చెరుకు రసం గ్లాస్ కేవలం రూ.15.. స్పెషల్ ఏంటంటే..

నిప్పుల కక్కే సూర్యుడి నుంచి శరీరాన్ని చలువ పరుచుకునేందుకు చల్లటి పానీయాలు అవసరం. చల్ల చల్లగా రుచికరమైన రసాలను తాగడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాటితోపాటు కొద్దిగా నిమ్మకాయ రసం, కొంచెం అల్లం రసం వంటివి కలిపి ఇచ్చారంటే వాటి రుచి చాలా అద్భుతం అంటారు ప్రజలు.

చెరుకు గడలను తినటమే కాదు..జ్యూస్ లను కూడా తాగాలి. అప్పుడే అసలైన మజా ఉంటుంది. మరి అలాంటి చెరుకు రసాన్ని తాగాలంటే మాత్రం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండలానికి పోవాల్సిందే. బంగ్లాకు ఎదురుగా ఉన్న కొద్ది మేర స్థలంలో చెరుకురసం బండి ఉంటుంది. దీనిని ఏర్పాటు చేసుకొని 7 సంవత్సరాలు అవుతుందని చెరుకు రసం అమ్మే వ్యక్తి వలి భాష లోకల్ 18తో చెప్పారు.

తను ఈ చెరుకులను కర్నూలు మరియు ఇతరప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుంటానన్నారు. తను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా చెరుకు రసం విక్రయాలు చేస్తానన్నారు. బాగా ఎండలు ముదిరిపోవటంతో జనాలు దప్పిక తీర్చుకోవడం కోసం పళ్ల రసాలు, చెరుకు రసాలకు ఎక్కువగా ప్రాధాన్యాతను ఇస్తున్నారన్నారు. చెరుకు రసం ఒక గ్లాస్ వచ్చేసి 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఉంటుందన్నారు.

అంకాపూర్ చికెన్ అంటే అట్లుంటది మరి.. అసలు విషయం ఏంటంటే..

ఒక లీటర్ బాటిల్ చెరుకు రసం వచ్చేసి 150 రూపాయలతో అమ్మకాలు జరుపుతూ ఉంటామన్నారు. ఈ చెరుకు రసం తాగిన ప్రతి ఒక్కరు మెచ్చాల్సిందేనన్నారు. అంత రుచిగా ఉంటుందని తెలిపారు. ఈ ఎర్రటి ఎండల్లో చల్లటి చెరుకు రసం, పండ్ల రసం, లేదంటే చల్లటి నీళ్లు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా సేల్స్ అవుతాయన్నారు. వాటి కన్నా హెల్తీ హెల్తీగా ఉండే చెరుకురసం చాలా బెస్టు అని అంటున్నారు.

నిమ్మకాయ, అల్లం కలిపి చెరుకు రసం తయారు చేయటం రుచికి బాగుంటుందన్నారు. అల్లం, నిమ్మకాయ రసం ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు. మరెందుకు ఆలస్యం ఎప్పుడైనా ఇటుగా పయనిస్తే మాత్రం ఈ చెరుకు రసాన్ని మాత్రం తాగకుండా మాత్రం వెళ్లకండి.

2024-04-22T10:36:18Z dg43tfdfdgfd