ఈ తేదీల్లో పుట్టిన వారికి కోపం ఎక్కువ.. దూకుడు తగ్గించుకోకపోతే ఇబ్బందులు తప్పవు..!

న్యూమరాలజీ ప్రకారం.. పుట్టిన తేదీల ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వం, స్వభావాన్ని అంచనా వేయవచ్చు. డేట్ ఆఫ్ బర్త్‌తో అన్ని సంఖ్యలనూ యాడ్ చేస్తే, ఒక లైఫ్ పాత్ నంబర్ వస్తుంది. ఇది వ్యక్తుల గుణగణాలు, లక్షణాలను సూచిస్తుంది. ఈ సంఖ్యల ఆధారంగా వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందనేది సైతం న్యూమరాలజిస్టులు విశ్లేషిస్తారు. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి విభిన్నమైన ఎమోషన్స్ ఉంటాయి. కొందరు చాలా ఎక్కువగా కోప్పడతారు. ప్రతి విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తారు. వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏయే తేదీల్లో పుట్టిన వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయో పరిశీలించండి.

నెలలో 9వ తేదీన జన్మించిన వ్యక్తులు

ఏదైనా నెలలో 9వ తేదీన పుట్టిన వ్యక్తులు ఆవేశం వంటి తీవ్రమైన ఫీలింగ్స్‌కు ఈజీగా లోనవుతారు. అభిరుచి, న్యాయం వంటి భావనలు నంబర్ 9కి ముడిపడి ఉంటాయి. అందుకే వీరు ఎమోషనల్‌గా బలమైన వ్యక్తిత్వం ఉన్నవారిగా గుర్తింపు పొందుతారు. వీరికి సామాజిక సమస్యలు, నైతికతపై బలమైన భావాలు ఉంటాయి. అందుకే అన్యాయాలను లేదా అతిక్రమణలను చూసినప్పుడు వీరు చాలా వేగంగా కోపం, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు.

ఏదైనా నెలలో 18వ తేదీన జన్మించిన వ్యక్తులు

ఈ తేదీన పుట్టిన వ్యక్తులు చాలా త్వరగా రియాక్ట్ అవుతారు. త్వరగా ఉద్రేకానికి గురవుతారు. ఆవేశంతో ఊగిపోతూ ఎదుటి వారిపై కోపం ప్రదర్శిస్తారు. 1, 8 సంఖ్యల శక్తి ఇండిపెంటెంట్ నంబర్ 18ను సృష్టించింది. ఇది ఆశయం, స్వాతంత్ర్యం వంటి భావాల కలయికను సూచిస్తుంది. కానీ ఈ కలయిక చిరాకు, అసహనం కూడా కలిగిస్తుంది. తద్వారా ఈ కాంబినేషన్ కోపం సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

నెలలో 27వ తేదీన జన్మించిన వ్యక్తులు

వీరికి ఎమోషనల్‌ సెన్సిటివ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వీరు కోపాన్ని, ఆవేశాన్ని మరింత బలంగా చూపుతారు. స్వతంత్రత, హామీని సూచించే నంబర్ 7; ప్రేమ, దయగల స్వభావాన్ని సూచించే 2 కలిసి నంబర్ 27 ఏర్పడుతుంది. ఈ కాంబినేషన్ వల్ల కలిగే అంతర్గత ఇబ్బందులు భావోద్వేగాలపై ప్రభావం చూపి, కోపాన్ని కలిగిస్తాయి.

నెలలో 30వ తేదీన పుట్టిన వ్యక్తులు

వీరు వినూత్న మార్గాల్లో ఆవేశాన్ని వ్యక్తం చేస్తారు. నంబర్ 30 అనేది లవ్, కేరింగ్‌ను సూచించే 0; ఊహాత్మకంగా, ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండే 3 కలిసి ఏర్పడుతుంది. ఈ కాంబినేషన్‌ కారణంగా ప్రజలు తమ నిరాశను మాటల ద్వారా లేదా కళాత్మకంగా తెలియజేయవచ్చు.

ఏదైనా నెలలో 29వ తేదీన పుట్టిన వ్యక్తులు

ఈ తేదీన పుట్టిన వారికి త్వరగా ప్రతిస్పందించే లక్షణం ఉంటుంది. వీరు ఆలోచన లేకుండా హఠాత్తుగా ఆవేశాన్ని ప్రదర్శిస్తారు. 2, 9 సంఖ్యల శక్తులు ధైర్యంగా, ఆవేశపూరితంగా ఉంటాయి. ఈ కాంబినేషన్‌తో ఏర్పడిన నంబర్ 29 ప్రత్యేకమైనది. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, ఈ కలయిక తొందరపాటును సూచిస్తుంది, ఎమోషనల్ రియాక్షన్స్, చిరాకును కలిగిస్తుంది.

2024-04-25T14:02:49Z dg43tfdfdgfd