Trending:


సీతానవమి 2024: సీతాదేవి శివ ధనస్సును ఎక్కడ పూజించిందో తెలుసా...

సీతానవమి 2024: సీతాదేవి శివ ధనస్సును ఎక్కడ పూజించిందో తెలుసా... రామాయణం అనగానే మనకు స్ఫురణకు వచ్చే నగరాలు ఒకటి అయోధ్య, రెండోది మిథిల! మొదటిది రామచంద్రుడు పుట్టిన చోటు.. రెండోది జనకుడు-రత్నమాలలకు అయోనిజ సీతమ్మ దొరికిన చోటు! మైథిలి పుట్టినిల్లు! ఆ మిథిలానగరంలో సీతానవమి ( మే 16) వేడుకలు వైభవంగా జరుగుతాయి. అప్పట్లో మిథిలా రాజ్యం బిహార్‌ నుంచి నేపాల్‌ వ...


ముఖాలు నల్లగా ఉన్నాయని గెంటేసిన స్కూల్.. విద్యార్థులకు రూ.16.4 కోట్ల పరిహారం

తన ఫ్రెండ్ ముఖంపై మొటిమలతో బాధపడుతుంటే.. అతడి ఇద్దరు స్నేహితులు కూడా బాధపడ్దారు. అతడు చికిత్స తీసుకుంటే.. సంఘీభావంగా వారు కూడా ముఖంపై నల్లటి మాస్క్ వేసుకున్నారు. ముగ్గురూ కలిసి ముఖాలపై నల్లటి రంగుతో సెల్ఫీ దిగి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫోటో నాలుగేళ్ల కిందట వైరల్ అయ్యింది. అయితే, వారు చదువుతోన్న స్కూల్ మాత్రం దీనిని జాత్యహంకార చర్యగా పేర్కొంటూ స్కూల్ నుంచి ఇద్దర్నీ బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.


Uses Of Mint: సమ్మర్‌లో తప్పకుండా తీసుకోవాల్సి డ్రింక్‌.. అద్భుతమైన లాభాలు మీసొంతం!

Benefits Of Mint: వేసవికాలంలో ఆరోగ్యకరమైన డ్రింక్‌ను తీసుకోవాలి అంటే పుదీనా వాటర్‌ ఎంతో మంచి ఎంపిక అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


Beetroot Biryani: బీట్రూట్ బిర్యానీ ఇలా చేస్తే రుచికి రుచి ఎంతో ఆరోగ్యం

Beetroot Biryani: బీట్రూట్‌తో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ బీట్రూట్ ను తినే వారి సంఖ్య తక్కువే. అందుకే బీట్రూట్ బిర్యాని రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.


Chapati Flour : చపాతీ పిండిలో ఐస్ క్యూబ్స్ వేస్తే జరిగే విషయం తెలిస్తే ఇకపై అదే పని చేస్తారు

Chapati Flour : చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఉంచితే పైన నల్లటి పొర కనిపిస్తుంది. ఇది జరగకుండా నిరోధించడానికి, పిండి త్వరగా చెడిపోకుండా ఉండేందుకు ఒక మార్గం ఉంది. అది ఏంటో తెలుసా?


Besan Ladoo: బెసన్ లాడూ ఇప్పుడు సులభంగా తయారు చేసుకోండి ఇలా..!

Besan Ladoo Recipe: బెసన్ లాడూ అనేది భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన స్వీట్. ఇది శెనగపిండి, నెయ్యి, చక్కెర తో తయారు చేస్తారు. ఈ లడ్డులు చాలా రుచికరంగా ఉండటమే కాకుండా,


Body Cool Tips: ఎండ వేడిని తప్పించుకోవడానికి మన పూర్వీకులు ఇలా చేసేవారు!

Body Cool Tips In Telugu: ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా చాలామంది అనేక సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీటి నుంచి ఉపశమనం పొందడానికి మన పూర్వీకులు ఎలాంటి చిట్కాలను వినియోగించేవారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


సీతానవమి పూజ వలన మంచి ఫలితం ఉంటుందట.. ఈ ఏడాది ఎప్పుడంటే

సీతానవమి పూజ వలన మంచి ఫలితం ఉంటుందట.. ఈ ఏడాది ఎప్పుడంటే సీతా నవమిని ( మే 16)  దేశంలోని చాలా ప్రాంతాల్లో పెద్దయెత్తున జరుపుకుంటారు. సీతా జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు చేసుకుంటారు. శ్రీరాముడి భార్య సీతాదేవి స్వచ్ఛతకు, నిజాయతీకి నిలువెత్తు రూపం. సీతాదేవిని జానకీదేవి గా కూడా కొలుస్తారు. ఆ రోజున పవిత్ర నదీస్నానం ఆచరించి సీతాదేవి ఆశీర్వాదాలు తీసుకోవడ...


ఇండియాలో బ్యాన్ చేసిన ఆహారాలు ఇవిగో!

కొన్ని కారణాల వల్ల ఇండియాలో కొన్ని ఆహారాలను బ్యాన్ చేశారు. అవేంటో తెలుసుకుందాం.


Salt Water Face Wash : ఉప్పు నీటిని ఇలా వాడితే మెుటిమలు, నల్లమచ్చలు శాశ్వతంగా మాయం

Beauty Tips : ఉప్పు నీటిని ముఖం కడిగేందుకు ఉపయోగించవచ్చు. అయితే ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి.


Rashes: చర్మంపై దద్దుర్లు ఎన్ని మందులు వాడినా పోవట్లేదా? ఇంట్లో ఈ పదార్థాలు చాలు..

Psoriasis Rashes: సోరియాసిస్ కారణంగా చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో మూలికలు పేర్కొన్నారు. వీటిని వినియోగించి ఎంతో సులభంగా ఖర్చు లేకుండా ఉపశమనం పొందవచ్చు.


Mothers Day 2024 : మీ తల్లికి 40 నుంచి 50 ఏళ్ల వయసు ఉందా? ఆమెలో ఈ మార్పులు గమనించారా?

Mothers Day 2024 : తల్లి ఆరోగ్యాన్ని చూసుకోవడం అందరి బాధ్యత. అయితే తల్లికి 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటే చాలా జాగ్రత్తగా చూడాలి.


