Trending:


Besan Ladoo: బెసన్ లాడూ ఇప్పుడు సులభంగా తయారు చేసుకోండి ఇలా..!

Besan Ladoo Recipe: బెసన్ లాడూ అనేది భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన స్వీట్. ఇది శెనగపిండి, నెయ్యి, చక్కెర తో తయారు చేస్తారు. ఈ లడ్డులు చాలా రుచికరంగా ఉండటమే కాకుండా,


ఈ 5 రాశుల వారికి ఈనెల రోజలు పాటు సుడి తిరిగినట్లే.. ఏం చేసినా డబ్బే డబ్బు

Astrology: జ్యోతిషశాస్త్రంలో ఉపచయ స్థానాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఉపచయ స్థానా లంటే వృద్ధి స్థానాలు. జాతక చక్రంలో 3,6,10,11 స్థానాలను వృద్ధి స్థానాలంటారు. ఈ రాశుల్లో పాప గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు తప్పకుండా శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అనేక విధాలుగా, అనేక రంగాల్లో పురోభివృద్ధి ఉంటుంది. కెరీర్ పరమైన పురోగతి, ఆర్థిక పురోగతి, ధన యోగాలు, ప్రయత్నాల్లో విజయాలు వంటివి తప్పకుండా చోటు చేసుకుం టాయి. ఈ నెల 14 నుంచి రవి గ్రహం వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తున్న కారణంగావృషభంతో పాటు కర్కాటకం, సింహం, ధనుస్సు, మీన రాశుల వారు విశేషంగా ఆర్థికప్రయోజ నాలు పొందడంతో పాటు సామాజికంగా, ఉద్యోగపరంగా అంచనాలకు మించిపురోగతి చెందడం జరుగుతుంది. రవి జూన్ 14 వరకూ ఇదే రాశిలో సంచారం చేయడంజరుగుతుంది. వృషభం(Taurus): ఈ స్థిర రాశిలోకి రవి గ్రహం ప్రవేశిస్తున్నందువల్ల ఆర్థికంగా, వృత్తి,ఉద్యోగాలపరంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు లాభాలపరంగానిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సామాజికంగాహోదా కూడా వృద్ధి చెందుతుంది. రాజకీయంగా, ప్రభుత్వ పరంగా అనేక ప్రయోజనాలుకలుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. తప్ప కుండా వాహనయోగం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది. కర్కాటకం (Cancer): కర్కాటకం ఈ రాశికి లాభ స్థానంలో రవి సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెండిం గులో ఉన్న లేక వాయిదా పడిన ఏ కార్యమైనా నెరవేరుతుంది. పితృమూలక ధన లాభం ఉంటుంది. జాతకంలో శని, కుజ, రాహు దోషాలు ఉన్న పక్షంలో అవి తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. సింహం(Leo):ఈ రాశికి అధిపతి అయిన రవి గ్రహం దశమ స్థానంలో స్థిర రాశిలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఓ వెలుగు వెలిగే అవ కాశముంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే హోదాపరంగా, జీతభత్యాల పరంగా మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ధనుస్సు(Sagittarius): ఈ రాశివారికి ఆరవ స్థానంలో రవి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కోసం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వ్యాపారంలో పోటీదార్లు తగ్గి ఉండే అవకాశముంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు సంపాదించే సూచనలు న్నాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. మీనం(Pisces):ఈ రాశికి తృతీయ స్థానంలో రవి గ్రహ సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో సత్ఫలితాలు సాదిస్తారు. మంచి ఉద్యోగం లోకి మారడానికి అవకాశముంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదు రుతుంది. ఉద్యోగంలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. విదేశీ యానానికి కూడా అవ కాశముంది. సామాజిక హోదా కూడా పెరుగుతుంది. ఒకటి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


ఇండియాలో వేసవి విడిదికి అందమైన ద్వీపాలు!

ఇండియాలో ఉన్న ఆకర్షణీయమైన ఐలాండ్స్‌ గురించి ఇక్కడ వివరించాం. ఈ ఐలాండ్స్‌ వేసవిలో పర్యటించేందుకు బాగుంటాయి.


TSRTC Dress Code : ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు నో- టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు

TSRTC Dress Code : టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల వస్త్రధారణ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు ధరించి విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేసింది.


6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు

6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు


Zodiac Pairs: ఈ రాశులవారు టామ్ అండ్ జెర్రీ టైప్ - పెళ్లి జరిగితే ఇల్లు కురుక్షేత్రమే!

Which two Zodiac Signs Should Not Marry: పెళ్లిపై ఉన్నన్ని జోక్స్ మరే విషయంపైనా ఉండవేమో. అన్నీ సరిగ్గా సెట్టైతే అంతకు మించి సంతోషకర జీవితం ఉండదు..ఏ చిన్న తేడా వచ్చినా అంతకు మించి నరకం ఉండదు. కలసి ఉండలేరు , విడివిడిగా ఉండలేరు..మొత్తానికి టామ్ అండ్ జెర్రీలా నిత్యం కొట్టుకుంటూ ఈ జీవితం ఇంతే అని సాగిపోతారంతే. ఇదంతా మీ రాశులపై ఆధారపడి ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఎందుకంటే కొన్ని నక్షత్రాల వారికి పొత్తు కుదరనట్టే కొన్ని రాశుల మధ్య కూడా...


Cooking Methods: వంట ఇలా వండితే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు, ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు

ICMR Cooking Methods Guidelines: ఏం తింటున్నామనే కాదు. ఎలా వండుతున్నామనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు. వంట వండే పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు చేస్తే హల్తీగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కూడా ఇదే విషయం మరోసారి స్పష్టం చేసింది. Dietary Guidelines for Indians (DGI) పేరుతో వంటకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలా వండితే ఆయా పదార్థాల్లో పోషకాలను...


పిల్లల విషయంలో తల్లులు అస్సలు చేయకూడని తప్పులు ఇవే...!

తమ పిల్లలను గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలిపెడుతున్నారు. కానీ... మీ పిల్లలను మీరే పెంచాలి. వారికి మీరు కచ్చితంగా క్వాలిటీ టైమ్ కేటాయించాలి. ప్రతి తల్లి తన బిడ్డపై అమితమైన ప్రేమ పెంచుకుంటుంది. అమ్మ ప్రేమ విషయంలో మనం ఎలాంటి లోపాలు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. కానీ... తెలిసీ తెలియక చాలా మంది తల్లులు.. పిల్లల పెంపకంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రోజుల్లో పేరెంట్స్ కి పిల్లలపై ప్రేమ ఉంటే సరిపోదు....


ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయా..? బీ అలర్ట్

Fresh Fruit Juice: ఈ మండుటెండల్లో ఫ్రూట్ జ్యూస్ తాగితే మంచిదని అందరూ భావిస్తారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తే ఒక్కసారి మీ ఆలోచన మార్చుకోండి. ఎందుకంటే వేసవి తీవ్రత తట్టుకోలేక ఫ్రెష్ జ్యూస్ తాగాలని ఫీలయితే మీకే నష్టం. ఎందుకంటే హెల్త్ డ్రింక్ అని మీరు అనుకుంటున్న జ్యూస్ ఈ వేసవిలో మీకు హాని కలిగించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకోండి. ఫైబర్ ఉండదు : ఇంట్లో మీరు తాజాగా తయారుచేసిన జ్యూస్‌లో స్టోర్‌లో కొన్న జ్యూస్‌లో ఉన్నంత చక్కెర ఉంటుంది. మొత్తం పండ్లలో అందించే అవసరమైన ఫైబర్ మాత్రం ఉండదు. ఫైబర్ చక్కెరను నెమ్మదిగా శోషించడాన్ని నిర్ధారిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుందని గుర్తుంచుకోండి. రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం కావచ్చు: మీరు పండ్ల రసాలను తాగినప్పుడు మీ రక్తంలో షుగర్ లెవెల్స్ వెంటనే పెరుగుతాయి. ఇది మీరు సోడా తాగిన దానికి సమానం. ఇది మీ కేలరీల సంఖ్యను పెంచుతుంది. అంతే కాకుండా మొత్తం పండ్లను తిన్న తర్వాత మీరు పొందే సంపూర్ణత్వ అనుభూతిని ఇది ఇవ్వదు. బరువు పెరగడం: ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల తరచుగా అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి రసాల కంటే మొత్తం పండ్లను ఎంచుకోవడం ఎల్లప్పుడూ తెలివైన ఆలోచన. మొత్తం పండ్లలో ఫైబర్ అధికంగా ఉన్నందున ఇది మీకు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పోషకాలు కోల్పోవడం: ఫ్రూట్ జ్యూస్ చేయడం వల్ల విలువైన పోషకాలు పోతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇక జ్యూస్ పిండుకున్న వెంటనే తాగకపోతే మరిన్ని పోషకాలు నశిస్తాయి. పండ్ల రసాలు ఆమ్లంగా ఉంటాయి: దంతాలు, చిగుళ్ళకు హాని కలిగిస్తాయి. సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు పండ్ల రసాలను తరచుగా లేదా ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అది మీ నోటి ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా పండ్లు పోషకాలు: ఫ్రూట్స్ సాధారణ పోషకాలు కానీ వాటిని సరిగ్గా తింటేనే వాటిలో ఉండే పోషకాలు మనకు అందుతాయి. పండ్లను పూర్తిగా కోసిన వెంటనే తినాలి. పండ్లలో వివిధ విటమిన్లు,ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో పండ్లను చేర్చుకోవడం ద్వారా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వేసవి కాలానికి తగ్గట్టుగా ఆహారాన్ని మార్చుకోవడం అవసరం.


మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా మార్చుకోండిలా!

ఎదుటి వ్యక్తిని సులభంగా అకర్షించేందుకు ఉపయోగపడే సింపుల్ టిప్స్‌ గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ఈ టిప్స్‌ ఫాలో అయితే వ్యక్తితత్వం దృఢంగా మారుతుంది.


Chettinad Idli Podi: ఇడ్లీ దోశెల్లోకి చెట్టినాడ్ ఇడ్లీ పొడి, ఒక్కసారి చేసుకుంటే నెలరోజులు నిల్వ ఉంటుంది

Chettinad Idli Podi: ఇడ్లీ, దోశెల్లో ఎప్పుడూ చట్నీలే తింటే ఎలా? ఒకసారి చెట్టినాడ్ ఇడ్లీ పొడి చేసుకుని చూడండి. స్పైసీగా టేస్టీగా ఉంటుంది. రెసిపీ చాలా సులువు.


Tomato and Turmeric face pack: టమోటా, పసుపుతో ఈ ఫేస్‌ప్యాక్‌ తయారు చేసుకోండి.. మీ ముఖానికి గోల్డెన్‌ గ్లో..

Tomato and Turmeric face pack: ఏదైనా పార్టీలు, పెళ్లిళ్లు, శుభాకార్యలకు వెళ్లాలనుకుంటే వెంటనే పార్లర్లకు వెళ్తాం. ఎందుకంటే ముఖం డల్‌గా, నిర్జీవంగా కనిపిస్తుంది. మీ ముఖం మెరుస్తూ అందరిలో కనిపించాలని మీరు అనుకుంటారు.


నేచర్ లవర్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాలు!

ప్రకృతి అందాలను ఇష్టపడే వారికి ఇండియాలో కొన్ని డెస్టినేషన్స్ తప్పక నచ్చుతాయి. అవేంటో తెలుసుకుందాం.


ఈయన దగ్గరకు మీ పిల్లలను పంపించారా.. చెస్ ఛాంపియన్లు కావాల్సిందే..

వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో స్కూల్ పిల్లలకి ఎలాంటి కోర్సులు నేర్పిస్తే మంచిది అని తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారా.. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో పిల్లలకి మైండ్ కి పదును పెట్టే చెస్ ఆటలో నైపుణ్యం సాధించే దిశగా ఆలోచన చేయండి. అలా అయితే ఈ వేసవి కాలం మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ మధ్య కాలం లో తల్లిదండ్రులు ఎక్కువ శాతం పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా ఆటలలో నేర్పించేదుకు తల్లిదండ్రులు కృషి చేస్తుంటారు కానీ ఈ చెస్ ఆటలో నైపుణ్యం సాధించినట్లైతే ఎలాంటి క్రీడలోనైన అలవోకగా విజయాన్ని సాధిస్తారని అంటున్నారు చెస్ కోచ్ రామయ్య పూర్తి వివరాలతో లోకల్ 18 ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన రామయ్య గత 50 ఏళ్లుగా చెస్ కోచింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు రామయ్య సుమారు లక్ష మందికి పైగా చెస్ కోచింగ్ ఇచ్చారు. అందులో ఎంతో మంది విద్యార్థులు నేషనల్ కాంపిటీషన్స్ లో కూడా పాల్గొన్నారని కోచ్ రామయ్య తెలిపారు. కోచ్ రామయ్య ఈ పెద్దపల్లి ప్రాంతానికి మాత్రమే కాకుండా ,మంచిర్యాల, ఆసిఫాబాద్, అదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో చెస్ ట్రైనింగ్ ఇస్తూ చెస్ రామయ్యగా గుర్తింపు పొందారు. చెస్ రామయ్య వద్ద చెస్ నేర్చుకునే పిల్లలంతా ప్రైమరీ స్టూడెంట్స్ ఎక్కువగా ఎక్కువ శాతంలో ఉన్నారు. కానీ కోచ్ నేర్పించే విధానంతో వారు చెస్ లో నైపుణ్యం పొంది అద్భుతంగా రాణిస్తున్నారు. చెస్ ఆడటం వల్ల పిల్లల మైండ్ షార్ప్ గా పని చేస్తుందని కోచ్ రామయ్య తెలిపారు. చెస్ ఆడే క్రమంలో ఇద్దరీ మధ్య ఒక సైలెంట్ వార్ జరుగుతుంది. ఆ వార్ లో గెలిచేది ఒక్కరూ అయినా ఇద్దరి మైండ్ లో జరిగే సైలెంట్ యుద్ధంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వారి ఆలోచన విధానంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుందని అన్నారు. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత శక్తిని మెరుగుపరుస్తుంది. ప్లానింగ్ మరియు ఆర్గనైజేషన్ స్కిల్స్ అభివృద్ది చెందుతాయి.ఏ ఆటలో అయిన గెలవగలను అనే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.మెంటల్ గా సైకలాజికల్ గా స్ట్రాంగ్ అవుతారు.ఐక్యు స్థాయి మెరుగుపడుతుంది. క్రీడా నైపుణ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వేసవి సెలవుల్లో ఫోన్ నుండి దూరం చేస్తుంది. చూశారుగా చెస్ నేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చెస్ ఆటలో నైపుణ్యం పొందటం వల్ల జీవితానికి అవసరమయ్యే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అందుకే ఈ వేసవి లో ప్రతి ఒక్క తల్లి తండ్రులు మీ పిల్లలను చెస్ ఆటలో కోచింగ్ ఇప్పించి వారి భవిష్యత్తుకు మంచి మార్గం వేయాలని కోచ్ రామయ్య కోరారు. ఇక చెస్ రామయ్య చెస్ అకాడమి లో మీ పిల్లలను నేర్పించాలి అనుకుంటే మీరు సంప్రదించాల్సిన నెంబర్లు ఇవే. 7396780088, రామయ్య చెస్ అకాడమీ, రామగుండం.


Watermelon Juice:సమ్మర్‌లో ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ ఇలా తయారు చేసుకోండి..!

Watermelon Juice Recipe: పుచ్చకాయ జ్యూస్ వేసవిలో చాలా ప్రాచుర్యం పొందిన డ్రింక్. ఇది రుచికరమైనది, చల్లగా ఉంటుంది, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.


Chanakya Niti చాణక్యుని ప్రకారం, వివాహ బంధంలో విభేదాలు రాకూడదంటే.. ఈ తప్పులు చేయకండి...

