చిన్న సబ్బు ముక్కతో బొద్దింకలను తరిమి కొట్టొచ్చు.. ఎలాగో తెలుసా?

బొద్దింకలను ఇంట్లో నుంచి సమూలంగా నిర్మూలించాలి.  చాలా మంది ఈ బొద్దింకలను వదిలించుకోవడం కోసం  మార్కెట్లో లభించే కెమికల్స్ తో ఉండే స్ప్రేలను వాడుతూ ఉంటారు. అయితే... వాటి వల్ల బొద్దింకలు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ ఎక్కువగా వచ్చేస్తూనే ఉంటాయి

మనం మన వంట గదిని తరచూ శుభ్రం చేసుకుంటూనే ఉంటాం. అయితే... మనం ఎంత శుభ్రం చేసినా కూడా ఇంట్లో బొద్దింకలు వస్తూనే ఉంటాయి. ఒక్కటి పుట్టుకొస్తే చాలు.. రెండు, మూడు రోజుల్లోగా అవి వందలుగా, మందలుగా పెరిగిపోతాయి. ఒక్కసారి బొద్దింకలు పుట్టుకువచ్చాయంటే వాటిని వదిలించడం అంత సులభం కాదు.  వంట గదిలో మురికి ని వ్యాపింప చేయడమే కాకుండా... మనం తినే ఆహారాన్ని సైతం కలుషితం చేస్తాయి.

అందుకే...  బొద్దింకలను ఇంట్లో నుంచి సమూలంగా నిర్మూలించాలి.  చాలా మంది ఈ బొద్దింకలను వదిలించుకోవడం కోసం  మార్కెట్లో లభించే కెమికల్స్ తో ఉండే స్ప్రేలను వాడుతూ ఉంటారు. అయితే... వాటి వల్ల బొద్దింకలు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ ఎక్కువగా వచ్చేస్తూనే ఉంటాయి. అంతేకాదు... కెమికల్స్ తో ఉండే వాటిని వాడాలంటే... కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా పిల్లలు ఉంటే చాలా డేంజర్ కూడా. అవి లేకుండా... కేవలం.. ఒక్క చిన్న సబ్బు ముక్కను వాడి చాలా ఈజీగా బొద్దింకలను ఈజీగా తరిమి కొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం...

మనకు మార్కెట్లో సన్ లైట్ సబ్బు అనేది దొరుకుతుంది. బొద్దింకలను తరిమికొట్టడానికి ఈ సబ్బును ఉపయోగించవచ్చు. ఈ సన్ లైట్ సబ్బును చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దానికి ఒక గ్లాసు నీటిలో వేసి కరిగించాలి. సబ్బు మొత్తం కరిగినతర్వాత.. ఆ నీటిని స్ప్రే బాటిల్ లో పోయాలి. ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్ లో లిక్విడ్ ని  వంటగదిలో బొద్దింకలు వచ్చే ప్రదేశంలో స్ప్రే చేయాలి.  ఈ సబ్బులో ఉండే రసాయనాలను శుభ్రపరచడంలో, బొద్దింకలను చంపడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి.

ఈ సబ్బు మాత్రమే కాకుండా.. బోరిక్ యాసిడ్  ఉపయోగించి కూడా బొద్దింకలు తరిమికొట్టొచ్చు. బొరిక్ యాసిడ్  ను నీటిలో కరిగించి.. ఇంట్లో పలు మూలల్లో స్ప్రే చేయాలి. వాటర్ లో కలపకుండా.. డైరెక్ట్ గా ఈ పొడిని చల్లడం వల్ల కూడా వీటిని వెల్లగొట్టొచ్చు. బోరిక్ యాసిడ్ వాసనకు బొద్దింకలు ఇష్టపడవు. దూరంగా పారిపోతాయి. అయితే... ఇది చల్లే సమయంలో.. పిల్లలను దూరంగా ఉంచడం మంచిది.

బొద్దింకలు బలమైన వాసనలను ద్వేషిస్తాయి. అందువల్ల, వాటిని ఇంట్లో నుండి తరిమికొట్టడానికి, నీటిలో పుదీనా నూనె , ఉప్పును కరిగించి మిశ్రమాన్ని తయారు చేయండి. బొద్దింకలు తమ మందలో నివసించే వంటగదిలోని ప్రాంతాలపై ఈ ద్రావణాన్ని పిచికారీ చేయండి. నీళ్లలో ఉప్పు, మిరియాల నూనె కలిపి నేల తుడుచుకుంటున్నప్పుడు కూడా ఇంట్లో బొద్దింకలు సంచరించవు. వీటితో కూడా  బొద్దింకలను తరిమికొట్టొచ్చు. 

2024-05-03T05:28:39Z dg43tfdfdgfd