చెస్ రామయ్య వద్దకు మీ పిల్లలను పంపించారా.. చెస్ ఛాంపియన్లు కావాల్సిందే..

వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో స్కూల్ పిల్లల కి ఎలాంటి కోర్సులు నేర్పిస్తే మంచిది అనే తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారా..కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో పిల్లలకి మైండ్ కి పదును పెట్టే చెస్ ఆటలో నైపుణ్యం సాధించే దిశగా ఆలోచన చేయండి. అలా అయితే ఈ వేసవి కాలం మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ మధ్య కాలం లో తల్లి దండ్రులు ఎక్కువ శాతం పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా ఆటలలో నేర్పించేదుకు తల్లిదండ్రులు కృషి చేస్తుంటారు కానీ ఈ చెస్ ఆటలో నైపుణ్యం సాధించినట్లైతే ఎలాంటి క్రీడలోనైన అలవోకగా విజయాన్ని సాధిస్తారని అంటున్నారు చెస్ కోచ్ రామయ్య పూర్తి వివరాలతో లోకల్ 18 ప్రత్యెక కథనం.

పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన రామయ్య గత 50 ఏళ్లుగా చెస్ కోచింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు రామయ్య సుమారు లక్ష మందికి పైగా చెస్ కోచింగ్ ఇచ్చారు. అందులో ఎంతో మంది విద్యార్థులు నేషనల్ కాంపిటీషన్స్ లో కూడా పాల్గొన్నారని కోచ్ రామయ్య తెలిపారు.

కోచ్ రామయ్య ఈ పెద్దపల్లి ప్రాంతానికి మాత్రమే కాకుండా ,మంచిర్యాల, ఆసిఫాబాద్, అదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో చెస్ ట్రైనింగ్ ఇస్తూ చెస్ రామయ్యగా గుర్తింపు పొందారు. చెస్ రామయ్య వద్ద చెస్ నేర్చుకునే పిల్లలంతా ప్రైమరీ స్టూడెంట్స్ ఎక్కువగా ఎక్కువ శాతం లో ఉన్నారు.కానీ కోచ్ నేర్పించే విధానంతో వారు చెస్ లో నైపుణ్యం పొంది అద్భుతంగా రాణిస్తున్నారు.

---- Polls module would be displayed here ----

చెస్ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు...

చెస్ ఆడటం వల్ల పిల్లల మైండ్ షార్ప్ గా పని చేస్తుందని కోచ్ రామయ్య తెలిపారు. చెస్ ఆడే క్రమం లో ఇద్దరీ మధ్య ఒక సైలెంట్ వార్ జరుగుతుంది. ఆ వార్ లో గెలిచేది ఒక్కరూ అయినా ఇద్దరి మైండ్ లో జరిగే సైలెంట్ యుద్ధం లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వారి ఆలోచన విధానం లో ఎన్నో మార్పులను తీసుకొస్తుందని అన్నారు. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత శక్తిని మెరుగుపరుస్తుంది. ప్లానింగ్ మరియు ఆర్గనైజేషన్ స్కిల్స్ అభివృద్ది చెందుతాయి.ఏ ఆటలో అయిన గెలవగలను అనే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.మెంటల్ గా సైకలాజికల్ గా స్ట్రాంగ్ అవుతారు.ఐక్యు స్థాయి మెరుగుపడుతుంది. క్రీడా నైపుణ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వేసవి సెలవుల్లో ఫోన్ నుండి దూరం చేస్తుంది.

చూశారుగా చెస్ నేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చెస్ ఆటలో నైపుణ్యం పొందటం వల్ల జీవితానికి అవసరమయ్యే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అందుకే ఈ వేసవి లో ప్రతి ఒక్క తల్లి తండ్రులు మీ పిల్లలను చెస్ ఆటలో కోచింగ్ ఇప్పించి వారి భవిష్యత్తుకు మంచి మార్గం వేయాలని కోచ్ రామయ్య కోరారు. ఇక చెస్ రామయ్య చెస్ అకాడమి లో మీ పిల్లలను నేర్పించాలి అనుకుంటే మీరు సంప్రదించాల్సిన నెంబర్లు ఇవే. 7396780088, రామయ్య చెస్ అకాడమీ, రామగుండం.

2024-04-24T10:13:26Z dg43tfdfdgfd