Chanakya niti చాణక్య నీతి శాస్త్రం ప్రకారం, వివాహ జీవితంలో విభేదాలు రాకుండా.. మీ బంధం మరింత బలపడాలంటే కొన్ని తప్పులు పొరపాటున కూడా చేయకూడదు. అయితే సంతోషంగా ఉండేందుకు ఏం చేయాలో కూడా వివరించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


Combination Foods: కాఫీ తాగుతూ ఇవి అస్సలు తినకండి.. తింటే మీ ఆరోగ్యం మటాష్!

కాఫీ ఒక బెస్ట్ రీఫ్రెష్ డ్రింక్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది, మెదడును చురుకుగా ఉంచుతుంది. కాఫీ తాగడం వల్ల మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో ఉండే కెఫిన్, ఇతర సమ్మేళనాలు డిప్రెషన్‌కు చెక్ పెడతాయి. అందుకే చాలామంది రోజూ ఈ హాట్ డ్రింక్ తాగుతారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా బిస్కట్లు, బ్రెడ్, స్నాక్స్ వంటివి తినడం చాలామందికి అలవాటు. ఈ కాంబినేషన్ వెరైటీ టేస్ట్‌ ఇస్తుంది. అయితే కాఫీ తాగేటప్పుడు కొన్ని రకాల ఫుడ్స్‌ను కాంబినేషన్‌గా తినకూడదు. వీటివల్ల కాఫీ రుచి మారవచ్చు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఆ పదార్థాలు ఏవో చూద్దాం. సిట్రస్‌ ఫ్రూట్స్నారింజ, ద్రాక్ష, బత్తాయి, జామ వంటి సిట్రస్ జాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. కాఫీ తాగేటప్పుడు ఈ పండ్లను తినకూడదు. ఎందుకంటే వీటిలోని సిట్రిక్ యాసిడ్, కాఫీలోని కెఫిన్‌తో రియాక్షన్ జరుపుతుంది. ఫలితంగా వివిధ రకాల జీర్ణ సమస్యలు రావచ్చు. కొందరికి పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. పనీర్చాలామంది కాఫీ తాగుతూ పనీర్‌తో చేసిన స్నాక్స్ తింటారు. అయితే ఇది కూడా సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే పనీర్‌‌లో కాల్షియం ఉంటుంది. కాఫీలోని కెఫిన్, శరీరం కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అందుకే ఈ కాంబినేషన్ సెట్ కాదు, ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫ్రైడ్ స్నాక్స్కరకరలాడే ఫ్రైడ్ స్నాక్స్‌ను కాఫీ తాగుతూ తింటే రుచి మారే అవకాశం ఉంది. పైగా వీటితో కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. సాధారణంగా చాలామంది కాఫీ తాగుతూ పకోడీలు, కారపూస వంటి పప్పు దినుసులతో చేసిన చిరుతిళ్లను తింటారు. ఇది సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే కాఫీ, ఫ్రైడ్‌స్నాక్స్ కాంబినేషన్ జీర్ణ సమస్యల తీవ్రతను మరింత పెంచుతుంది. పోషకాల శోషణ తగ్గుతుంది. ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. కాఫీ తాగుతూ మిరపకాయ బజ్జీలు కూడా తినకూడదు. ఈ ఫుడ్ కాంబినేషన్‌ పొట్టలో ఎసిడిటీ, చిరాకు కలిగిస్తుంది. పాలు, పాల ఉత్పత్తులుకాఫీ, డెయిరీ ప్రొడక్ట్స్‌ను కాంబినేషన్‌గా అసలు తీసుకోకూడదు. ఎందుకంటే జున్ను, క్రీమ్, పాలు వంటి డెయిరీ ప్రొడక్ట్స్ తింటూ కాఫీ తాగినప్పుడు.. శరీరం ఐరన్‌ను శోషించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఈ కాంబినేషన్‌ మంచిది కాదు. అంతేకాకుండా కాఫీ తాగేటప్పుడు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, ఆకుకూరలతో చేసిన ఆహారాలు కూడా తినకూడదు. స్పైసీ ఫుడ్స్స్పైసీ ఫుడ్స్, స్నాక్స్ రుచికరంగా, ఘాటుగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఆస్వాదిస్తారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా స్పైసీ ఫుడ్స్ తినకపోవడం మంచిది. ఎందుకంటే ఈ రెండిటి కాంబినేషన్ పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


ఇండియాలో బ్యాన్ చేసిన ఆహారాలు ఇవిగో!

కొన్ని కారణాల వల్ల ఇండియాలో కొన్ని ఆహారాలను బ్యాన్ చేశారు. అవేంటో తెలుసుకుందాం.


horoscope today 08 May 2024 ఈరోజు సౌభాగ్య యోగం వల్ల కర్కాటకం, మీనంతో సహా ఈ 5 రాశులకు అద్భుత విజయాలు..!

horoscope today 08 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సర్వార్ధ సిద్ధి యోగం, సౌభాగ్య యోగం వల్ల కర్కాటకం, మీనంతో సహా ఐదు రాశుల వారికి అద్భుత విజయాలు కలగనున్నాయి. మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


మీరు పుట్టిన తేదీ ప్రకారం మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా..?

న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మనం ఎలా ఉన్నాం అనేది మనకు ఉన్న అలవాట్లే నిర్ణయిస్తాయి. మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారు.. ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. అదే.. చెడు అలవాట్లు ఉన్నవారికి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో...


Akshaya Tritiya: ఈ మూడు రాశుల్లో మీ రాశి ఉందా? అక్షయ తృతీయ రోజు పట్టిందల్లా బంగారమేనట

వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను చాలా విశిష్టంగా జరుపుకుంటారు. ఈరోజున సూర్యోదయమునకు ముందే లేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే సకల సంపదలు కలుగుతాయి. పురాణాలలో నారదుడు ఒకసారి విష్ణుమూర్తిని అడిగాడట ఓ నారద అక్షయ తృతీయ విశిష్టత ఏమిటని తెలియజేయమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడట క్షయ కానిది అనగా తరిగిపోనిది అక్షయ తృతీయ అంటారు. ఈరోజు సిరి సంపదలను కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సంపద తరగదని అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారని కరీంనగర్ అభయాంజనేయ స్వామి అర్చకులు ప్రకాష్ బాబు లోకల్ 18కి తెలిపారు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున వృశ్చిక రాశి, మేష రాశి, మీన రాశి వారికి పట్టినందంతా బంగారమేనట. తృతీయ రోజున ధన యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. ఇవి 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. మరోవైపు, ఈ రోజున సూర్యుడు, శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నందున శుక్రాదిత్య యోగం ఏర్పడుతోంది. అలాగే ఈ రోజున మీనరాశిలో కుజుడు, బుధుడు కలవడం వల్ల ధన యోగం, శని మూల త్రికోణ రాశి కుంభరాశిలో ఉండడం వల్ల షష యోగం, ఉచ్ఛ రాశి మీనరాశిలో కుజుడు ఉండటం వల్ల ధనయోగం. మాలవ్య రాజ్యయోగం, వృషభరాశిలో చంద్రుడు, బృహస్పతి కలయిక ఏర్పడుతుంది. ఈ విధంగా, ఈసారి అక్షయ తృతీయ నాడు అనేక రాజయోగాలు ఏర్పడటం వలన 3 రాశుల వారు ధనవంతులు కావచ్చు. అలాగే అక్షయ తృతీయ రోజు ఈ రాశుల వాళ్లు బంగారం, లేదా వెండి, వస్తువులు కొంటే ఇంకా పట్టిందల్లా బంగారమే అవుతుందట ..అయితే మిగతా రాసుల వారికి ఈ రాసుల వారితో పోల్చితే కొంచెం గ్రహబలాలు అలాగే తక్కువ కలిసి వచ్చే అవకాశం ఉందని అర్చకులు ప్రకాష్ బాబు తెలిపారు. అయితే ఈ మిగతా రాశుల వాళ్లు అక్షయ తృతీయ రోజు హనుమాన్ ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేస్తే మిగతా రాశుల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


రాశిఫలాలు 12 మే 2024 ఈరోజు మేషంలో బుధాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు..!

horoscope today 12 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల మిధునం, మీనంతో సహా ఈ 5 రాశులకు గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...


