ఈ రామభక్తుడు తాళపత్రాలపై రామాయణం రాసేశారు... ఎన్నిరోజులు పట్టిందో తెలుసా?

రామాయణం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంథం. విష్ణుమూర్తి ధరించిన దశావతారాలలో ముఖ్యమైన శ్రీరామ అవతార విశిష్టతను వివరించే మహాకావ్యం రామాయణం. నాడు వాల్మీకి ఈ గ్రంథాన్ని రచించి మానవాళికి ఆ రాముని గుణగణాలను వివరించారు. అయితే ప్రస్తుతం వాల్మీకి రామాయణ స్ఫూర్తితో తాళపత్రాల మీద మరోసారి రామాయణాన్ని క్లుప్తంగా లెక్కించి తన భక్తిని చాటుకున్నారు ఈ భక్తుడు. ఈయన పేరు బొమ్మ రాతల ఎల్లయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మణుగూరు గ్రామ నివాసి.

ప్రభుత్వ రంగ సంస్థల సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగిగా విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. వాల్మీకి రచించిన రామాయణాన్ని క్లుప్తంగా, సరళంగా మరోసారి లిఖించాలనిసంకల్పించారు . దీనికోసం నాలుగేళ్ల పాటు శ్రమించి అనంతరం గత ఏడాది తాటి ఆకులపై మరోసారి రామాయణాన్ని రచించారు . నాడు వాల్మీకి రచించిన రామాయణంలోని ఏడు ఖండాలను ఆరు పదుల వయసులో నేడు క్లుప్తంగా తాటి ఆకులపై ఎల్లయ్య రచించిన తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లోకల్ 18 సదరు ఎల్లయ్యను సంప్రదించగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.

Tirupati Tour: జస్ట్ రూ.3,500 కే తిరుపతి టూర్ ప్యాకేజీ... తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, బస ఉచితం

---- Polls module would be displayed here ----

"మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో 30 సంవత్సరాలకు పైగా ఉద్యోగిగా విధులు నిర్వహించి ప్రస్తుతం రిటైర్డ్ అయ్యాను. ఉద్యోగం చేస్తున్న నాటి నుంచే వాల్మీకి రచించిన రామాయణాన్ని మరోసారి తాళపత్రాలపై రచించాలని సంకల్పించాను.నాడు ఉద్యోగంలో ఉన్న ఒత్తిళ్లవల్ల సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ అయ్యాక నాడు సంకల్పించిన సంకల్పాన్ని పూర్తి చేయాలని అనుకున్నాను. ఇందుకోసం తాటి ఆకులను సేకరించి, రచించేందుకు వీలుగా వాటన్నిటిని ఒకే మాదిరిగా తయారు చేయడం జరిగింది. అనంతరం రామాయణంలోని ఆదికాండం మొదలు, వాల్మీకి రచించిన ఏడు ఖండాలను నేటి తరానికి అర్థమయ్యే రీతిలో సరళంగా క్లుప్తంగా రచించడం జరిగింది. ఇందుకోసం సుమారు నాలుగు సంవత్సరాల సమయం కేటాయించవలసి వచ్చింది. ప్రస్తుతం ఈ ఏడాది జరగబోయే శ్రీరామనవమి వేడుకల సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ తాళపత్రాలను అందించాలని భావిస్తున్నాను"

Tirumala Alert: ఏప్రిల్‌లో తిరుమల వెళ్తున్నారా? ఈ తేదీలు గుర్తుంచుకొని దర్శనం ప్లాన్ చేసుకోండి

ఆరోగ్యం సహకరిస్తే మరికొన్ని పురాణ గ్రంథాలను సైతం ఇదే మాదిరిగా తాళపత్రాలపై లిఖించాలని అనుకుంటున్నాను అంటూ ఎల్లయ్య తెలియజేస్తున్నారు.

2024-03-28T05:28:23Z dg43tfdfdgfd