చిట్టి.. చిట్టి రోబోలు తయారు చేస్తున్న చిట్టి.. చిట్టి చేతులు.. టాలెంట్ అదుర్స్..

రోబోట్ అనేది ఒక స్వయంచాలక యంత్రం. ఇది కంప్యూటర్ ద్వారా ప్రోగ్రామ్ చేయదగినది. ఇది తక్కువ .. మానవ జోక్యం లేకుండా వేగం.. ఖచ్చితత్వంతో నిర్దిష్ట పనులను అమలు చేయగలదు. రోబోలు మానవుల కంటే మెరుగ్గా కొన్ని పనులు చేయగలవు. రోబోలలో పలు రకాల ఉంటాయి. ఆటానమస్ మొబైల్ రోబోట్లు, ఆటోమేటెడ్ గైడెడ్ వెహికిల్స్, ఆర్టిక్యూలేటెడ్ రోబోలు, హ్యూమనయిడ్స్ ఇలా పలు రకాల ఉంటాయి. ఇవి అనేక పరిశ్రమలలో సామర్థ్యాన్ని పెంచడానికి ప్రక్రియలను వేగవంతం చేయడానికి భద్రతను మెరుగుపరచడానికి ఈ రోబోలు ఎంతోగాను ఉపయోగపడతాయి.

2010లో వచ్చిన 'రోబో' సినిమాలో సందడి చేసిన ఆ రోబో నటనను అంతా ఈజీగా మర్చిపోలేం. చిన్న,పెద్ద తేడా లేకుండా ప్రతిక్కరూ ఎంజాయ్ చేశారు. అయితే స్క్రీన్ పై ఉన్న రోబోలను చూసి ఆనందించడం కాదు మేము కూడా రోబోలను తయారు చేస్తామంటున్నారు ఈ చిన్నారులు.

వరంగల్ నగరానికి చెందిన సుకన్య ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆమె భర్త ఎన్ఐటీలో పీఎచ్ స్కాలర్. అయితే వీరు విద్యారంగంలో సాంకేతిక సేవలు అందించాలనే ఉద్దేశంతో రోబోటిక్స్ లో ఆసక్తి చూపించే వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో వరంగల్ నగరంలో క్రియేటివ్ రోబోటిక్స్ అనే పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులకు రోబోటిక్స్ పై శిక్షణ ఇస్తున్నట్లు సుకన్య న్యూస్18కు వివరించారు.

పోస్టాఫీస్ నుంచి అద్భుత స్కీమ్.. కేవలం రూ.36 పెట్టుబడి రూ. 6 లక్షలు మీ ఖాతాలో జమ..

8 సంవత్సరాల నుంచి 15సంవత్సరాల వయసు గల విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారని తెలిపారు. అయితే పాఠశాల చెందిన విద్యార్థులకు చిన్నప్పటి నుంచే రోబోటిక్స్ పై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు ఆమె చెప్పారు. ఈ సంస్థను ప్రారంభించి ఆరు సంవత్సరాలవుతుందన్నారు.

మొదటగా బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్, మెకానిక్స్, వైర్ లెస్ ప్రాజెక్ట్స్, సోలార్ ప్రాజెక్ట్స్ మరియు కోడింగ్ వరకు నేర్పిస్తామన్నారు. ఇందులో మొత్తం 7లెవెల్స్ ఉంటాయని అన్నారు. చిన్నారులకు క్లాస్ చెప్తూ ప్రాక్టికల్ గా నేర్పించడం జరుగుతుందన్నారు. ముందుగా బేసిక్స్ నుంచి ప్రారంభమై వాకింగ్ రోబోట్స్ వరకు నేర్పించడం జరుగుతుందన్నారు.

వేసవిలో ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయని, స్కూల్ డేస్ లో మాత్రం వీకెండ్స్ లో ఈ ఇన్స్టిట్యూట్ ఉంటుందన్నారు. ఇక్కడ నేర్చుకునే చిన్నారులు ఇంజినీరింగ్ విద్యార్థులకు ధీటుగా వివిధ రకాల పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. వరంగల్ ఎన్ఐటిలో జరిగే టెక్నోజియాన్ మరియు రాష్ట్ర,జాతీయ స్థాయి పోటీల్లో తమ విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించి బహుమతులు కూడా పొందడం జరిగిందన్నారు.

ఇప్పటినుంచి చిన్నారులు ఇలా నేర్చుకోవడం ద్వారా వారికి ముందు ముందు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఒక్కో లెవెల్ 3నెలల వరకు ఉంటుందన్నారు.పరీక్ష నిర్వహించిన అనంతరం వారికి సర్టిఫికెట్స్ అందజేస్తమన్నారు. ఈ ఇన్స్టిట్యూట్ లో ఫీజు రూ:4వేల నుంచి ప్రారంభమవుతుందన్నారు.

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ .. త్వరలో ఏపీఎల్ సీజన్ - 3 ప్రారంభం..

చాక్లెట్ డిస్పెన్సెర్,రేప్లిక ఆఫ్ ఎటిఎం, స్మార్ట్ డస్ట్ బిన్,సెన్సార్ బెల్,రేమోట్ తో నడిచే పలు పరికరాలు తయారు చేశామని ఇక్కడికి వచ్చే విద్యార్థులు చెప్తున్నారు. అయితే పాఠశాల స్థాయిలోనే వీటిని నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుందని ఇప్పటినుంచే వీటిని నేర్చుకోవడం వల్ల ఎంతో అవగాహన వచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇది తమకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.

2024-05-05T07:11:12Z dg43tfdfdgfd