ఈ సూపర్‌ డ్రింక్‌ తో అన్నీ జబ్బులు మాయం.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

Okra Water: ఇప్పటి వరకు మీరు చాలా హెల్తీ డ్రింక్స్‌ గురించి వినే ఉంటారు. ఇవి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఇన్‌స్టంట్‌ ఎనర్జీ అందిస్తాయి. ఈ లిస్టులో చియా విత్తనాల నీరు, తేనె కలిపిన నిమ్మరసం, వివిధ రకాల కూరగాయాల జ్యూస్‌లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మరో స్పెషల్‌ వాటర్‌(Water) పాపులర్‌ అవుతోంది. అదే బెండకాయ వాటర్‌ (Okra Water). అటు రుచికి రుచి, ఇటు సమృద్ధిగా పోషకాలు అందించే బెండకాయని ఇప్పుడు కొత్తగా ఎక్స్‌పీరియన్స్‌ చేయవచ్చు. బెండకాయ వాటర్‌ వళ్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* బెండకాయ వాటర్‌ తయారీ

బెండకాయ వాటర్‌ తయారీకి.. ముందుగా బెండకాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. రాత్రంతా వాటిని నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి.

* హైడ్రేషన్

ఉదయం ఖాళీ కడుపుతో బెండకాయ వాటర్ తాగితే శరీరం హైడ్రేట్‌గా మారుతుంది. శరీరంలో లిక్విడ్ లెవల్స్ బ్యాలెన్స్‌ అవుతాయి. ఎందుకంటే బెండకాయలు నీటికి రుచిని పెంచుతాయి. వేసవిలో డీహైడ్రేషన్ బారి నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే బెండకాయ వాటర్ తాగడం బెటర్.

Milk: వేడి చేస్తుండగా పాలు పొంగితే.. శుభసూచకం కాదు అరిష్టమే

* యాంటీఆక్సిడెంట్స్

బెండకాయ వాటర్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఫలితంగా శరీర రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వివిధ సీజన్‌లలో వచ్చే రోగాల బారి నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు.

* గుండె ఆరోగ్యం

బెండకాయ వాటర్‌లో ఫైబర్, పెక్లిన్ కాంపౌండ్‌ ఉంటుంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. బెండకాయ వాటర్ పరగడుపున తాగడం వల్ల బరువు తగ్గే ప్రయోజనాలు పొందవచ్చు. క్యాన్సర్ రిస్క్ తగ్గించే గుణాల్లో కూడా ఉంటాయి.

* మెండుగా పోషకాలు

బెండకాయ వాటర్‌లో ఫైబర్, విటమిన్ కె, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. బెండకాయ వాటర్ తరచుగా తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఫలితంగా మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

* జీర్ణ ఆరోగ్యం

బెండకాయ వాటర్‌లో ఫైబర్ కంటెంట్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. ఈ వాటర్ తాగడం వల్ల పేగుల్లో కదలికలు వస్తాయి. మొత్తంగా జీర్ణక్రియ బాగుపడుతుంది.

* రక్తంలో షుగర్ నియంత్రణ

రక్తంలో చక్కెర లెవల్స్‌ను నియంత్రించడంలో బెండకాయ వాటర్ బాగా పనిచేస్తుంది. బెండకాయలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర లెవల్స్‌ను సమర్థవంతంగా మెయింటైన్‌ చేయవచ్చు. అయితే ఇది ప్రాథమిక పరిశోధన ఫలితం మాత్రమే. పూర్తి ప్రయోజనాల కోసం లోతైన అధ్యయనం అవసరం.

* కూరగాయతో బోలెడన్ని బెనిఫిట్స్..

బెండకాయ వాటర్ అన్ని రకాల సమస్యలకు అద్భుత నివారిణి కాదనే విషయాన్ని గుర్తించుకోవాలి. దీని ప్రయోజనాలు వ్యక్తుల ఆధారంగా మారవచ్చు. నీటిలో నానబెట్టినప్పుడు బెండకాయ స్లిమ్ టెక్స్చర్ అందరికీ ఒకే రకంగా పనిచేయకపోవచ్చు. అందుకే బెండకాయ వాటర్‌ను డైట్‌లో భాగం చేసుకునే ముందు వైద్యుడుని సంప్రదించడం బెటర్.

2024-03-27T15:41:59Z dg43tfdfdgfd