Pista Side Effects: ఈ వ్యాధిగ్రస్తులు పిస్తా పప్పును అసలు తీసుకోకూడదు..!

Who Should Not Eat Pistachios: పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో వివిధ రకాల పోషకాలు, విటమిన్‌లు ఉంటాయి. కానీ వీటిని కొన్ని వ్యాధిగ్రస్తులు వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతారు.


Summer Umbrella : వేసవిలో ఏ రంగు గొడుగు ఉపయోగిస్తే వేడి ఎక్కువగా ఉండదు

Summer Umbrella : వేసవి వేడి చంపేస్తోంది. బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఇలాంటి సమయంలో గొడుగులు కాస్త ఉపశమనం అనిపిస్తాయి. అయితే మనం వాడే గొడుకు రంగు ఆధారంగా ఎండ మనకు ఇబ్బంది కలిగిస్తుంది.


6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు

6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు


Saree Cancer: ‘చీర క్యాన్సర్’ గురించి విన్నారా? ఇది ఎవరికి వస్తుందో చెబుతున్న వైద్యులు

Saree Cancer: చీర క్యాన్సర్ వినడానికి వింతగా ఉండవచ్చు. కానీ దీని బారిన పడుతున్న వ్యక్తులు ఉన్నారు. దీన్నే ధోతీ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. చీర వల్ల క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకోండి.


శనివారం రోజున ఏం చేస్తే.. మీ అప్పులు తీరతాయో తెలుసా?

సాధారణంగా ప్రజలు శనివారం శనిదేవుడిని ప్రార్థిస్తారు. ఈ శనివారం రోజున ఆయనను పూజించడం వల్ల ఏవైనా దోషాలు ఉన్నా పోతాయి అని నమ్ముతారు. అదే శని దేవుడు ఆవనూనె తో పూజిస్తే... మీ జీవితమే మారిపోతుంది. చాలా మంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక అవసరానికి అప్పులు చేస్తూ ఉంటారు. కానీ.. అందరికీ చేసిన అప్పులు తీరవు. ఆ అప్పు తీరక..దానిపై వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. ఇక చేసిన అప్పులు తీరక ఆస్తులు అమ్ముకున్నవాళ్లు... జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నవారు చాలా మందే ఉన్నారు....


Today Horoscope: ఓ రాశి ఆడవారి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం 11-5-2024, శనివారం మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..) మేషం (అశ్విని , భరణి , కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) భరణి నక్షత్రం వారికి (దినపతి రవి)...


ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

పెళ్లిలో పెళ్లి కూతురితో పాటుగా పెళ్లికొచ్చిన చాలా మంది ఆకు పచ్చ గాజులనే వేసుకుంటుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆకుపచ్చ గాజులనే ఎందుకు వేసుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి సమయంలో, ఆ తర్వాత ఆడవాళ్లు ఖచ్చితంగా గాజులను వేసుకోవాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. నిజానికి గాజులకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గాజులు భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయని నమ్ముతారు. అయితే పెళ్లిలో ప్రతి ఒక్కరూ ఆకు పచ్చ గాజులనే...


ఈ తేదీల్లో పుట్టిన వారు మాటల మాంత్రికులు.. ఆ విషయంలో వీరి దరిదాపుల్లో ఎవరూ ఉండరు!

సంఖ్యాశాస్త్రం (Numerology) అక్షరాలకు, పుట్టిన తేదీలకు సంఖ్యలను కేటాయించడం ద్వారా వ్యక్తి లక్షణాల గురించి తెలియజేస్తుంది. ఈ స్టడీని ప్రపంచ వ్యాప్తంగా చాలామంది నమ్ముతుంటారు. న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులు సహజంగానే చాలా బాగా మాట్లాడగలుగుతారు, సోషల్లీ యాక్టివ్‌గా ఉంటారు. ఫీలింగ్ స్పష్టంగా వ్యక్తం చేయడం, ఇతరులతో ఆసక్తికరమైన చర్చలు జరపడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే వీరిని మాటల మాంత్రికులుగా, మంచి మాటకారులుగా చెప్పవచ్చు. ఏయే తేదీల్లో పుట్టిన వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి. ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినవారుఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తులకు సానుభూతి లక్షణం సహజంగానే ఉంటుంది. వీరు ఇతరులు చెప్పే మాటలను క్లియర్‌గా వింటూ, హ్యూమన్ ఎమోషన్స్‌ని బాగా అర్థం చేసుకుంటారు. చాలా ఈజీగా ఇతరులతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వగలుగుతారు. ఈ రోజున జన్మించిన వ్యక్తులు ఓపెన్‌గా మాట్లాడటానికి ఇష్టపడతారు. జీవితం, తమ ఉనికి గురించి ఆలోచించడం అంటే వీరికి ఇష్టం. అందుకే తరచుగా ఫిలాసఫికల్ కన్వర్జేషన్స్‌లో పాల్గొంటారు. ఫీలింగ్స్, ఎమోషన్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయగలరు, కాబట్టి బెస్ట్ కమ్యూనికేటర్లుగా గుర్తింపు పొందుతారు. కష్టమైన టాపిక్స్‌ను ఇతరులకు వివరించడంలో వీరికి స్పెషల్ టాలెంట్ ఉంటుంది. నెలలో 3, 12, 21, 30వ తేదీల్లో పుట్టినవారువీరు ప్రజల్లో బాగా కలిసిపోతుంటారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారు మాటల మాంత్రికులుగా అందరినీ ఆకర్షిస్తారు. ఆలోచనలు, భావోద్వేగాలను ఇతరులతో స్వేచ్ఛగా వ్యక్తం చేస్తారు, ఇందుకు ఏమాత్రం భయపడరు. వీరికి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. తమ చమత్కారం, ఆకర్షణ శక్తితో చాలా మంచి కమ్యూనికేటర్స్ అవుతారు. మాటలతో ఇతరులను ఆకట్టుకోవడం, వారిని వెంటనే మాట్లాడించగలిగే స్పెషల్ టాలెంట్ వీరి సొంతం. 9, 18, 27 తేదీల్లో జన్మించినవారువీరికి చాలా బలమైన ఆలోచనలు, నమ్మకాలు ఉంటాయి. చర్చలలో పాల్గొనడానికి, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, వాటిని సమర్థించడానికి ఏమాత్రం భయపడరు. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు సహజంగానే ఇతరుల పట్ల దయ, సానుభూతి చూపిస్తారు. ఇతరుల మాటలను శ్రద్ధగా వింటారు, అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. నెలలో 5, 14, 23వ తేదీల్లో పుట్టినవారుఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు సహజంగానే చాలా మంచి మాటకారులు అవుతారు. చాలా ఉత్సాహంగానూ ఉంటారు. వివిధ రకాల సంభాషణలలో పాల్గొనడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఎలాంటి కన్వర్జేషన్లకైనా అడ్జస్ట్ అయ్యే ఫ్లెక్సిబుల్ నేచర్ వీరిది. వీళ్లకు క్యూరియాసిటీ ఎక్కువ. అందుకే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సుదీర్ఘ చర్చలలో పాల్గొనడానికి ఇష్టపడతారు. నేర్చుకోవడానికి, తాము నేర్చుకున్న వాటిని ఇతరులకు అందించడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. వీరు మంచి స్టోరీ-టెల్లర్స్ అవుతారు, తద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇతరులు వీరి మాటలు వినాలని బాగా కోరుకుంటారు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


