ఎండాకాలంలో రోజూ పుచ్చకాయను తింటే ఏమౌతుందో తెలుసా?

ఈ సమ్మర్ సీజన్ లో పుచ్చకాయలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండు టేస్టీగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ పండును రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

 

పుచ్చకాయలో 95% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. అందుకే ఎండాకాలంలో పుచ్చకాయను తింటే శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. 

 

పుచ్చకాయలో  అమైనో యాసిడ్ 'సిట్రులిన్'  పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

 

పుచ్చకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇలాంటి పుచ్చకాయను మీరు రెగ్యులర్ గా తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

 

పుచ్చకాయలో మన శరీరానికి మేలు చేసే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును రోజూ తింటే మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 

 

పుచ్చకాయలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయను తింటే మీ ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. 

 

పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటుగా ఇతర విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

 

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చాలి. 

2024-04-27T07:05:31Z dg43tfdfdgfd