ఏ డిజైన్ అయినా నిమిషాల్లోనే.. ఈ యంత్రం పనితీరు సూపర్!

ప్రస్తుత సమాజంలో చేతి వృత్తిదారులకు అంతగా ఆదరణ లేదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో చేతి వృత్తిదారులు సైతం కొత్త పుంతలతో ఆధునిక యంత్రాలతో నూతన హంగులతో ప్రజల ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తూ సఫలం అవుతున్నారు. ఇలా వుడ్ వర్క్ చేసే ఓ వడ్రంగి వృత్తిదారుడు రూ. 6,50,000 లతో ఓ యంత్రాన్ని కొనుగోలు చేసి .. తక్కువ సమయంలోనే వినూత్నమైన డిజైన్ల తో పని చేస్తూ అందరి చేత అభినందనలు పొందుతున్నాడు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ మణికంఠ వుడ్ వర్క్స్ అనే షాపులో సి.ఎన్.సి వుడ్ కార్వింగ్ మిషన్ అందుబాటులో ఉంది. ఈ వుడ్ వర్క్స్ షాప్ నిర్వాహకుడు సతీష్ .. లోకల్ 18 ప్రతినిధి కేశవేణి ప్రవీణ్ తో మాట్లాడుతూ సంవత్సరం క్రితం ఈ మిషన్ కొనుగోలు చేసినట్టు చెప్పారు.

ఈ మిషన్ ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయని, ఈ మిషన్ ఉపయోగించి తక్కువ టైంలో పని కంప్లీట్ చేసుకోవచ్చన్నారు. గత సంవత్సరం క్రితం చేతితో డోర్లకు, కిటికీలకు డిజైన్లు చేసేవాళ్లం.. దానికి మాకు వర్కర్లు ఎక్కువ అవసరమయ్యేవారు. దానివల్ల మాకు టైం కూడా ఎక్కువ అయ్యేదన్నారు. దీనివల్ల కస్టమర్లకి లేటుగా వారి డిజైన్లు ఇచ్చేవాళ్లం. మాకు తెలిసిన ఒక మిత్రుడి ద్వారా ఈ మిషన్ గురించి తెలుసుకుని కరీంనగర్ వెళ్లి కొనుగోలు చేశానన్నారు.

థియేటర్‌లో సినిమా ప్రదర్శనకు జరిగే తీరు ఇదే!

ఈ సి.ఎ.న్సి వుడ్ కార్వింగ్ మిషన్ ముగ్గురు నలుగురు చేయవలసిన పనిని చేస్తుందన్నారు. దానివల్ల మాకు టైం, పని భారం కూడా చాలా తగ్గిందన్నారు. ఈ మిషన్ తో పాటు ఒక స్టెబిలైజర్, కంట్రోల్ బాక్స్ సి.ఎ.న్సీ రూటర్ మిషన్ వస్తుందని, మనం మన కంప్యూటర్లో మనకు కావలసిన డిజైన్ ను డిజైనింగ్ చేసుకుని మిషన్ కింది భాగంలో మనకు కావలసిన డోర్ కానీ కిటికీలు కానీ పెట్టాలి. అప్పుడు మనం ఎంచుకున్న డిజైన్ ను వాటిపైన డిజైన్ చేస్తుందన్నారు. ఈ మిషన్ కొనుగోలు చేసినప్పుడు వచ్చిన ఖర్చు వచ్చేసి మొత్తం రూ. 6,50,000 లుగా తెలిపారు. దీని ద్వారా నాణ్యత అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ ఈ మిషన్ కి ఏదైనా ప్రాబ్లం రావడం జరిగితే దీనికి సంబంధించిన ఇంజనీర్లు వచ్చి రిపేర్ చేసి వెళ్తారన్నారు.

2024-03-28T10:13:47Z dg43tfdfdgfd