ఈరాశి వారికి ఉద్యోగంలో పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు మే 11న శనివారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశముంది. ఉద్యోగంలో మంచిగుర్తింపు లభిస్తుంది. కొత్త నైపుణ్యాలు ఉపయోగపడతాయి. ముఖ్యమైనవ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకువిజయవంతం అవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులుసకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండువ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. శుభ వార్తలు వింటారు.. వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) కొన్ని వ్యవహారాలను ధైర్యంగా చక్కబెడతారు. ఆదాయం బాగా పెరిగే అవకాశంఉంది. ముఖ్య మైన పనులు, వ్యవహారాలు సునాయాసంగా పూర్తి అవుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలుఅమలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యో గావకాశాలు కలిసి వస్తాయి. పెళ్లిప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఉద్యోగం మార డానికి చేసేప్రయత్నాలు సఫలం అవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతోకలిసి ఇష్ట మైన ఆలయాలను సందర్శిస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యబాగా తగ్గుతుంది. ఆస్తి వివాదం పెద్దల జోక్యంతో పరిష్కారమవుతుంది.వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలుపాటించడం మంచిది. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. కర్కాటకం (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా ఎవరితోనూవాదోపవాదా లకు దిగవద్దు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణలభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. మిత్రులతోవిందులు, వినోదాల్లో పాల్గొంటారు. అను కున్న పనులు అనుకున్నట్టుపూర్తవుతాయి. చిన్న చిన్న సమస్యలకు ఆందోళన చెందక పోవడం మంచిది. ఇంటా బయటాకొద్దిగా ఒత్తిడి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. బాగా ఇష్టమైన మిత్రులను, బంధువులనుకలుసుకుం టారు. ఒక శుభకార్య‍ంలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి కలిగినవ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రతిభా పాటవాలకు ప్రత్యేకమైన గుర్తింపులభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారు లను, సహోద్యోగులను పని తీరుతోఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలుచేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానేఉంటుంది.. కన్య (Virgo):(ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కొందరుమిత్రులు అండగా నిలబడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.ఆరోగ్యం చాలావరకు కుదుట పడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి.ఉద్యోగంలో మీ పనితీరుకు అధి కారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తివివాదాల్లో పెద్దల నుంచి సహాయం లభిస్తుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడిఉండే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా,ఉత్సాహంగా సాగిపోతాయి. కొన్ని పాత రుణాలు వసూలు అవుతాయి. బంధువుల నుంచిరావాల్సిన డబ్బు కూడా అందుతుంది. ఆర్థిక ప్రయత్నాల వల్ల మానసిక ఒత్తిడికిగురవుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మంచి పరిచయాలుఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. కుటుంబజీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. వృశ్చికం(Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అలవికాని లక్ష్యాలతో ఇబ్బందిపడతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన అవసరాలుతీరిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.బంధుమిత్రుల సహాయంతో ప్రధానమైన పనులు పూర్తవు తాయి. సొంత ఆలోచనలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. వృత్తి,వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.. ధనుస్సు(Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలతో పాటువ్యాపారాలు కూడా లాభసాటిగా, ప్రోత్సాహకరంగా పురోగతి చెందుతాయి. కొన్నిఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని బాగా లాభపడతారు.వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నా లకు సానుకూలంగా ముందుకుసాగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న వ్యవహారాలుఅనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.. మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది.మితిమీరిన ఔదార్యంతో మిత్రులకు సహాయం చేసే అవకాశం ఉంది. వృత్తి జీవితంలోబిజీ అయ్యే అవకాశం ఉంది. రాబడికి, లాభాలకు లోటుండదు. వ్యాపారాల్లో కొత్తఆలోచనలు అమలు చేసి, ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచిఆదరణ ఉంటుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలువింటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.. కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) స్తోమతకు మించి ఇతరులకు సహాయపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులుఎక్కువగా ఆధారపడతారు. అధికారులు మీ సలహాలతో ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యమైన శుభ వార్తలు అందుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.విలువైన కానుకలు లభిస్తాయి. నిరు ద్యోగులకు ఆశించిన స్థాయిలోఉద్యోగావకాశాలు అందివస్తాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు.. మీనం(Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. పిల్లలకు సంబంధించిన సమాచారం ఒకటి ఆనందంకలి గిస్తుంది. చాలా పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితిబాగా అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు. దైవకార్యాల మీద ఖర్చు ఎక్కువవుతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి.పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు.. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


Sun Transit in Taurus వృషభంలో సూర్యుడి సంచారం.. ఈ 6 రాశులకు భారీగా ఆర్థిక ప్రయోజనాలు..!

Sun Transit in Taurus జ్యోతిష్యం ప్రకారం, 15 మే 2024 బుధవారం నాడు సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి భారీగా ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...


నేచర్ లవర్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాలు!

ప్రకృతి అందాలను ఇష్టపడే వారికి ఇండియాలో కొన్ని డెస్టినేషన్స్ తప్పక నచ్చుతాయి. అవేంటో తెలుసుకుందాం.


మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా మార్చుకోండిలా!

