ఎండాకాలంలో శృంగార కోరికలు పెరగడానికి కారణాలివే..

చాలా మందికి సమ్మర్‌లో శృంగార కోరికలు పెరుగతాయి. దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

కోరికలు కలగడం, శృంగారం చేయాలనుకోవడం.. రెండూ కూడా ఆరోగ్యకరమైన శరీర లక్షణమే. అయితే, ఎండాకాలంలో ఈ కోరికలు మరింతగా పెరుగుతాయి. ఎందుకంటే, వేసవి, మానసిక స్థితి, లైంగిక కోరికలు మొదలైన వాటితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అలసట, డిప్రెషన్‌గా ఉంటే లైంగిక కోరికలు అంతగా ఉండవు. అదే సమయంలో సూర్యకాంతి అనేది ఉద్రేకం, శక్తిని ఎఫెక్ట్ చేసి లైంగిక కార్యకలాపాలను పెంచుతాయి. కారణాలు ఏంటో తెలుసుకోండి. సూర్యరశ్మి..

ఎండలో సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల సెరోటోనిన్ పెరుగుతుంది. ఇది మంచి హార్మోన్. ఇది మానసిక స్థితిని మెరుగ్గా చేసి వేడి వాతావరణం, రక్తప్రసరణ పెరుగుదలకి కారణమవుతుంది. ఇవి లైంగిక ఉద్రేకాన్ని పెంచుతాయి. దీని వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అయి కోరికలు పెరుగుతాయి.

చెమట ఎక్కువగా పోవడం వల్ల..

వర్కౌట్ చేసిన వారికి ఎక్కువగా శృంగార కోరికలు ఉంటాయి. దీనికి కారణం చెమట బయటికి రావడం. దీని వల్ల స్త్రీ, పురుషుల్లో మానసిక స్తితి మెరుగ్గా మారి ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు, ఆకర్షణ పెరిగి లైంగిక కోరికలు పెరుగుతాయి. ​Also Read : పెళ్ళి చేసుకున్నవారు ఈ తప్పులు చేస్తే అస్సలు మంచిది కాదట..

విటమిన్ డి కారణంగా..

సూర్యరశ్మికి ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయి. ఇవి మగవారు, ఆడవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. టెస్టోస్టెరాన్ అనేది లైంగిక జీవితానికి సంబంధించిన హార్మోన్. దీని కారణంగా విటమిన్ డి 20 నుంచి 40 సంవత్సరాల వయసు గల మహిళల స్థితిని మెరుగ్గా చేస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది. విటమిన్ డి లోపం ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం. ​Also Read : కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా.. ఇలా చేయండి..

నిద్రలేమి..

ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నిద్రలేమి ఉంటుంది. ఈ నిద్ర లేకపోవడం వల్ల ఆకర్షణ పెరిగి శృంగార కోరికలు పెరుగుతాయి. వీటితో పాటు ఎక్కువగా వర్కౌట్ చేసినా, నడిచినా కూడా ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. ఎండార్ఫిన్స్, డోపమైన్, సెరోటోనిన్ మొదలైనవాటిని పెంచి కోరికల్ని పెంచుతాయి. ​Read More : Relationship News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-22T12:19:51Z dg43tfdfdgfd