరవచ్చు. ఇలాంటి మరెన్నో ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ సాల్వ్ చేయాలనుకుంటే న్యూస్18 తెలుగు వెబ్‌సైట్ విజిట్ చేయవచ్చు. వీటిని డైలీ సాల్వ్ చేస్తుంటే మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయని గమనించాలి. బంధుమిత్రులతో కలిసి సాల్వ్ చేస్తుంటే వారితో సంబంధాలు కూడా బలపడతాయి.

2024-05-04T09:53:00Z dg43tfdfdgfd