ఎదుటి వ్యక్తిని సులభంగా అకర్షించేందుకు ఉపయోగపడే సింపుల్ టిప్స్‌ గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ఈ టిప్స్‌ ఫాలో అయితే వ్యక్తితత్వం దృఢంగా మారుతుంది.


పిల్లల విషయంలో తల్లులు అస్సలు చేయకూడని తప్పులు ఇవే...!

తమ పిల్లలను గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలిపెడుతున్నారు. కానీ... మీ పిల్లలను మీరే పెంచాలి. వారికి మీరు కచ్చితంగా క్వాలిటీ టైమ్ కేటాయించాలి. ప్రతి తల్లి తన బిడ్డపై అమితమైన ప్రేమ పెంచుకుంటుంది. అమ్మ ప్రేమ విషయంలో మనం ఎలాంటి లోపాలు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. కానీ... తెలిసీ తెలియక చాలా మంది తల్లులు.. పిల్లల పెంపకంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రోజుల్లో పేరెంట్స్ కి పిల్లలపై ప్రేమ ఉంటే సరిపోదు....


TSRTC Dress Code : ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు నో- టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు

TSRTC Dress Code : టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల వస్త్రధారణ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు ధరించి విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేసింది.


వామ్మో.. ఆకాశాన్ని అంటిన ధరలు, సామాన్యులకు షాక్!

వేసవి కాలం ప్రభావంతో ఎండలు మండుతున్నాయి. మార్కెట్ లో లభించే పండ్లకు సైతం డిమాండ్ పెరిగింది. వేసవి కావడంతో పండ్ల ధరలు పెరిగాయి. వేసవిలో పండ్లనే ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తూ ఉండడంతో జనాలు మాత్రం ధరలను లెక్కచేయకుండా పండ్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వరంగల్ నగరంలోని చెస్ట్ టీబీ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నటువంటి మదీనా ఫ్రూట్ షాప్‌లో మాత్రం అన్ని రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. మహమ్మద్ కురుబాన్ అనే వ్యక్తి గత 35 సంవత్సరాల నుంచి ఈ పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమ వ్యాపారం లాభదాయకంగానే కొనసాగుతుందని చెప్పారు. దీనిపై ముగ్గురు ఆధారపడి జీవిస్తున్నామని చెప్పారు. ఒక్కొక్కరి చొప్పున రోజుకు రూ. 700 లకు పైగానే సంపాదిస్తున్నట్లు చెప్పారు. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పండ్లు తినాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చెబుతున్నారు. వేసవి సందర్భంగా పండ్ల ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయన్నారు. సామాన్య, మధ్యతరగతి వారిపై భారం పడుతుందన్నారు. ధరలు కాస్త తగ్గితే బాగుండు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పండ్లు తినడం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్లతో నిండిన పండ్లు మనకు ప్రకృతి ప్రసాదించిన తీపి బహుమతి. అయితే పండ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు అనేక రుచులు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. పండ్లు తినడం ద్వారా శరీరానికి తగినంత ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు అందిస్తాయి. తమ వద్ద అన్ని రకాల పండ్లు లభిస్తాయని యజమాని మొహమ్మద్ కురుబన్ తెలిపారు. సీజన్ లో దొరకని ఫ్రూట్స్ కూడా కొన్ని తమ లభిస్తాయన్నారు. తమ ఇటలీ ఆపిల్, డెలిషియన్ ఆపిల్, సిమ్లా ఆపిల్, రాయల్ ఆపిల్, ఇరానీ ఆపిల్ ఇలా పలు రకాల ఆపిల్స్ తమ వద్ద లభిస్తాయన్నారు. వీటితో పాటు దానిమ్మ, ఆరెంజ్, మామిడి పండ్లు, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, కర్బూజా, అరటి పండ్లు ఇలా వివిధ రకాల పండ్లు తమ వద్ద ఉంటాయన్నారు. తమ వద్ద లభించే యాపిల్స్ కిలో ధర రూ.150 నుంచి రూ.300 వరకు ఉన్నాయన్నారు. కిలో ఆరెంజ్ రూ.150, కిలో గ్రేప్స్ రూ.100, కిలో మామిడి రూ.150, ఒక పుచ్చకాయ రూ.100 ఉన్నట్లు తెలిపారు. వేసవి సందర్భంగా పండ్లకు కేజీకి రూ.50 చొప్పున ధరలు పెరగడం జరిగిందన్నారు. వేసవిలో లభించని కొన్ని రకాల పండ్లను కూడా దూరప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుందన్నారు. పండ్లు తినడం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి వీటిని కొనేందుకు నిత్యం ఎంతోమంది వస్తుంటారని చెప్పారు. తమ వద్ద హోల్ సెల్ మరియు రిటైల్ కు కూడా అమ్మడం జరుగుతుందన్నారు.


Hair Care Tips: వేసవిలో విపరీతంగా జుట్టు రాలుతోందా? నిపుణులు సూచించిన చిట్కాలు ఇవే

summer hair care tips: వేసవి కాలంలో వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా చాలామందిలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొందరి లోనైతే జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఈ చిట్కాలు వినియోగించండి.


ముడుపు అంటే ఏమిటి..? ముడుపు ఎలా కట్టాలో తెలుసుకోండి..

హైందవ సమాజంలో తమ కోర్కెలు తీర్చాలంటూ భక్తులు దేవుళ్లకు పూజలు చేసి అనంతరం ముడుపులు కడుతుంటారు. అత్యంత నియమనిష్ఠలతో ప్రతీ ఆలయంలో ముడుపులు కడుతున్న భక్తులను మనం చూస్తూనే ఉంటాం. ఉద్యోగ సమస్యల పరిష్కారానికి, సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారు, ఆర్థిక ఇబ్బందులతో కుదేలవుతున్న వారు, ఇలా అనేకమంది భక్తులు వివిధ ఆలయాలలో ముడుపులు కడుతూ తమ కోర్కెలను తీర్చాలని భగవంతుడికి విన్నవించుకుంటారు.ఈ నేపథ్యంలోఅసలు ముడుపు అంటే ఏమిటి..? ముడుపు కట్టడం వల్ల జరిగే ప్రయోజనం...


ఈ రాశుల వారు పని పిచ్చోళ్లు..

