ఈ యువకుడి చేత టాటూల కోసం క్యూ కడుతున్నారు.. ఏంటా స్పెషల్..

ఫ్యాషన్ దునియాను కొత్త పుంతలు తొక్కిస్తున్నదానిలో టాటూ ఒకటి. ఒకప్పుడు పల్లెల్లో పచ్చబొట్టు వేయించుకునే వారు. కానీ అది ఇప్పుడు టాటూగా చలామణిలోకి వచ్చి నగరాల్లో కొత్త పుంతలు తొక్కుతోంది. పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఈ టాటూ సంస్కృతి ఇప్పుడు అంతటా విస్తరించింది. తమకు ఇష్టమైనవారు, నచ్చిన వారి పేర్లు, దైవాల పేర్లు శరీరంపై టాటూ వేయించుకోవడమే కాకుండా నచ్చిన వారి ఫోటోలను కూడా టాటూ రూపంలో అచ్చువేయించుకొని తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటున్నారు.

కొందరు అభిమాన నాయకులవి వేయించుకుంటే, మరికొందరు నచ్చిన హీరోల బొమ్మలు వేయించుకుంటున్నారు. మరికొందరు తమ కుటుంబ సభ్యుల పేర్లో లేక తాము ఇష్టపడే వారి పేర్లు లేక బొమ్మలు వేయించుకుంటున్నారు. ముఖ్యంగా యువతలో ఈ టాటూకు బాగా క్రేజ్ పెరిగిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ ఇష్టపడేది టాటూ. ఒకప్పుడు కొందరికే పరిమితమైంది కాని అందరూ ఇష్టపడుతుండటంతో ప్రస్తుతం ఇదే ఫ్యాషన్ గా కూడా కొనసాగుతోంది.

రూ.300 నుంచి రూ.10 లకు.. రూ.లక్ష నుంచి రూ.50 వేలకు .. ఇక్కడ స్పెషల్ ఏంటంటే..

అయితే ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వంశీ అవదుర్తి అనే యువకుడు కొత్త టాటూ స్టూడియోను నెలకొల్పాడు. గతంలో బెంగుళూరు, హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో పనిచేసి టాటూకు సంబంధించిన పలు విషయాలను నేర్చుకున్నాడు. తర్వాత తన స్వగ్రామంలోనే స్టూడియో నెలకొల్పి ఉపాధి పొందాలనుకొని ఇక్కడికి వచ్చి టాటూ స్టూడియోను నెలకొల్పాడు. పర్మినెటంట్ టాటూ, టెంపరర్ టాటూ ఇలా రకరకాల టాటూ వేస్తు ఆకట్టుకుంటున్నారు. అందమైన అక్షరాలతో పేర్లను వేయడమే కాకుండా పక్షులు, ఇతర బొమ్మలను ఆకర్షణీయంగా టాటూ వేస్తున్నాడు.

బాల సంస్కార్ తరగతుల బాట పడుతున్న చిన్నారులు.. ఎందుకంటే ?

దీంతో యువకులు ఈ టాటూకు ఆకర్శితులై వంశీవద్ద టాటూ వేయించుకునేందుకు వస్తున్నారు. డిజైన్ ను బట్టి సమయం పడుతుందని వంశీ న్యూస్ 18 కు తెలిపారు. రెండు మూడు వేల రూపాయల నుండి పది, పదిహేను వేల రూపాయల వరకు ఒక్కో టాటూ చార్జి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే అక్షరాలతో పేర్లు వేయడానికి మాత్రం 450 రూపాయల నుండి ధర మొదలవుతోంది. కాగా ప్రస్తుతం ఆదిలాబాద్ లో ఈ టాటూకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని వంశీ చెప్పారు. ప్రస్తుతం పని బాగానే ఉందని పేర్కొన్నాడు. కంప్యూటర్ సహాయంతో ప్రత్యేక డిజైన్లను ఎంపిక చేసుకొని కస్టమర్ల అభిరుచి మేరకు టాటూ వేస్తు ఆకట్టుకుంటున్నాడు. అటు యువకులు కూడా ముచ్చట పడి మరీ వచ్చి టాటూ వేయించుకొని వెళుతున్నారు.

2024-05-08T08:52:17Z dg43tfdfdgfd