ఎండలు దంచినా నో టెన్షన్.. వంటింట్లో ఈ అద్భుతమైన మూలిక ఉంటే చాలు

మనం రోజులో మొదట ఏ ఆహార పదార్థాలు తీసుకుంటామో, వాటి ప్రభావం ఆ రోజంతా కనిపిస్తుంది. సాధారణంగా చాలామంది ఉదయాన్నే హాట్ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం పరగడుపున మెంతుల నీరు (Fenugreek water) తాగడాన్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల శక్తి పెరుగుతుంది, ఉదయం పూట కలిగే ఆందోళన (Morning anxiety) తగ్గుతుంది, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మెంతులు అనేక ఔషధ గుణాలు కలిగిన ఒక అద్భుతమైన మూలిక. వీటిని రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఎన్నో లాభాలు పొందవచ్చు. వేసవి (Summer)లో ఎండలు పెరిగే కొద్దీ, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరింత జాగ్రత్తగా ఉండాలి. మెంతుల నీళ్లు ఎండాకాలంలో హెల్త్‌ డ్రింక్‌లా పని చేస్తాయి. ఈ నీళ్లు రోజూ ఉదయం తాగితే ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో చూద్దాం.

జీర్ణవ్యవస్థ అభివృద్ది

మెంతులలో జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే నేచురల్ యాంటాసిడ్లు (Antacids) ఉంటాయి. వేసవి (Summer)లో ఎక్కువగా వేధించే అజీర్తి, వికారం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించుకోవడానికి మెంతుల నీళ్లు తాగాలి.

మధుమేహం నియంత్రణ

కొన్ని అధ్యయనాల ప్రకారం, ఒక గ్లాసు గోరువెచ్చని మెంతుల నీరు తాగితే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ రోజుల్లో ఈ వ్యాధి బారిన చాలామంది పడుతున్నారు. మధుమేహం రాకుండా చూసుకోవడానికి ప్రతి రోజూ ఉదయం తాగుతుండాలి.

బరువు తగ్గడం

మెంతుల నీళ్లలో ఫైబర్, మెటబాలిజంను వేగవంతం చేసే కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మెటబాలిజంను మెరుగుపరచడమే కాకుండా, ఆకలిని అదుపులో ఉంచుతాయి. తినాలనే కోరికను నియంత్రిస్తాయి, తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తాయి. ఫలితంగా బరువు తగ్గడానికి కారణమవుతాయి.

ఈ రోజుల్లో కోటీశ్వరులు కావడం సో ఈజీ.. సింపుల్‌గా ఈ స్టెప్ తీసుకోండి చాలు!!

LDL స్థాయిలు, చెడు కొలెస్ట్రాల్‌కి చెక్‌

మెంతుల్లో ఫ్లేవనాయిడ్స్ అనే పదార్థాలు ఉంటాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను సహజంగా తగ్గించగలవు. అధిక LDL స్థాయిలు ఉన్నవారు ఖాళీ కడుపుతో వేడి మెంతుల నీటిని తాగుతూ మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

డీహైడ్రేషన్‌ దూరం

ఖాళీ కడుపుతో మెంతుల నీరు తాగితే శరీరానికి అవసరమైన హైడ్రేషన్ లభిస్తుంది. శరీరంలోని విష తుల్యాలను బయటకు పంపి, శరీర పనితీరును మెరుగుపరుస్తుంది.

ఇతర ప్రయోజనాలు

మెంతుల నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. స్కిన్ pH లెవెల్‌ను బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుంది. చర్మం దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి, అందువల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెంతులు శరీరాన్ని చల్లబరుస్తాయి, వేడిని తట్టుకోవడంలో కావాల్సిన శక్తిని అందిస్తాయి.

మెంతులను విత్తనాలు, పొడి, క్యాప్సూల్స్ లేదా వంటకాల్లో ఒక పదార్థంగా రూపంలో తీసుకోవచ్చు. మొదట కొద్ది మోతాదులో ప్రారంభించి, మెల్లగా మోతాదును పెంచడం మంచిది. అధికంగా తింటే అజీర్తి సమస్యలు రావచ్చు. రుచి కోసం ఈ వాటర్‌లో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కూడా కలుపుకోవచ్చు.

2024-04-20T05:50:36Z dg43tfdfdgfd