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు ఎప్పుడూ చూసినా పనిలో బిజీగానే ఉంటారు. ఇలాంటి వారే కంపెనీలో ఉత్తమ ఎంప్లాయ్ గా పేరుతెచ్చుకుంటారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే? జ్యోతిష్యం పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అంతర్భాగం అంటారు జ్యోతిష్యులు. ఇకపోతే కొన్ని రాశుల వారు పనికి దూరంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారు మాత్రం ఎప్పుడూ పనిలోనే ఉంటారు. వీరికి పనే లోకం. పనిలోనే వీరు సంతోషాన్ని వెతుక్కుంటారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే? మేష...


Cooking Methods: వంట ఇలా వండితే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు, ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు

ICMR Cooking Methods Guidelines: ఏం తింటున్నామనే కాదు. ఎలా వండుతున్నామనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు. వంట వండే పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు చేస్తే హల్తీగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కూడా ఇదే విషయం మరోసారి స్పష్టం చేసింది. Dietary Guidelines for Indians (DGI) పేరుతో వంటకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలా వండితే ఆయా పదార్థాల్లో పోషకాలను...


ఈ కారణాలతో మాత్రం పిల్లలను కనకండి..!

మీరు కోరుకున్నప్పుడు కాకుండా.. ఇతరుల కోసం పిల్లలను కనడం మంచిది కాదు. వాళ్లు పెంచుతారని కాదు.. మీకు కావాలి అనిపించినప్పుడు పిల్లలను కనడమే మంచిది. పెళ్లి తర్వాత దాదాపు చాలా మంది దంపతులు... తల్లిదండ్రులు కావాలని అనుకుంటారు. కొందరు పెళ్లైన వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటారు. కొందరు.. కాస్త గ్యాప్ తీసుకుంటారు. అయితే... పిల్లలను ఎందుకు కనాలని అనుకుంటున్నారనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? చాలా మందికి పిల్లలు ఎందుకు అంటే.. చాలా కారణాలు ఉండి...


చిన్నారులతో కళకళలాడుతున్న ఈత కొలను.. ఎక్కడంటే..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఉన్న ఈత కొలను చిన్నారులు, పెద్దలతో కళకళలాడుతోంది. ఆరోగ్యంతోపాటు ఆనందాన్ని పంచుతోంది. చిన్నా పెద్దా అందరు వచ్చి ఈతకొడుతూ సరదగా గడుపుతున్నారు. వేసవి సెలవులు కావడంతో ఈత కొలనుకు వస్తున్న చిన్నారుల సంఖ్య మిగతా రోజులకంటే బాగా ఎక్కువగానే పెరిగింది. ఐదేండ్ల చిన్నారుల నుండి మొదలుకొని 60, 70 ఏళ్ళ వయసు వాళ్ళ వరకు కూడా ఇక్కడికి ఈత కోసం వస్తున్నారు. ఈతరాని కొందరు పిల్లలు, పెద్దలు వచ్చి ఈత...


ఈ టిప్స్‌తో జుట్టు రాలడం తగ్గుతుంది!

జుట్టును బలంగా మార్చే చిట్కాల గురించి వివరించాం. ఈ చిట్కాలను ఉదయం పూట పాటిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది.


సమ్మర్‌లో కాఫీ మానేసి ఈ సూపర్ డ్రింక్స్ తాగండి.. మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులివే!

ఉదయం నిద్ర లేవగానే చాలామంది వేడివేడి టీ, కాఫీ తాగుతారు. ఈ హాట్ డ్రింక్స్‌ బాడీ, మైండ్‌ను రీఫ్రెష్ చేస్తాయి. అయితే వీటిలో ఉండే కెఫిన్ కంటెంట్ ఆరోగ్యానికి మంచిది కాదు. కాఫీలో ఇది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నిజానికి ఈ డ్రింక్స్ పరిమితంగా తాగితే, కెఫిన్ కారణంగా మెదడు చురుగ్గా ఉంటుంది. అయితే ఎక్కువ సార్లు తాగితే మాత్రం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. వేసవిలో కాఫీ ఎక్కువగా తాగితే వేడి చేస్తుంది. ఇందులో ఉండే కెఫిన్ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ఒత్తిడి, ఆందోళనను పెంచి నరాల పటుత్వాన్ని తగ్గిస్తుంది. అందుకే ఈ సీజన్‌లో కాఫీకి బదులుగా కొన్ని హెల్తీ డ్రింక్స్ తాగడం మంచిది. అవేంటో తెలుసుకోండి. గ్రీన్ టీఇటీవల కాలంలో గ్రీన్ టీ హెల్తీ డ్రింక్‌గా పాపులర్ అయింది. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే అందుకు కారణం. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. మొక్కల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్స్‌ ఉండటం వల్ల దీనికి హెల్తీ డ్రింక్‌‌గా గుర్తింపు వచ్చింది. వేసవిలో కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగితే సమ్మర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది, శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలు అందుతాయి. కొబ్బరి నీళ్లువేసవిలో బెస్ట్ ఎనర్జిటిక్, హైడ్రేటింగ్ డ్రింక్స్‌లో కొబ్బరి నీళ్లు ముఖ్యమైనవి. ఈ సీజన్‌లో కాఫీ బదులుగా ఇవి తాగడం మంచిది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవి తాపానికి కోల్పోయిన పోషకాలు, శక్తిని భర్తీ చేస్తూ బాడీని రీఫ్రెష్‌ చేస్తాయి. కొబ్బరి నీళ్లలో కేలరీలు, కొవ్వులు, కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గే ప్రయోజనాలతో పాటు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ డ్రింక్ వేసవిలో డీహైడ్రేషన్ ముప్పును తగ్గిస్తుంది. తేనె, దాల్చిన చెక్క నీరుతేనె, దాల్చిన‌ చెక్కలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ రెండూ కలిపి చేసిన డ్రింక్‌ను కాఫీకి బదులుగా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క పొడి, తేనె, నీరు కలిపి చేసే ఈ డ్రింక్‌తో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతూ, సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో మొత్తం శ్రేయస్సు మెరుగుపడుతుంది. బీట్‌రూట్ జ్యూస్బీట్‌రూట్‌లో విటమిన్ B9, ఫోలేట్, ఫైబర్, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు లభిస్తాయి. శరీర కణాల అభివృద్ధి, పనితీరును ప్రోత్సహించడంలో ఫోలేట్ కీలకంగా పనిచేస్తుంది. అలాగే రక్తనాళాల క్షీణతను నిరోధిస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ తయారీకి సహాయం చేస్తాయి. అందుకే బోలెడు ప్రయోజనాలను అందించే బీట్‌రూట్ జ్యూస్‌ను కాఫీకి ప్రత్యామ్నాయంగా ఉదయం తాగవచ్చు. నిమ్మరసంవేసవిలో కాఫీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవాల్సిన మరో హెల్తీ డ్రింక్ నిమ్మరసం. ఇది బాడీ హీట్‌ను తగ్గించి, శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్లు ఈ సీజన్‌లో రోజూ నిమ్మరసం తాగితే ప్రయోజనం ఉంటుంది. బరువును నియంత్రించడంలో కీలకంగా పనిచేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