Jasmine Flowers: కేవలం మూడ్ పెంచడానికే కాదు.. మల్లెపూలతో ఎన్ని లాభాలో మీకు తెలుసా..?

సాధారణంగా మల్లెపూలు అంటే కేవలం మూడ్ పెరుగుతుంటుందని మనం తరచూ సినిమాల్లో చూస్తుంటాం. అయితే నిజానికి మల్లెపూలు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలు వేరే అంటున్నారు నిపుణులు. మల్లెపూలు పెట్టుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెపుతున్నారు. మొదటి రాత్రి అప్పుడు దంపతుల మధ్య బంధం బలపడేందుకు మల్లెపూలు బాగా సహకరిస్తాయి. మల్లెపూల వాసన మెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది. పడక గదిలో మంచం మీద ఉన్నప్పుడు టెన్షన్ ని దూరం చేస్తుంది. సిగ్గు, బిడియం, భయాన్ని తొలగిస్తుంది. ఇక మంచంపై మల్లెపూలు చల్లడం వల్ల.. ఆ సువాసనను దంపతులు పీల్చడం వల్ల ప్రశాంతంగా ఉండడమే కాక ఉత్తేజంగా, ఆనందంగా ఉంటారు. మల్లెపూల వల్ల భార్యకు, భర్తకు ఇద్దరికీ ప్రయోజనమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మల్లెపూల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందానికి, ఆనందానికి, గాఢమైన ఆప్యాయతకు, పొందికకు చిహ్నంగా ఈ మల్లెపూలను పరిగణిస్తారు. ముఖ్యంగా పాలు ఇచ్చే తల్లులు మల్లెపూలు పెట్టుకోవడం వల్ల.. బిడ్డకు కావాల్సిన పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయంట. దీని వల్ల లాక్టేషనల్ అమెనోరియా పెరగడమే కాకుండా.. పాల ఉత్పత్తికి కావాల్సిన గాలాక్టోపోయిసిస్ స్థాయి కూడా పెరుగుతాయంట. అలానే ఈ మల్లెపూలు పెట్టుకోవడం వల్ల చల్లగా ఉంటుంది. మల్లెపూలు బుర్రలోని వేడిని గ్రహించి బయటకు పంపుతుందంట. దీంతో ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు చెపుతున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. పూర్వకాలంలో మగవారు కూడా మల్లెపూలు పెట్టుకునేవారంట.. అప్పట్లో వారి జుట్టు పొడవుగా ఉండేదట. అయితే ఫ్యాషన్ కారణంగా మగాళ్లు మల్లెపూలు పెట్టుకోవడం మానేశారు. ఈ మల్లెపూల వాసనకు నిద్రలేమి సమస్య తగ్గుతుందని.. మెడిసిన్ లా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మల్లెపూల వాసనకు మత్తు కలుగుతుంది. అంతేకాదు అతి కోపాన్ని తగ్గించే గుణం మల్లెపూలలో ఉన్నాయని చెబుతున్నారు. చిరాకు, కోపం వంటి వాటిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా దంపతుల మధ్య బంధం బలంగా ఉండడంలో మల్లెపూలు సహకరిస్తాయంట. (గమనిక : ఈ కథనం ఇంటర్నెట్ లో అదుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించింది.)


Saree Cancer: ‘చీర క్యాన్సర్’ గురించి విన్నారా? ఇది ఎవరికి వస్తుందో చెబుతున్న వైద్యులు

Saree Cancer: చీర క్యాన్సర్ వినడానికి వింతగా ఉండవచ్చు. కానీ దీని బారిన పడుతున్న వ్యక్తులు ఉన్నారు. దీన్నే ధోతీ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. చీర వల్ల క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకోండి.


ఫిష్‌ ఆయిల్‌ వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు ఇవే!

ఫిష్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలోని పోషకాలు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.


ఈరాశి వారికి ఉద్యోగంలో పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు మే 11న శనివారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశముంది. ఉద్యోగంలో మంచిగుర్తింపు లభిస్తుంది. కొత్త నైపుణ్యాలు ఉపయోగపడతాయి. ముఖ్యమైనవ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకువిజయవంతం అవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులుసకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండువ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. శుభ వార్తలు వింటారు.. వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) కొన్ని వ్యవహారాలను ధైర్యంగా చక్కబెడతారు. ఆదాయం బాగా పెరిగే అవకాశంఉంది. ముఖ్య మైన పనులు, వ్యవహారాలు సునాయాసంగా పూర్తి అవుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలుఅమలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యో గావకాశాలు కలిసి వస్తాయి. పెళ్లిప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఉద్యోగం మార డానికి చేసేప్రయత్నాలు సఫలం అవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతోకలిసి ఇష్ట మైన ఆలయాలను సందర్శిస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యబాగా తగ్గుతుంది. ఆస్తి వివాదం పెద్దల జోక్యంతో పరిష్కారమవుతుంది.వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలుపాటించడం మంచిది. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. కర్కాటకం (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా ఎవరితోనూవాదోపవాదా లకు దిగవద్దు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణలభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. మిత్రులతోవిందులు, వినోదాల్లో పాల్గొంటారు. అను కున్న పనులు అనుకున్నట్టుపూర్తవుతాయి. చిన్న చిన్న సమస్యలకు ఆందోళన చెందక పోవడం మంచిది. ఇంటా బయటాకొద్దిగా ఒత్తిడి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. బాగా ఇష్టమైన మిత్రులను, బంధువులనుకలుసుకుం టారు. ఒక శుభకార్య‍ంలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి కలిగినవ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రతిభా పాటవాలకు ప్రత్యేకమైన గుర్తింపులభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారు లను, సహోద్యోగులను పని తీరుతోఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలుచేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానేఉంటుంది.. కన్య (Virgo):(ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కొందరుమిత్రులు అండగా నిలబడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.ఆరోగ్యం చాలావరకు కుదుట పడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి.ఉద్యోగంలో మీ పనితీరుకు అధి కారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తివివాదాల్లో పెద్దల నుంచి సహాయం లభిస్తుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడిఉండే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా,ఉత్సాహంగా సాగిపోతాయి. కొన్ని పాత రుణాలు వసూలు అవుతాయి. బంధువుల నుంచిరావాల్సిన డబ్బు కూడా అందుతుంది. ఆర్థిక ప్రయత్నాల వల్ల మానసిక ఒత్తిడికిగురవుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మంచి పరిచయాలుఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. కుటుంబజీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. వృశ్చికం(Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అలవికాని లక్ష్యాలతో ఇబ్బందిపడతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన అవసరాలుతీరిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.బంధుమిత్రుల సహాయంతో ప్రధానమైన పనులు పూర్తవు తాయి. సొంత ఆలోచనలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. వృత్తి,వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.. ధనుస్సు(Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలతో పాటువ్యాపారాలు కూడా లాభసాటిగా, ప్రోత్సాహకరంగా పురోగతి చెందుతాయి. కొన్నిఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని బాగా లాభపడతారు.వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నా లకు సానుకూలంగా ముందుకుసాగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న వ్యవహారాలుఅనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.. మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది.మితిమీరిన ఔదార్యంతో మిత్రులకు సహాయం చేసే అవకాశం ఉంది. వృత్తి జీవితంలోబిజీ అయ్యే అవకాశం ఉంది. రాబడికి, లాభాలకు లోటుండదు. వ్యాపారాల్లో కొత్తఆలోచనలు అమలు చేసి, ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచిఆదరణ ఉంటుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలువింటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.. కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) స్తోమతకు మించి ఇతరులకు సహాయపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులుఎక్కువగా ఆధారపడతారు. అధికారులు మీ సలహాలతో ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యమైన శుభ వార్తలు అందుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.విలువైన కానుకలు లభిస్తాయి. నిరు ద్యోగులకు ఆశించిన స్థాయిలోఉద్యోగావకాశాలు అందివస్తాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు.. మీనం(Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. పిల్లలకు సంబంధించిన సమాచారం ఒకటి ఆనందంకలి గిస్తుంది. చాలా పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితిబాగా అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు. దైవకార్యాల మీద ఖర్చు ఎక్కువవుతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి.పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు.. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


