ఎర్రని ఎండలో తాటి ముంజలకు భలే గిరాకీ... సూపర్ సేల్ అంటున్న వ్యాపారులు !

వేసవి ఎండలు ముదిరిపోయి వేసవి తాపంతో జనం అల్లాడి పోతున్నారు. ఈ సమయంలో ప్రజలు వేసవి తాపం నుండి ఉపశమనం కోసం శరీరానికి చలువ చేసే పండ్ల రసాలు, ఇతర పానీయాలను తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. అయితే ఈ ఎర్రటి ఎండలో ప్రకృతి సిద్దంగా లభించే తాటి ముంజలు శరీరానికి చలువ చేస్తాయి. అందుకే వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎటు చూసిన ఈ తాటి ముంజలు కనిపిస్తాయి. పట్టణాల విషయం ఎలా ఉన్నా పల్లెల్లో మాత్రం పొలం గట్లు, ఖాళీ స్థలాల్లో ఏపుగా పెరిగిన తాటి చెట్లకు ఈ ముంజలు విరివిగా లభిస్తాయి.

అయితే వేసవి ఆరంభం నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పల్లెల్ల నుండి ఈ ఎండా కాలంలో తాటి ముంజలను పట్టణాలకు తెచ్చి విక్రయిస్తూ కొందరు ఉపాధిని కూడా పొందుతున్నారు. మరికొందరు రహదారుల పక్కన పెట్టి అప్పటికప్పుడు కోసి ఇస్తుండటంతో ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు బారులుదీరుతున్నారు. వీటికి ఆదిలాబాద్ జిల్లాలో భలే గిరాకీ ఉంది. ప్రజలు ఎంతో ఇష్టంగా వీటిని కొనుగోలు చేసుకొని వెళుతున్నారు. అయితే లేత తాటి ముంజలు, ముదురు తాటి ముంజలు రెండు రకాలు అందుబాటులో ఉన్నప్పటికి ప్రజలు లేత తాటి ముంజలనే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు.

---- Polls module would be displayed here ----

అయితే ప్రతి సంవత్సరం ఎండా కాలంలో ప్రజలు మామిడి పండ్లను ఎంత ఇష్టంగా తింటారో, ఈ తాటి ముంజలను కూడా అంతే ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. వేసవి కాలంలో ప్రకృతి ప్రసాదించే చక్కటి ఆహారం తాటి ముంజల. ఏప్రిల్ ,మే నెలల్లో విరివిగా లభించే ఈ తాటి ముంజలు చక్కటి పోషకాహారంగా కూడా పనిచేస్తాయి. వీటితో వేసవి తాపం తీరడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ తాటి ముంజల్లో బి విటమిన్ ఉందని, ఢీహైడ్రేషన్ కాకుండా కూడా కాపాడుతాయని వైద్యులు పేర్కొంటున్నారు.

అయితే ఈ ఎండా కాలం కొందరు ఈ తాటి ముంజల వ్యాపారం చేస్తూ ఉపాధిని కూడా పొందుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్ మండలాల్లో తాటి చెట్లు బాగా ఉన్నాయి. ఇక్కడి నుండి కొందరు హోల్ సేల్ గా తాటి కాయలను కొనుగోలు చేసుకొని తీసుకొని ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రధాన కూడల్లో పెట్టి అప్పటి కప్పుడు నుండి వాటి నుండి లేత తాటి ముంజలను కోసి ఇస్తున్నారు.

ఈ సమ్మర్ కి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇదే.. ఓ లుక్కేయండి..

డజను తాటి ముంజలు 120 రూపాయల ధర పలుకుతున్నాయి. కొందరు లేత ముంజలు విక్రయిస్తుంటే మరికొందరు కొంత ముదురు తాటి ముంజలను తోపుడు బండ్లపై ఉంచి అమ్ముతున్నారు. ఏదిఏమైతేనేం ప్రకృతి సిద్దంగా కాలానుగుణంగా లభించే పండ్లు, కాయలను తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నది పెద్దల మాట.

2024-04-29T14:03:59Z dg43tfdfdgfd