Chilli Rate: మండిపోతున్న పచ్చి మిర్చి.. కిలో ధర ఎంతో తెలుసా.. ?

ఎండల తీవ్రతకు కూరగాయల ధరలు కూడా పెరగడం మొదలైంది. కూరగాయల పంటపై గరిష్ట ఉష్ణోగ్రత ప్రతికూల ప్రభావం నేపథ్య సరఫరా తగ్గింది. దీంతో సహజంగానే కూరగాయల ధరలు పెరిగాయి. బీన్స్, క్యాబేజీ, బీట్‌రూట్, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. దాంతో పాటు పచ్చి మిర్చి రేటు కూడా పెరిగింది. మిర్చి ఘాటు కంటే ధర ఘాటు ఠారెక్కిస్తోంది. గత వారం రూ.60-80 ఉన్న కిలో పచ్చి మిర్చి ధర ఈ వారం ఖరీదుగా మారింది. రూ.120కి చేరింది. కొనుగోలు సమయంలో వినియోగదారునికి మిర్చి ఘాటు మంటపుట్టిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎండలు ఇలాగే కొనసాగితే కూరగాయల రేటు మరింత పెరగనుంది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు జేబు మండిపోతోంది.


Money Astrology: వీరికి ఆర్థిక విషయాలపై నియంత్రణ పెరుగుతుంది

Money Astrology (ధన జ్యోతిషం): (Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) జ్యోతిష్యులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు, ధన జ్యోతిష్యం ఫలితాలు చెబుతుంటారు. మే 10వ తేదీ, శుక్రవారం నాటి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలించండి. మేషం (Aries):ఫీల్డ్‌లో ఆశించినట్లే పని చేస్తారు, పనితీరు మెయింటెన్ చేస్తారు. ఆర్థిక, వాణిజ్యపరమైన పనులు పూర్తి చేస్తారు. పూర్వీకులు, సంప్రదాయ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో సానుకూలత ఉంటుంది. అందరినీ కలుపుకొని పని చేస్తారు. సంపద పెరుగుతుంది. ఆర్థిక రంగం మెరుగుపడుతుంది.పరిహారం: రామాలయంలో జెండా సమర్పించండి. వృషభం (Taurus):ఈ రాశి వారికి అన్ని రంగాల్లో ప్రభావవంతంగా ఉంటుంది. ధైర్యం చురుకుదనాన్ని, అవగాహనను పెంచుతుంది. ఆర్థిక వాణిజ్య రంగంలో విశిష్టమైన పనులు చేయాలనే ఆలోచన ఉంటుంది. ఫలితాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటాయి. ఆకర్షణీయమైన ఆఫర్లను అందుకుంటారు. సామరస్యం ఉంటుంది. మీ ప్లానింగ్‌కు బలం చేకూరుతుంది.పరిహారం- సరస్వతి అమ్మవారికి తెల్లటి పూల మాల సమర్పించండి. మిథునం (Gemini):కెరీర్ సరిగా ప్లాన్ చేసి మేనేజ్ చేయండి. వాణిజ్య పనులు వేగంగా పూర్తి చేస్తారు. యాక్షన్ ప్లాన్లు ఊపందుకుంటాయి. మీ ప్రతిభ, పనితీరు మెరుగుపడుతుంది. పనిలో అనుకూల పరిస్థితి ఉంటుంది. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారిస్తారు. సహోద్యోగులతో సమన్వయం పెరుగుతుంది.పరిహారం: శివునికి నీటిని సమర్పించండి.. కర్కాటకం (Cancer):వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో సుఖంగా ఉంటారు. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. లాభం, విస్తరణపై దృష్టి పెట్టాలి. ఇండస్ట్రీ ప్రొడక్షన్ మెరుగుపడటం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ యాక్టివ్‌గా ఉంటారు. వివిధ విషయాల్లో శుభం ఉంటుంది.పరిహారం: హనుమంతుని గుడిలో నెయ్యి దీపం వెలిగించండి.. సింహం (Leo):మీ పనుల్లో వేగం ఉంటుంది. కొత్త ప్లాన్లు రెడీ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపారం బలంగా ఉంటుంది. మంచి వేగంతో ముందుకు సాగుతారు. మీరు అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రభావం పెరుగుతూనే ఉంటుంది.పరిహారం- పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. కన్య (Virgo):ఆర్థిక విషయాల్లో వేగాన్ని కొనసాగిస్తారు. ఈ సానుకూల సమయంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. వృత్తిపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఒకటి కంటే ఎక్కువ సోర్సుల నుండి లాభం పొందే మార్గం తెరచుకుంటుంది. కాంటాక్ట్ కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది. ధైర్యం, లాభం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాన్ని వేగవంతం చేస్తారు.పరిహారం: శారీరక వికలాంగులకు సేవ చేయండి.. తుల (Libra):ఓర్పు, నమ్మకంతో ముందుకు సాగుతారు. పనిలో అత్యాశ, ప్రలోభాలకు గురికావద్దు. ఆర్థిక ప్రయత్నాలలో జాగ్రత్త పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారంపై దృష్టి సారిస్తారు. తొందరపాటు చూపకూడదు. రిస్క్ ఉండే పనులకు దూరంగా ఉంటారు. ప్రణాళికలు అమలు చేస్తారు.పరిహారం: ఎర్రటి ఆవుకి బెల్లం తినిపించండి. వృశ్చికం (Scorpio):ప్రొడక్టివ్ వర్క్ చేస్తారు. జాయింట్ వర్క్‌లో ముందుంటారు. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. తీవ్రమైన విషయాలపై ఆసక్తి ఉంటుంది. స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. విజయ స్ఫూర్తితో ముందుకు వెళ్తారు. వృత్తిపరమైన పనుల్లో మంచి పనితీరు కనబరుస్తారు.పరిహారం: పక్షికి ఆహారం ఇవ్వండి. ధనస్సు (Sagittarius):యాక్షన్ ప్లాన్లు ముందుకు తీసుకెళ్తారు. టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తారు. దురాశతో ప్రలోభాలకు గురికావద్దు. ఆర్థిక విషయాలపై నియంత్రణ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారంలో అవగాహన పెరుగుతుంది. పని విషయాలలో ఓర్పు ప్రదర్శిస్తారు. అప్రమత్తంగా ఉంటారు. అతిగా ఉత్సాహంగా ఉండకండి.పరిహారం: పేదవారికి తెల్లని వస్తువులు దానం చేయండి. మకరం (Capricorn):లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు. సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో విజయాలు పెరుగుతాయి. ఆఫీసర్ క్లాస్ సంతోషంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు మెరుగుపడతాయి.పరిహారం: సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి. కుంభం (Aquarius):ఆఫీస్‌లో అవగాహన, వినయంతో పని పూర్తి చేస్తారు. పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు. ఉద్యోగ వ్యాపారం సాధారణంగా ఉంటుంది. విస్తరణ ప్రణాళికలపై దృష్టి సారిస్తారు. పరిశోధన పనులపై ఆసక్తి చూపుతారు. అనుభవజ్ఞులైన వ్యక్తులతో స్నేహం పెంచుకోండి. సలహాదారులతో సన్నిహితంగా ఉండండి.పరిహారం: నల్ల కుక్కకు ఏదైనా తీపి పదార్థం ఇవ్వండి.. మీనం (Pisces):ఆఫీస్ లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేస్తారు. ధైర్యం, బలాన్ని ప్రదర్శిస్తారు. కెరీర్ అవకాశాలు పెరుగుతాయి. తప్పకుండా ముందుకు వెళ్తారు. విజయ భావం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారంలో మెరుగ్గా రాణిస్తారు. ప్రతిచోటా మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. పోటీ భావం పెరుగుతుంది.పరిహారం: దుర్గ గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