Numerology: వీరు జీవిత భాగస్వామితో చిన్న విషయంలో గొడవ పడతారు

Numerology: 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్యల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి, మీ పుట్టిన తేదీని గమనించండి, పుట్టిన తేదీ మరియు మీరు పొందే సంఖ్య రెండింటి సంఖ్యలను కలపండి. అదే మీ నంబర్ ఆ సంఖ్య ద్వారా 11 మే 2024న మీ జాతకం చెక్ చేసుకోండి. Number1: మీరు ఈ రోజు అనేక కారణాల వల్ల మీ పొదుపును కూడా తగ్గించుకుంటారు, దీని కారణంగా మీరు తరువాత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. సాయంత్రం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాల్లో పాల్గొనవచ్చు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. Number2: ఈ రోజు మీ ఇంటికి అతిథులు రావచ్చు, దీని కారణంగా మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు కూడా ఆయనకు స్వాగతం పలికే పనిలో నిమగ్నమయ్యారు. కుటుంబంలోని చిన్న పిల్లలు మీ నుండి కొన్ని అభ్యర్థనలు చేయవచ్చు, వాటిని మీరు నెరవేరుస్తారు. మీ సోదరులు మరియు పిల్లల వివాహంలో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు Number3: మీరు తలనొప్పి, జ్వరం, అలసట మొదలైన వాటితో బాధపడే అవకాశం ఉన్నందున మీరు ఈ రోజున మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున నంబర్ 3 వ్యక్తులు కష్టపడి పనిచేయాలి, అప్పుడే వారు ఎక్కడికైనా చేరుకోగలుగుతారు. విదేశాల నుండి చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ రోజు మంచిది. Number4: మీరు ఈరోజు మీ పాత అప్పులను తీర్చడంలో విజయం సాధిస్తారు, ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు మీ భాగస్వామితో ఒక చిన్న కారణంతో వాదించవచ్చు, కానీ మీరు విషయాన్ని పరిష్కరించుకోవాలి మరియు దానిని పెంచకూడదు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే, మీరు దానిలో విజయం సాధిస్తారు.. Number5: ఈరోజు మీకు ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే, చేయండి. దేవాలయాలలో పేదలకు సేవ చేయడానికి మీరు విరాళాలు ఇస్తారు. మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఏదైనా మతపరమైన కార్యక్రమం లేదా మతపరమైన యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. Number6: ఈ రోజు ఏ ప్రయత్నమైనా విజయవంతమవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ, కృషికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం కూడా మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రధాన వ్యక్తిగత సమస్యలను తక్కువ ప్రయత్నంతో పరిష్కరించవచ్చు.. Number7: ఈరోజు కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల చదువులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో చాలా బిజీ. ఆస్తి వ్యవహారాలు నిదానంగా పరిష్కారమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురైనా పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు బాగుంటుంది. Number8:ఈరోజు మీకు అనవసర ఖర్చులు పెరుగుతాయి. కార్యాలయంలో అధికారులతో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ప్రాజెక్ట్‌లు మరియు లక్ష్యాలను సకాలంలో మరియు సమర్ధవంతంగా పూర్తి చేయవచ్చు. వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. Number9: మీరు ఈ రోజు బ్యాలెన్స్ పొందుతారు. మొండి బకాయిలు రికవరీ అవుతాయి. మతపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కావలసిన సమాచారం అందుతుంది. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. లోపల మరియు వెలుపల ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


యోగాను ఈ వయస్సు వాళ్లు కూడా చేయవచ్చా..? ఇక్కడ ఫ్రీగానే..

యోగ చేయడానికి వయస్సుతో పనిలేదు. మూడేళ్ల వయసు నుంచి తనువు చాలించే వరకు యోగ చేయవచ్చు. యోగ ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి కూడా తగ్గుతాయని, యోగా గురువు బుచ్చన్న అంటున్నారు. నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థుల వరకు యోగాలో శిక్షణ ఇస్తున్నారు. పతాంజలి యోగ గురువు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ పదవి విరమణ పొందిన బుచ్చన్న ఫ్రీగా విద్యార్థులకు యోగాలో శిక్షణ ఇస్తున్నారు. 2007 నుంచి యోగ గురువుగా శిక్షణ తీసుకున్నారు. ఆ నాటి నుంచి ఉచితంగానే యోగలో శిక్షణ ఇస్తున్నారు. అయితే యోగ చేయాలంటే మూడేళ్ల వయస్సు నుంచి పండు ముసలి వరకు ఎవరైనా యోగ చేయవచ్చు. యోగ చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. పిల్లల్లో మరింత జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వారిలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఎవరితో ఎలా ఉండాలి, పెద్దలను ఎలా గౌరవించాలి. దేశభక్తిపై కూడా గౌరవం పెరుగుతుందని యోగ గురువు బుచ్చన్న చెబుతున్నారు. చిన్నపిల్లలు ఏది చెప్పినా తొందరగా నేర్చుకోగలరు. మొక్కై వంగనిది, మానై వంగుతుందా అన్నట్టుగా చిన్నపిల్లల విషయంలో ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించి.. పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వారం రోజుల్లో ఎలాంటి వారైనా యోగ నేర్చుకోవచ్చు. 15 రోజులు శిక్షణ ఇస్తే వారే కంటిన్యూగా యోగ చేసుకోవచ్చు. ఎవరికైనా కంటిన్యూగా ఫ్రీగా శిక్షణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. ప్రాణయమం చేస్తే మన బాడిలోని అన్ని కణాలను ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో అందుతుంది. దీంతో ఆరోగ్యం కూడా మెరుగవుతుందన్నారు. తాము గత వారం పది రోజులుగా యోగా ఆసనాలు నేర్చుకుంటున్నాము చాలా బాగుందన్నారు. యోగతో మాకు ఏకాగ్రత పెరుగుతుంది. చదువుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుందని విద్యార్థులు చెప్తున్నారు. కాపాల బాత్, ప్రాణయమం, యోగ ఆసనాలు వేస్తున్నామని తెలిపారు.


వంట చేసేటప్పుడు వేడిగా అనిపించొద్దంటే ఏం చేయాలి?

ఎండాకాలంలో వంట చేస్తే వచ్చేంత చిరాకు ఏ కాలంలో రాదు. ఎందుకంటే ముందే మండుతున్న ఎండలు. దీనివల్ల ఇల్లంతా నిప్పుల కుంపటిలా మారుతుంది. దీనికి తోడు పొయ్యి దగ్గర వంట చేయడం ఎంత చిరాకు కలిగిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మీరు వంట చేస్తున్నా చల్లగా ఉంటారు. అదెలాగంటే? ఎండాకాలంలో బయట, ఇంట్లోనే కాదు వంటగది కూడా చాలా వేడిగా మారుతుంది. బెడ్ రూం, హాల్ ను అయితే ఏసీ, కూలర్ తో చల్లగా చేయొచ్చు. కానీ వంటింట్లో ఫ్యాన్ కూడా...


Uses Of Mint: సమ్మర్‌లో తప్పకుండా తీసుకోవాల్సి డ్రింక్‌.. అద్భుతమైన లాభాలు మీసొంతం!

Benefits Of Mint: వేసవికాలంలో ఆరోగ్యకరమైన డ్రింక్‌ను తీసుకోవాలి అంటే పుదీనా వాటర్‌ ఎంతో మంచి ఎంపిక అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


Astrology: మేషరాశిలోకి కుజుడు ప్రవేశం.. 38 ఏళ్ల తర్వాత వీరికి రాజయోగం..

జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం, గ్రహాల అధిపతి అయిన అంగారకుడు జూన్ 1న తన సొంత రాశి అయిన మేషరాశిలో సంచరించబోతున్నాడు. మధ్యాహ్నం 3:39 గంటలకు కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. (ప్రతీకాత్మక చిత్రం) దీని తర్వాత జూలై 1 వరకు కుజుడు మేషరాశిలో ఉంటాడు. మేషరాశిలో ఉండడం వల్ల 4 రాశుల వారికి రాజయోగం కలుగుతుంది. వారికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనితో, ఈ రాశుల వారు విజయాన్ని.. చాలా డబ్బును సాధిస్తారు. ఈ పరిణామం దాదాపు 38 ఏళ్ల తర్వాత జరుగుతంది. (ప్రతీకాత్మక చిత్రం) మేష రాశి వారికి రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. వృత్తికి అనుకూలమైన సమయం, అభివృద్ధి కనిపిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేసి విజయం సాధిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు పొందవచ్చు. పెట్టుబడులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితిలో కూడా మెరుగుదల ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) కర్కాటక రాశి వారికి మార్స్ ట్రాన్సిట్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. అదే సమయంలో.. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొన్ని శుభవార్తలు అందుతాయి. (ప్రతీకాత్మక చిత్రం) ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే, మీరు దానిని కూడా తిరిగి పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) మేషరాశిలో అంగారక సంచారం సింహ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కెరీర్‌లో ఊపు ఉంటుంది. నిలిచిపోయిన అనేక పనులు పూర్తి కాగలవు. కార్యాలయంలో పురోగతికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతితోపాటు జీతాలు పెరుగుతాయి. వ్యాపారుల వ్యాపారంలో విస్తరణ ఉండవచ్చు. డబ్బు సంపాదించడానికి కొత్త వనరులు కూడా సృష్టించబడతాయి. (ప్రతీకాత్మక చిత్రం) ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్ పరంగా చూస్తే సమయం బాగానే ఉంటుంది. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడవచ్చు. మీరు సీనియర్ల నుండి పూర్తి మద్దతు పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారు భాగస్వామిని కనుగొనవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)


Baby Teeth: పసి పిల్లలకు ఈ నెలల్లో దంతాలు వస్తే అశుభం - ఎవరికి కీడు? ఏం జరుగుతుంది?

జ్యోతిష్యం మానవ జీవితంలోని ప్రతి స్థాయిలోని విషయాలలో మంచీచెడులను గురించి చర్చిస్తుంది. పసివారు పుట్టినప్పటి నుంచి వారి ఎదుగుదలలో చూపించే మార్పులను గురించి కూడా శుభాశుభాలను వివరిస్తుంది. అలాగే శిశువులకు దంతాలు వచ్చే సమయం గురించి కూడా వివరణాత్మక సమాచారం శాస్త్రలలో ఉంది. అవేమిటో తెలుసుకుందాం. పిల్లల ఎదుగుదలలో దంతాలు రావడం ఒక ప్రత్యేకమైంది, ముఖ్యమైంది కూడా. 5 నుంచి 8 నెలల వయసులో దంతాలు పిల్లల్లో బయటికి కనిపించడం మొదలవుతుంది. చాలా అరుదుగా 2, 3...


Gulab jamun with Rava: ఉప్మా రవ్వతో ఇలా గులాబ్ జామ్ చేసేయండి, మృదువుగా టేస్టీగా వస్తాయి

Gulab jamun with Rava: బయట దొరికే గులాబ్ జామ్ మిక్స్‌ల్లో మైదానే ఎక్కువగా ఉంటుంది. మైదా ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఉప్మా రవ్వతో గులాబ్ జామున్ చేయడం తెలుసుకోండి. రెసిపీ ఇదిగో.


ఈ కారణాలతో మాత్రం పిల్లలను కనకండి..!

మీరు కోరుకున్నప్పుడు కాకుండా.. ఇతరుల కోసం పిల్లలను కనడం మంచిది కాదు. వాళ్లు పెంచుతారని కాదు.. మీకు కావాలి అనిపించినప్పుడు పిల్లలను కనడమే మంచిది. పెళ్లి తర్వాత దాదాపు చాలా మంది దంపతులు... తల్లిదండ్రులు కావాలని అనుకుంటారు. కొందరు పెళ్లైన వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటారు. కొందరు.. కాస్త గ్యాప్ తీసుకుంటారు. అయితే... పిల్లలను ఎందుకు కనాలని అనుకుంటున్నారనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? చాలా మందికి పిల్లలు ఎందుకు అంటే.. చాలా కారణాలు ఉండి...


Red Lipstick: అక్కడ రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం.. వాడితే జైలుకే.. ఎందుకో తెలుసా..?

ప్రపంచ దేశాల్లో ఎన్నో చిత్ర విచిత్రమైన నియమాలు అమల్లో ఉన్నాయి. కొన్ని నిబంధనల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం. ముఖ్యంగా ఉత్తర కొరియా అమలు చేసే ప్రతి రూల్ చాలా వింతగా అనిపిస్తుంది. ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) ప్రజలపై కొత్త రకం నియమ నిబంధనలు విధిస్తారు. వాటిని పాటించలేక ప్రజలు నరకం అనుభవిస్తుంటారు. వేసుకునే దుస్తుల నుంచి హెయిర్ స్టైల్ వరకు ఈ దేశంలో అనేక కఠినమైన రూల్స్ అమల్లో ఉన్నాయి. ఇప్పటికే నార్త్ కొరియా అనేక పాపులర్...


బలమైన ఎముకల కోసం సింపుల్ చిట్కాలు!

బలమైన ఎముకల కోసం సింపుల్ చిట్కాలు!


Vankaya Pachadi: వంకాయ పచ్చడి రెసిపీ ఇదిగో, ఒక్కసారి తిన్నారంటే మరిచిపోలేరు

Vankaya Pachadi: తెలుగువారికి పచ్చళ్ళపై ప్రీతి ఎక్కువ. ఎప్పుడూ ఒకేలాంటి పచ్చళ్ళు కాకుండా కొత్త కాంబినేషన్లు ప్రయత్నించండి. వంకాయ నువ్వుల పచ్చడి రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


పిల్లలు ధ్యానం ఆచరిస్తే ఇన్ని ఉపయోగాలా..

ప్రతి మనిషి ఏకాగ్రతతో ఉన్నప్పుడే తను చేసే పనిలో కానీ, చదువులో కానీ, మరి ఏదైనా విషయంలో కానీ ఎలాంటి పొరపాట్లు లేకుండా చేస్తాడన్నారు. ఉదాహరణకు సూర్యకిరణాలను భూతద్దం నుంచి ఒక పేపర్ పై ఉంచినప్పుడు ఆ కాగితం కాలిపోతుంది. అదే సూర్యకిరణాల కింద పేపర్ పెడితే ఏ లాంటి శక్తి ఉండదు. మనిషి ఏకాగ్రతతో ఉండాలంటే ధ్యానం చాలా అవసరమని 25 సంవత్సరాలు గా ధ్యాన బోధ చేస్తున్న SN చారి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లో గల రామకృష్ణ విద్యానికేతన్ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో ఐదు నుంచి 10వ తరగతి విద్యార్థులకు ధ్యాన బోధ చేస్తున్నారు. అదే మనిషి కూడా ఏకగ్రతతో మనసును ఒకచోట ఉంచి పనిచేసినప్పుడు అందులో నుంచి ఒక శక్తి ఉత్పన్నమవుతుందన్నారు. అప్పుడు ఆ శక్తి మంచి కార్యాలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించారు. చదువుకునే పిల్లల్లో చాలావరకు బుక్కు ముట్టగానే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది దాన్ని ధ్యానం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. మనసు ఏకగ్రతతో ఉన్నప్పుడు చదివిన ప్రతి అక్షరం మనసులో ముద్రించుకొని ఉంటుంది. ఎప్పుడు అడిగినా ఆ విషయం గురించి తప్పకుండా చెప్పగలుగుతాడు. మనసు ఏకగ్రత లేకుండా చదివినా వాటిని తొందరగా మర్చిపోతారని ఆయన అంటున్నారు. ప్రతి మనిషి జీవితంలో ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది ధ్యానం వల్ల దృఢంగా మారుతాడు మనిషి. ధ్యానం ఓంకారం చేయడం చాలా బాగుంది. ఇంటి వద్ద మొబైల్ చూసే కంటే ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తుంటే చదువుపై ఏకగ్రత పెరుగుతుందని విద్యార్థులు చెబుతున్నారు. మనిషి ఏకాగ్రతతో ఉండాలంటే ధ్యానం చాలా అవసరమని 25 సంవత్సరాలుగా ధ్యాన బోధ చేస్తున్న SN చారి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లో గల రామకృష్ణ విద్యానికేతన్ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో ఐదు నుంచి 10వ తరగతి విద్యార్థులకు ధ్యాన బోధ చేస్తున్నారు. చిన్నారుల్లో ఏకాగ్రత పెరిగి చదువుపై ఫోకస్ చేయాలంటే ధ్యానం చాలా అవసరని గత 25 సంవత్సరాలుగా ధ్యాన బోధ చేస్తున్న SN చారి అంటున్నారు.


