ఈ జ్యోతిర్లింగాలను దర్శిస్తే.. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన పుణ్యం..

ప్రతి హిందూ సోదరుడు మన భారతదేశంలో గల 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించడం మహా పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే చాలు.. తెలియక చేసిన తప్పులన్నీ క్షమించబడతాయని భక్తుల విశ్వాసం. అందుకే కాబోలు ప్రతి హిందూ సోదరుడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించేందుకు అమిత ఆసక్తి చూపుతారు. హిందూ పురాణాల ప్రకారం ఈ జ్యోతిర్లింగాలను దర్శించిన వారికి పరమశివుడు వరాలను ప్రసాదిస్తారని భక్తులు తెలుపుతారు. అందుకే చిన్న, పెద్ద వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించేందుకు వెళుతుంటారు.

ఈ జ్యోతిర్లింగాల దర్శనంతో తమ ఇంట సౌభాగ్యం వర్ధిల్లుతుందని, తమ కుటుంబం పై పరమేశ్వరుని ఆశీస్సులు నిరంతరం ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించాలంటే వృద్ధులు, వికలాంగులు కొంత శ్రమించాల్సి ఉంటుంది. కాగా ఇటువంటి వారి కోసం మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో కాశీ నుండి తెచ్చిన ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్టించారు. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించలేని వారు ఈ ఆలయానికి వస్తే చాలు అంతటి మహా పుణ్య భాగ్యం కలుగుతుందని స్థానిక ఆలయ అధిపతిశ్రీ హరి హరా నంద స్వామి తెలిపారు.

ఈ ఇళ్లే నందనవనం.. రూపకర్త ఎవరో తెలుసుకుందాం..

అనంతసాగర్ లో త్రిమూర్తుల హరిహర దేవాలయం వెలసి ఉంది. ఈ ఆలయంలో లోక కళ్యాణం కొరకు ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్టించారు. హరిహర దేవాలయంలో గల ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే చాలు తమ కోరికలు సిద్ధిస్తాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఎక్కువగా సంతానలేమి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు సంతాన భాగ్యం కలుగుతుందని ఆలయ అధిపతితెలిపారు.

ఇంకా ఆలయ అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయని, ఎందరో దాతలు ఆలయ నిర్మాణానికి సహకరించినట్లు తెలిపారు. ఎవరైనా దాతలు ఆలయ నిర్మాణానికి సహకరించేందుకు తమను సంప్రదించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆలయంలో ప్రతిష్టించిన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుని పునీతులు కావాలని కోరారు. అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించే భాగ్యం కోసం మీరు వేచి ఉన్నారా అయితే ఈ హరిహర దేవాలయంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించండి మరి.

2024-04-23T11:40:00Z dg43tfdfdgfd