బంగారం కొన్న వారికి డబ్బుల వర్షం..

భారతదేశంలో అతి ముఖ్యమైన అక్షయ తృతీయ పండుగను 2024 మే 10న, అంటే ఈ రోజు జరుపుకుంటున్నారు. ఈ శుభదినం సందర్భంగా పెట్టుబడులు పెడితే మంచిదని, ముఖ్యంగా బంగారం కొంటే కలిసొస్తుందని చాలా మంది నమ్ముతారు. నిజానికి గత పదేళ్లలో అక్షయ తృతీయ నాడు కొన్న బంగారంపై 19 శాతం వార్షిక రాబడి అందినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా పండుగ నాడు కొన్న బంగారంపై మంచి ఆదాయం వస్తుందా, లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.ప్రస్తుతం 999 ప్యూరిటీ 10 గ్రాముల గోల్డ్‌ ధర...


Combination Foods: కాఫీ తాగుతూ ఇవి అస్సలు తినకండి.. తింటే మీ ఆరోగ్యం మటాష్!

కాఫీ ఒక బెస్ట్ రీఫ్రెష్ డ్రింక్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది, మెదడును చురుకుగా ఉంచుతుంది. కాఫీ తాగడం వల్ల మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో ఉండే కెఫిన్, ఇతర సమ్మేళనాలు డిప్రెషన్‌కు చెక్ పెడతాయి. అందుకే చాలామంది రోజూ ఈ హాట్ డ్రింక్ తాగుతారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా బిస్కట్లు, బ్రెడ్, స్నాక్స్ వంటివి తినడం చాలామందికి అలవాటు. ఈ కాంబినేషన్ వెరైటీ టేస్ట్‌ ఇస్తుంది. అయితే కాఫీ తాగేటప్పుడు కొన్ని రకాల ఫుడ్స్‌ను కాంబినేషన్‌గా తినకూడదు. వీటివల్ల కాఫీ రుచి మారవచ్చు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఆ పదార్థాలు ఏవో చూద్దాం. సిట్రస్‌ ఫ్రూట్స్నారింజ, ద్రాక్ష, బత్తాయి, జామ వంటి సిట్రస్ జాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. కాఫీ తాగేటప్పుడు ఈ పండ్లను తినకూడదు. ఎందుకంటే వీటిలోని సిట్రిక్ యాసిడ్, కాఫీలోని కెఫిన్‌తో రియాక్షన్ జరుపుతుంది. ఫలితంగా వివిధ రకాల జీర్ణ సమస్యలు రావచ్చు. కొందరికి పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. పనీర్చాలామంది కాఫీ తాగుతూ పనీర్‌తో చేసిన స్నాక్స్ తింటారు. అయితే ఇది కూడా సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే పనీర్‌‌లో కాల్షియం ఉంటుంది. కాఫీలోని కెఫిన్, శరీరం కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అందుకే ఈ కాంబినేషన్ సెట్ కాదు, ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫ్రైడ్ స్నాక్స్కరకరలాడే ఫ్రైడ్ స్నాక్స్‌ను కాఫీ తాగుతూ తింటే రుచి మారే అవకాశం ఉంది. పైగా వీటితో కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. సాధారణంగా చాలామంది కాఫీ తాగుతూ పకోడీలు, కారపూస వంటి పప్పు దినుసులతో చేసిన చిరుతిళ్లను తింటారు. ఇది సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే కాఫీ, ఫ్రైడ్‌స్నాక్స్ కాంబినేషన్ జీర్ణ సమస్యల తీవ్రతను మరింత పెంచుతుంది. పోషకాల శోషణ తగ్గుతుంది. ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. కాఫీ తాగుతూ మిరపకాయ బజ్జీలు కూడా తినకూడదు. ఈ ఫుడ్ కాంబినేషన్‌ పొట్టలో ఎసిడిటీ, చిరాకు కలిగిస్తుంది. పాలు, పాల ఉత్పత్తులుకాఫీ, డెయిరీ ప్రొడక్ట్స్‌ను కాంబినేషన్‌గా అసలు తీసుకోకూడదు. ఎందుకంటే జున్ను, క్రీమ్, పాలు వంటి డెయిరీ ప్రొడక్ట్స్ తింటూ కాఫీ తాగినప్పుడు.. శరీరం ఐరన్‌ను శోషించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఈ కాంబినేషన్‌ మంచిది కాదు. అంతేకాకుండా కాఫీ తాగేటప్పుడు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, ఆకుకూరలతో చేసిన ఆహారాలు కూడా తినకూడదు. స్పైసీ ఫుడ్స్స్పైసీ ఫుడ్స్, స్నాక్స్ రుచికరంగా, ఘాటుగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఆస్వాదిస్తారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా స్పైసీ ఫుడ్స్ తినకపోవడం మంచిది. ఎందుకంటే ఈ రెండిటి కాంబినేషన్ పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