ఈ ఆలయం ఎంతో పురాతనమైనది.. స్వామిని దర్శించుకుంటే బాధలు, దుఃఖం నుండి ఉపశమనం లభిస్తుంది..!

ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ నగరంలోని అసురన్ చౌక్‌లో ఉన్న విష్ణు దేవాలయం చాలా ప్రత్యేకమైనది. దీని గురించి ఆలయ పూజారి వికాస్ పాండే మాట్లాడుతూ.. ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. ఈ ఆలయం 1914లో స్థాపించబడింది. ఈ ఆలయంలో నారాయణ్ జీ విగ్రహం ప్రధానంగా ఉంటుంది. బ్రిటీష్ పాలనలో ఆలయం వెనుక తవ్వకాల్లో ఈ విగ్రహం లభించింది. ఆ విగ్రహం నేటికీ ఆలయంలో యథాతథంగా భద్రపరిచారు. ఆలయంలోకి అడుగుపెట్టగానే ద్వారకాధీశుడు దర్శనమిస్తాడు. ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసినప్పుడు, కొంతమంది భక్తులు కొంత సమయం పాటు ఆలయంలోనే కూర్చుంటారు. ఈ ఆలయం మధ్యలో నారాయణుడు కొలువై ఉన్నాడు. ముఖ్యంగా గురువారం ఆలయానికి రద్దీ ఎక్కువగా ఉంటుంది. రహదారి గుండా వెళ్లే ప్రతి వ్యక్తి భగవంతుని దర్శనం పొందేలా ఆలయ నిర్మాణం ఉంది. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న విష్ణు దేవాలయం చాలా ప్రత్యేక ఖ్యాతిని కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు ధామ్‌లను సందర్శించగలిగే మొదటి ఆలయం ఇదే. 1914లో, మజోలియా రాష్ట్ర రాణి ఈ విష్ణు దేవాలయంలో చరోన్ ధామ్‌ను ఏర్పాటు చేసింది. కాబట్టి చార్ ధామ్ సందర్శించలేని వారు ఈ ఆలయానికి వచ్చి చార్ ధామ్ దర్శనం చేసుకోవచ్చు. గుడి లోపలికి వెళ్లగానే రామేశ్వరం కనిపిస్తుంది. ఈ ఆలయంలో వచ్చి పూజలు చేస్తునప్పుడు తాగడానికి నీరు అందిస్తారు. అనంతరం నొప్పి, బాధలు తొలగిపోడానికి పూజారులు పూజలు చేస్తారని.. ఎంతో మంది బాధలు తొలగిపోయాయని తెలిపారు. ఈ ఆలయానికి గురువారం ఎక్కువ మంది వచ్చి దర్శించుకుంటారని తెలిపారు. గోరఖ్‌పూర్ నగరంలో ఇంత ప్రత్యేకమైన ఆలయం... నగరంలోని మెడికల్ కాలేజీ రోడ్‌లో అసురన్ ఎదురుగా ఉన్న విష్ణు దేవాలయం'లో భక్తులు చార్ ధామ్ దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం రోడ్డు పక్కనే ఉంది. ఆలయ చరిత్ర కూడా ఏళ్ల నాటిది.. ఇక్కడ నిత్యం ఆచార వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి.


Nourish Your Skin Naturally: ఈ కూరగాయలు తింటే చాలు మీ ముఖంపై సహజంగానే మెరుపువస్తుంది..

Nourish Your Skin Naturally: మన స్కిన్ ఆరోగ్యవంతంగా మెరుస్తూ కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఎన్నో బ్యూటీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తాం. అయితే, మనం తినే ఆహారంతో కూడా అందం రెట్టింపు అవుతుంది.


Groom:పెళ్లి కూతురుని చూసి ముచ్చటపడ్డ వరుడు.. చివరికి డాక్టర్ చెప్పింది విని షాక్

గతంలో ఆడ-మగ మధ్యే పెళ్లిళ్లు జరిగేవి. కాని ఈ జనరేషన్ లో మగ-ఆడతో పాటు ఆడ-ఆడ, మగ-మగ మధ్య వివాహాలు జరుగుతున్నాయి. దీనికి కొంతమంది లింగమార్పిడి తర్వాత పెళ్లి చేసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇలాంటివి ఏకంగా కుటుంబ సభ్యుల సమక్షంలో బహిరంగంగానే ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయి. (File Photo) పెళ్లి అనేది రెండు మనసుల కలయిక. పెళ్లి చేసుకునే జంటల మధ్య రహస్యాలు ఉండకూడదని అంటారు. అయినా కూడా కొంతమంది పెళ్లికి ముందు కొన్ని సీక్రెట్స్ దాచి పెడుతుంటారు. అయితే పెళ్లి తర్వాత అన్ని రహస్యాలు జీవిత భాగస్వామితో పంచుకోవాలి. (File Photo) 27 ఏళ్ల యువతితో యువకుడి వివాహం నిశ్చయమైంది. ఈ ఘటన చైనాలోని హుంబై ప్రావిన్స్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. యువతి లి యువాన్ (పేరు మార్చాం) 27 ఏళ్ల నుంచి మహిళగా జీవించింది. అయితే పెళ్లి సమయంలో వైద్యపరీక్షలు చేయించుకోవడంతో యువతి షాక్ కు గురైంది. పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరుడు కూడా షాక్ అయ్యాడు. (File Photo) లి యువాన్ ఆమె కాదని వైద్య పరీక్షల్లో తేలింది. లీ యువాన్‌లో వృషణాలు కనుగొనబడ్డాయి. వృషణాలు మగ హార్మోన్లు, స్పెర్మ్‌లను ఉత్పత్తి చేస్తాయి. వృషణాలు కనిపించడంతో వివాహం క్యాన్సిల్ చేసుకున్నారు. (File Photo) ఆడపిల్లగా పెరిగిన లీ యువాన్‌కు 18 ఏళ్లు వచ్చే వరకు రుతుక్రమం కాలేదు. రొమ్ముల పరిమాణం పెరగలేదు. ఆసుపత్రికి వెళ్లినప్పటికి ఆమె అసాధారణ హార్మోన్ స్థాయిలు, అండాశయ వైఫల్యంతో బాధపడుతున్నట్లు డాక్టర్ ఆమెకు చెప్పారని మరియు తదుపరి చికిత్సను సూచించినట్లుగా తెలిపింది. (File Photo) లీ తల్లిదండ్రులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ విధంగా లి యువాన్ 27 సంవత్సరాల వయస్సు వరకు స్త్రీగా పెరిగింది. వివాహానికి ముందు గైనకాలజిస్ట్ డువాన్.జి.ఎల్. చెక్ చేయడంతో ఆమె అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసింది. (File Photo) యువాన్ లీ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల తర్వాత నివేదిక కోసం మేము ఒక నెల వేచి ఉన్నాము. లీలో మగ సెక్స్ క్రోమోజోములు కనుగొనబడ్డాయి. గైనకాలజిస్ట్ డువాన్ మాట్లాడుతూ.. లీ స్త్రీలా కనిపిస్తోందని, అయితే ఆమె పురుషుడేనని చెప్పారు. 27 ఏళ్ల నుంచి మహిళగా పెరిగిన లీ.. ఆ నివేదికను చూడగానే ఆందోళన చెందింది. ఆ తర్వాత నిజాన్ని అంగీకరించాడని డాక్టర్‌ చెప్పారు. ప్రతి 50,000 మంది నవజాత శిశువులలో ఒకరు CAHతో బాధపడుతున్నారు. లీ తల్లిదండ్రులిద్దరికీ జన్యుపరమైన సమస్యలు ఉన్నాయి. లీకి కూడా అదే వ్యాధి ఉండే అవకాశం ఉంది. బోలు ఎముకల వ్యాధితో పాటు విటమిన్ డి లోపం నుండి పొత్తికడుపులోని వృషణాలను తొలగించాలని నిపుణులు సూచించారు. ఇది క్యాన్సర్‌గా మారుతుందేమోనన్న భయాన్ని డాక్టర్‌ వ్యక్తం చేశారు. డాక్టర్ సలహా మేరకు ఏప్రిల్ 11న లీకి శస్త్రచికిత్స ద్వారా రెండు వృషణాలను తొలగించారు.


