ఎముకలు ఉక్కులా మారడానికి పెరుగును ఇలా తినండి..

భారతదేశంలో ప్రస్తుతం ఎండాకాలం (Summer) నడుస్తోంది. ఈ కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఎనర్జీని పెంచే ఆహార పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోవాలి. అయితే ఈ సమ్మర్‌లో తినడానికి ప్లెయిన్ యోగర్ట్ (Plain yoghurt) కంటే ఆరోగ్యకరమైనది మరొకటి లేదని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటూనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. డిన్నర్ మీల్‌లో భాగంగా దీనిని తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలను అందుకోవచ్చు.

రాత్రి వేళ తీసుకోవడం కుదరకపోతే, రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చు. ప్లెయిన్ యోగర్ట్ తీపి, ఉప్పు రెండు రకాల వంటకాల్లో ఉపయోగించవచ్చు. స్మూతీల నుంచి మెరినేడ్లు, సలాడ్ డ్రెస్సింగ్స్‌ వరకు, యోగర్ట్ ఇష్టమైన వంటకాలకు ఒక క్రీమీ టెక్చర్, టాంగ్‌గీ రుచిని జోడిస్తుంది. ప్లెయిన్ యోగర్ట్‌ను మంచి బ్యాక్టీరియాతో పాలు పులియబెట్టి తయారు చేస్తారు. తరచూ ప్లెయిన్‌ యోగర్ట్‌ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

* మెండుగా ప్రోబయోటిక్స్‌

ప్లెయిన్ యోగర్ట్‌లో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో పేగుల్లో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మొత్తం పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బ్లోటింగ్, మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలను తగ్గించడానికి క్రమం తప్పకుండా ప్రోబయోటిక్స్ తీసుకోవడం మంచిది.

* రోగనిరోధక శక్తి

ప్లెయిన్ యోగర్ట్‌లో ఉండే ప్రోబయోటిక్స్ (Probiotics) రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. హెల్తీ గట్ మైక్రోబయోమ్ రోగనిరోధక శక్తికి చాలా అవసరం. ఇది హానికరమైన బ్యాక్టీరియా, వ్యాధికారకాల వృద్ధిని అడ్డుకుంటుంది. క్రమం తప్పకుండా ప్లెయిన్ యోగర్ట్‌ తింటే శరీర సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు. తరచూ వేధించే అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

* హై క్వాలిటీ ప్రోటీన్‌

శరీర కణజాలాలను నిర్మించడానికి, బాగుచేయడానికి, కండరాల పెరుగుదలకు మద్దతు ఇవ్వడానికి, బలమైన రోగనిరోధక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రోటీన్ అవసరం. ప్లెయిన్ యోగర్ట్‌లో హై క్వాలిటీ ప్రోటీన్‌ లభిస్తుంది. మాంసం తినకుండా ఉండే వారికి, మాంసం తీసుకోకుండా ప్రోటీన్ స్థాయిలను పెంచాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

---- Polls module would be displayed here ----

* చర్మానికి మేలు చేస్తుంది

ప్లెయిన్‌ యోగర్ట్‌ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. యోగర్ట్‌ను చర్మానికి అప్లై చేస్తే సన్‌బర్న్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలానే మొటిమల వాపును కూడా తగ్గించవచ్చు. డ్రై స్కిన్‌ని మృదువుగా మార్చుకోవచ్చు. దీనిలోని లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను సున్నితంగా తొలగించి, మరింత మృదువైన, ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుంది.

* ఎముకల ఆరోగ్యం

బలమైన, ఆరోగ్యకరమైన ఎముకల కోసం కాల్షియం, విటమిన్ డి పోషకాలు అందేలా చూసుకోవడం ముఖ్యం. ప్లెయిన్ యోగర్ట్‌లో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. కాల్షియం ఎముక సాంద్రతను కాపాడుకోవడానికి, ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధులను నివారించడానికి చాలా అవసరం. కొన్ని రకాల యోగర్ట్స్‌లో విటమిన్ డి ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది.

2024-04-20T06:35:35Z dg43tfdfdgfd