ఇంట్లోని ఈ పదార్థాలతోనే రాగి పాత్రల్ని చక్కగా మెరిపించండి..

రాగి పాత్రలని ఇంట్లో వాడడం చాలా మంచిదని చెబుతున్నారు. మరి వీటిని ఎప్పుడు కొత్తవాటిలా మెరిచేలా చేయాలంటే ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.


అమ్మాయితో చాటింగ్‌ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

అమ్మాయితో చేసే చాటింగ్‌ను మరింత ఇంట్రెస్ట్రింగ్‌గా మార్చుకునేందుకు ఉపయోగపడే సింపుల్ చిట్కాల గురించి ఇక్కడ వివరించాం. వీటిని ఫాలో అయితే మీ చాటింగ్‌ ఆకర్షణీయంగా మారుతుంది.


మనసును ఉల్లాసంగా ఉంచే ఆహారాలు!

మనం నిత్యం అనందంగా ఉండేందుకు సహాయపడే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్స్‌ తింటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.


అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి.. ఆరోజు ఏమేమి జరిగాయో తెలుసా

అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి.. ఆరోజు ఏమేమి జరిగాయో తెలుసా Akshaya Tritiya 2024 Date: ఈ ఏడాది  (2024) అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఈ రోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీపూజ చేస్తే కలిసొస్తుందని అంతా అనుకుంటారు.. అసలు అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటాము.. పురాణాల ప్రకారం ఆరోజుకున్న చరిత్ర.. విశిష్టత గురించి గురించి తెలుసుకుందాం. . . ప్రతి సంవత్సరం  వ...


ఈ పుదీనా ఫేస్‌ప్యాక్స్‌తో మొటిమలు, మచ్చలు దూరమై ముఖం మెరుస్తుంది..

ఎండలు పెరిగిపోయాయి. దీంతో ముఖం వాడిపోయినట్లుగా కనిపిస్తుంది. అలా కాకుండా చర్మం మెరవాలంటే పుదీనాతో ఇలా ఫేస్ ప్యాక్ వేయండి..


మీరు పుట్టిన తేదీ ప్రకారం మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా..?

న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మనం ఎలా ఉన్నాం అనేది మనకు ఉన్న అలవాట్లే నిర్ణయిస్తాయి. మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారు.. ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. అదే.. చెడు అలవాట్లు ఉన్నవారికి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో...


Gulab Jamun: నోరూరించే గులాబ్ జామున్ తయారీ విధానం..!

Gulab Jamun Recipe: గులాబ్ జామున్ ఒక ప్రసిద్ధ భారతీయ స్వీటు, ఇది పాల పొడి, మైదా పిండి కొన్నిసార్లు ఖోవాతో తయారవుతుంది. అయితే దీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


Curd: పెరుగుతో ఈ 5 పదార్థాలు పొరపాటున కూడా ఎప్పుడూ తినకండి.. !

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పెరుగు తినడానికి ఇష్టపడతారు. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పెరుగులో సోడియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ , విటమిన్ డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వేసవిలో, ప్రజలు తరచుగా పెరుగును ఆహారంతో లేదా అల్పాహారంగా పరాటాతో తింటారు, కానీ మీరు కొన్ని వస్తువులతో పెరుగు తినకూడదు, లేకుంటే అది మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది.వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది...


Peepal Tree Leaves Benefits : రావి చెట్టు ఆకుల ప్రయోజనాలు మీకు నిజంగా తెలియవు

Peepal Tree Leaves Benefits In Telugu : రావి చెట్టును మన పూర్వీకుల కాలం నుంచి ఎంతగానో ఉపయోగిస్తున్నారు. రావి చెట్టు ఆకుల వలన కూడా మీకు అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి.


Coconut oil in skincare: ఒక చుక్క కొబ్బరినూనె మీ ముఖానికి రాస్తే హిరోయిన్ వంటి అందమైన చర్మం మీదే..

Coconut oil in skincare: కొబ్బరి నూనె మన ముఖానికి రాసుకుంటే ఎన్నో స్కిన్ సమస్యలు వదిలిపోతాయికొబ్బరి నూనెను మనం హెయిర్ ఆయిల్ గా మాత్రమే ఉపయోగిస్తాము. మరికొంతమంది వంటల్లో కూడా వినియోగిస్తారు.


వంట చేసేటప్పుడు వేడిగా అనిపించొద్దంటే ఏం చేయాలి?

ఎండాకాలంలో వంట చేస్తే వచ్చేంత చిరాకు ఏ కాలంలో రాదు. ఎందుకంటే ముందే మండుతున్న ఎండలు. దీనివల్ల ఇల్లంతా నిప్పుల కుంపటిలా మారుతుంది. దీనికి తోడు పొయ్యి దగ్గర వంట చేయడం ఎంత చిరాకు కలిగిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మీరు వంట చేస్తున్నా చల్లగా ఉంటారు. అదెలాగంటే? ఎండాకాలంలో బయట, ఇంట్లోనే కాదు వంటగది కూడా చాలా వేడిగా మారుతుంది. బెడ్ రూం, హాల్ ను అయితే ఏసీ, కూలర్ తో చల్లగా చేయొచ్చు. కానీ వంటింట్లో ఫ్యాన్ కూడా...