ఈ నట్స్ తింటే నడుము చుట్టుకొలత తగ్గుతుందట..

ఎవరైనా సరే నడుము సన్నగా, నాజూగ్గా ఉండాలని కోరుకుంటారు. దానికోసం ఈ నట్స్ డైట్‌లో చేర్చుకుంటే రిజల్ట్ ఉంటుందట. అవేంటో తెలుసుకోండి.

నట్స్ హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇందులోని పోషకాలు వేటికి సాటిరావు. ఇవి తినడానికి ఎంత బావుంటాయో.. ఇందులో హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే, వీటిలోకొన్నింటిని తినడం వల్ల బెల్లీ ఫ్యాట్, నడుము చుట్టుకొలతని తగ్గిస్తాయట. అవేంటో తెలుసుకోండి. బాదం..

బాదంలో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి వెయిట్ మేనేజ్‌మెంట్‌లో హెల్ప్ చేస్తాయి. ఇందులో మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్, ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల చాలా వరకూ కడుపు నిండుగా ఉండి వెయిట్ మేనేజ్‌మెంట్‌లో హెల్ప్ చేస్తాయి.

షుగర్ పేషెంట్స్‌కి హెల్ప్ చేసే నట్స్..​ ​

జీడిపప్పు..

మిగతా నట్స్‌తో పోలిస్తే జిడిపప్పులో హెల్దీ మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటితో పాటు ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటాయి. దీని వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి దూరమవుతుంది.

మకాడమియా నట్స్..

ఈ నట్స్‌ లో గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు బ్యాలెన్స్‌గా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి, గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. అదే విధంగా, వీటిని తినడం వల్ల హెల్దీ మెంటెయిన్ చేయొచ్చు. ​Also Read : వర్కౌట్స్ చేసేవారు ప్రోటీన్ కచ్చితంగా తీసుకోవాలి.. ఎందుకంటే..

వాల్నట్స్..

వాల్నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకున్నప్పుడు వీటిని మితంగా తీసుకోవాలి. ​Also Read : పరగడపున ఈ డ్రింక్స్ తాగితే బెల్లీ, బరువు.. రెండూ తగ్గుతాయి..

వీటిని డైట్‌లో చేర్చితే..

ఈ నట్స్ డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల పోషకాలు అందుతాయి. వీటిని తీసుకుంటే వర్కౌట్ చేయడం, కేలరీలను తగ్గించడం వంటివి చేస్తే బరువు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

గమనిక : ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.​Read More : Fitness News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T01:49:44Z dg43tfdfdgfd