చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది

చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది

చికెన్ తింటున్నారా..అయితే జరజాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తుంది. జంతువులు, పక్షులకు సోకే ఈ వ్యాధి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది. చికెన్, మటన్ ద్వారా ఇది మనుషులకు సోకే ప్రమాదం ఉంది. ఉత్తరాఖండ్ లోని రాంచీలో కోళ్ల ఫాంలలో కోళ్లకు ఈ వ్యాధి సోకింది. హోత్వారా లోని రీజినల్ ఫౌల్ట్రీ ఫాంలో వేలాది కోళ్లు చనిపోయాయి. కోడిగుడ్లను కూడా బయటపడవేశారు. ఏవియన్ ఫ్లూ అని పిలువబడే ఈ వైరస్ ను మానవులలో వేగంగా వ్యాప్తి చెందగల కెపాసిటీ గల మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.     

ఏవియన్ ఫ్లూ అంటే.. 

 దీనిని బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు. ఏవియన్ ఇన్ ఫ్ల్యూయెంజా లేదా ఏవియన్ ఫ్లూ అనేది  ఒక రకమైన వైరస్..ఇది ప్రధానంగా పక్షులకు సోకుతుంది. అప్పడప్పుడూ మనుషులకు కూడా సోకుతుంది. ఇది సోకితే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఈ వైర్ పశువులు, పౌల్ట్రీ,వాటర్ ఫైల్ అంటే బాతులుతో పనిచేసేవారికి ఇది సోకే ప్రమాదం ఉంది. 

బర్డ్ ఫ్లూ రకాలు

ఏవియన్ ఫ్లూ వైరస్ రకరకాలుగా ఉంటుంది.  H5N11, H7N9  ఇన్ ఫ్లూయెంజా ఏ వైరస్ లోని ఉపరకాలు.మనుషులకు సోకే వైరస్ లు. వైరల్ ఉపరితలంపై ఉండే ప్రోటీన్ల రకాలను బట్టి వీటి పేర్లు పెట్టారు. 

ఏవియన్ ప్లూ -మనుషులపై ప్రభావం 

H5N1 తరచుగా మనుషులకు సోకే ఇన్ ఫ్లూయెంజా A  వైరస్. బర్డ్ ప్లూకి కారణం అవుతుంది. వైరస్ శరీరంలో ఎగువ శ్వాస కోశం , ఉపిరితిత్తులకు సోకుతుంది. మెదడు, ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. 

ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లూ) లక్షణాలు: 

  • సెప్సిస్       
  • న్యుమోనియా 
  • తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు 
  • మెదడు వాపు 
  • బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లు 
  • శ్వాసకోశ దెబ్బతినడం 

ఏవియన్ ఫ్లూ నిర్దారణ 

ఏవియన్ ఫ్లూ సోకిందా లేదా అనేది గొంతు డాక్టర్లు నిర్దారిస్తారు. పక్షులు లేదా ఇతర జంతువులతో సన్నిహితంగా ఉంటే వ్యక్తులు తప్పకుండా ఏవియన్ ఫ్లూ( బర్డ్ ఫ్లూ) పరీక్షలు చేయించుకోవాలి. 

ఏవియన్ ఫ్లూ చికిత్స 

ఏవియన్ ఫ్లూ (బర్డ్ ఫ్లూ) వైరస్ ను గొంతు, ముక్కు నుంచి శ్లేష్మాన్ని పరీక్షించడం ద్వారా నిర్ధారిస్తారు. ఈ వైరస్ ను ముందుగా గుర్తించినట్లయితే  యాంటీ వైరల్ మందులతో చికిత్స చేస్తారు.ఏవైనా లక్షణాలుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. 

ఏవియన్ ఫ్లూ నివారణ చర్యలు 

  • పశువులు, పక్షులు, జంతువులతో పనిచేసేటప్పుడు మాస్కు, చేతికి తొడుగులు, శరీరాన్ని కవర్ చేసేవిధంగా ప్రొటెక్ట్ క్లాత్స్ ధరించాలి. 
  • పక్షులు , జంతువులతో పనిచేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి 
  • ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా కు గురైన జంతువులకు దూరంగా ఉండాలి 
  • ఏవియన్ ఫ్లూ (బర్డ్ ఫ్లూ ) అనేది పక్షులు, జంతువులనుంచి మనుషులకు సోకే వైరస్. ముఖ్యంగా పక్షులు,జంతువులను పెంచుకునేవాళ్లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని ఏవియన్ ఫ్లూ నుంచి రక్షించుకోవాలి. 
    

 ఏవియన్ ఫ్లూ వైరస్ ను మానవులలో వేగంగా వ్యాప్తి చెందగల కెపాసిటీ గల మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఈ వైరస్ పై పర్యవేక్షణ, భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు వ్యాక్సిన్లను తయారు చేయడానిక పరిశోధనలు కొనసాగుతున్నాయి.     

©️ VIL Media Pvt Ltd.

2024-04-25T13:03:42Z dg43tfdfdgfd