ఈ ఒక్క ఆకుతో.. బియ్యం, పప్పుల్లో పురుగులు తరిమికొట్టొచ్చు..!

ఈ వేప ఆకుల వాసనను పురుగులు తట్టుకోలేవు. దీంతో...తొందరగా పారిపోతాయి.మనకు ఈ పరుగుల బెడద కూడా తగ్గిపోతుంది. అయితే... పచ్చి వేపాకులంటే.. ఎండిపోయిన వేపాకులను వాడటం ఉత్తమం.

మనం ఇంట్లో నెలవారీ సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ బియ్యం, పప్పు లాంటివి మాత్రం కాస్త ఎక్కువగానే ఇంట్లో స్టోర్ చేసుకుంటాం. అందుకే.. వీటికి ఎక్కుగా పురుగులు పడుతూ ఉంటాయి. బియ్యం, పప్పులకు పురుగులు పట్టడానికి కారణాలు చాలానే ఉంటాయి. పొరపాటున కొంచెం తడి చెయ్యి వాటికి తగిలినా చాలు.. పురుగులు పుట్టుకొచ్చేస్తాయి. ఇక వండేటప్పుడు వాటిని వదిలించుకోవడానికి నానా తిప్పలు పడాల్సిందే. 

ఎన్ని సార్లు జల్లించినా, కడిగనా ఒక పట్టాన వదలవు. అలా అని... అలానే వండుకోనూలేం. ఈ పురుగులు వదిలించడానికి ఏమైనా మందులు కొడదామా అంటే... అది తినే ఆహారం అలాంటి సాహసాలు చేయలేం. మరి ఈ పురుగులు ఎలా వదిలించాలా అని అనుకుంటున్నారా..? కేవలం ఒక్క ఆకు వాడి వీటిని తరిమికొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

వేప ఆకులు మనకు ఈజీగానే దొరుకుతూ ఉంటాయి. ఈ వేప ఆకులను ఎండిపోయిన వాటిని వాడి ఈ పురుగులను తరిమికొట్టొచ్చు.  మీరు బియ్యం ఉంచే డబ్బాలో కొన్ని వేప ఆకులను వేయాలి. ఈ వేప ఆకుల వాసనను పురుగులు తట్టుకోలేవు. దీంతో...తొందరగా పారిపోతాయి.మనకు ఈ పరుగుల బెడద కూడా తగ్గిపోతుంది. అయితే... పచ్చి వేపాకులంటే.. ఎండిపోయిన వేపాకులను వాడటం ఉత్తమం.

అయితే..వేపాకులు ఒకటి, రెండు వేస్తే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి.. కాస్త ఎక్కువ మొత్తంలోనే  వేపాకులువేయాలి. అప్పుడే... తొందరగా పురుగులు వదలుతాయి. అంతేకాదు.. ఆ వేపాకులు కొంచెం కూడా తడిగా ఉండకూడదు అనే విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

వేపాకులు మాత్రమే కాదు.. వేపాకుల పొడి వాడి కూడా బియ్యం, పప్పుల్లో ఉన్న పురుగులను తరిమికొట్టొచ్చు.  ఎండిన వేపాకులను పొడి చేసి వాడాలి. అలా అని డైరెక్ట్ గా బియ్యం డబ్బా, పప్పుల డబ్బాలో ఈ పొడి చల్లకూడదు. ఈ పొడిని ఏదైనా మూటలాగా కట్టి.. ఆ డబ్బాలే వేస్తే సరిపోతుంది. ఇలా కూడా ఆ వాసనకు పురుగులు పారిపోతాయి.

ఇక ఈ పురుగులు ఎక్కువగా తేమగా ఉన్నప్పుడే ప్రవేశిస్తాయి. అందుకే.. తేమ తగలకుండా చూసుకోవాలి. మీరు బియ్యాన్ని తేమ నుండి రక్షించాలనుకుంటే, కంటైనర్‌ను తెరిచి ఉంచవద్దు. పెట్టె మూత సరిగ్గా అమర్చబడిందా లేదా అనే దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

అలాగే, బియ్యాన్ని ఏ రకమైన తడి పదార్థాలతో లేదా తడి చేతులతో ఉపయోగించకూడదు. ఇక బియ్యం, పప్పులు ఉంచే కంటైనర్ కి ఎప్పుడూ మూత ఉండేలా చూసుకోవాలి. ఇక.. వంట చేసే సమయంలో... పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి.. ఆ తర్వాతే వండుకోవాలి. 

2024-05-06T05:55:21Z dg43tfdfdgfd