శనివారం రోజున ఏం చేస్తే.. మీ అప్పులు తీరతాయో తెలుసా?

సాధారణంగా ప్రజలు శనివారం శనిదేవుడిని ప్రార్థిస్తారు. ఈ శనివారం రోజున ఆయనను పూజించడం వల్ల ఏవైనా దోషాలు ఉన్నా పోతాయి అని నమ్ముతారు. అదే శని దేవుడు ఆవనూనె తో పూజిస్తే... మీ జీవితమే మారిపోతుంది. చాలా మంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక అవసరానికి అప్పులు చేస్తూ ఉంటారు. కానీ.. అందరికీ చేసిన అప్పులు తీరవు. ఆ అప్పు తీరక..దానిపై వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. ఇక చేసిన అప్పులు తీరక ఆస్తులు అమ్ముకున్నవాళ్లు... జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నవారు చాలా మందే ఉన్నారు....


అమ్మాయిలు ఏ వృత్తిలో ఉండే వారిని భర్తగా కోరుకుంటారు..? నిజం తెలిస్తే షాక్ అవుతారు

వివాహమంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదని అంటారు. ఇది రెండు కుటుంబాల కలయిక. రెండు మనసుల కలయిక. ఇద్దరు వ్యక్తుల జీవితాల్ని ఒకటి చేసేదే పెళ్లి. పెళ్లి విషయంలో చాలా మందికి అనేక ఆశలతో కలలు కంటుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కోటి మాటలు లేకపోతే పెళ్లి లేదంటారు. అందుకే పెళ్లికి ముందు చాలా ఆలోచించాలి. అబ్బాయి ఎవరూ.. అతనేం చేస్తుంటాడు.. గుణగణాలు, ఇష్టాల వంటి అనేక విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. చాలా మంది తమకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం, ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం అని చెబుతుంటారు. చాలా మంది ఇష్టపడి వివాహం చేసుకున్నామని చెబుతుంటారు. అయితే పెళ్లి విషయంలో మీకు ఏ జాబ్ లేదా వృత్తి చేసే వాళ్లు అంటే అమ్మాయిలకు ఇష్టం అని అడిగితే ఫలానా వృత్తిలో ఉండే అబ్బాయి అయితే మాకు అనుకూలంగా ఉంటాడని చెబుతారు. ఆ ప్రొఫెషన్ ఏంటో తెలుసుకోండి. ఉదాహరణకు ఎవరైనా అమ్మాయి డాక్టర్ అయితే.. తనకు కాబోయే భర్త కూడా డాక్టర్ అయితే బాగుంటుందని కోరుకుంటారు. అదే పోలీస్ అయితే తనకు కాబోయే జీవిత భాగస్వామి పోలీస్ అయితే బాగుంటుందని కోరుకుంటారు. ఎందుకంటే ఇద్దరి వృత్తులూ బిజీ ఫలితంగా ఒకరికొకరు సమయం ఇవ్వడంలో ఇబ్బంది ఉండదు. ఎవరైనా కుటుంబాన్ని కలిగి ఉండాలనుకుంటే అతను తక్కువ బిజీగా ఉన్న వ్యక్తి కోసం చూస్తారు. తద్వారా అతను రోజంతా ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. జర్నలిజంతో అనుబంధం ఉన్నవారు కూడా అదే దే వృత్తి కోసం చూస్తారు. మళ్ళీ అన్ని వృత్తులలో ఎవరైనా పనిలో ప్రేమలో పడినట్లు జరగవచ్చు అక్కడి నుంచి కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. విషయమేమిటంటే ఓ అమ్మాయి పెళ్లి చేసుకునేందుకు సిద్దమైంతే ఆమె పుస్తకాల పురుగు అయితే మరో పుస్తకాల పురుగును వెదుక్కున్నట్లుగానే సినిమా ప్రేమికుడు కూడా అంతర్ముఖుడు ఎప్పుడూ బహిర్ముఖిని కోరుకోడు.


Panchangam Today: ఏ మంచి పని మొదలు పెట్టకండి

Panchangam Today:నేడు 2024 ఆదివారం, మే 11, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం. ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి శుక్ల పంచమి రాత్రి :2గంటల 06నిమిషాల వరకు తదుపరి: షష్టి.వారం: భానువాసరె నక్షత్రం: ఆర్ధ్ర ఉదయం:10గంటల 29 నిమిషాల వరకు తదుపరి:పునర్వసు.యోగం: దృతి ఉదయం:08గంటల 34నిమిషాల వరకు కలదు. తదుపరి: శూలకరణం: బవ మధ్యాహ్నం:02గంటల 06నిమిషాల వరకు తదుపరి బాలవ రాత్రి:2గంటల 06నిమిషాల వరకు తదుపరి: కౌలవ అమృతకాలం ఈరోజు అమృత ఘడియలు లేవు. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు.కాబట్టి ఈరోజు ఏ మంచి మొదలుపెట్టడానికి కుదరదు. దుర్ముహూర్తం సాయంత్రం:04గంటల 54నిమిషాల నుండి 05గంటల 45నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 04గంటల 30నిమిషాల నుండి 6గంటల వరకు కలదు. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం మధ్యాహ్నం:12గంటల నుండి ఒంటి గంట 30నిమిషాల వరకు కలదు. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి:10గంటల 58నిమిషాల నుండి 12గంటల 38నిమిషాల వరకు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


'D'తో ప్రారంభమయ్యే పిల్లల పేర్లు ఇవిగో!

మీ పిల్లలకు D అక్షరంతో పేరు పెట్టాలని చూస్తున్నారా. అయితే ఈ పేర్లను ఓసారి గమనించండి.


అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి.. ఆరోజు ఏమేమి జరిగాయో తెలుసా

అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి.. ఆరోజు ఏమేమి జరిగాయో తెలుసా Akshaya Tritiya 2024 Date: ఈ ఏడాది  (2024) అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఈ రోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీపూజ చేస్తే కలిసొస్తుందని అంతా అనుకుంటారు.. అసలు అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటాము.. పురాణాల ప్రకారం ఆరోజుకున్న చరిత్ర.. విశిష్టత గురించి గురించి తెలుసుకుందాం. . . ప్రతి సంవత్సరం  వ...


Weekly Horoscope : వీరికి మనసులోని కోరికలు నెరవేరుతాయి

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు మే 12 ఆదివారం నుండి మే18 శనివారం వరకు మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకోవడం మీద దృష్టికేంద్రీకరిస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి కార్యకలాపాలుపెరిగిపోతాయి. ఉద్యోగంలో కాస్తంత పని భారం ఉంటుంది. అధికారులను మీపనితీరుతో ఆకట్టుకుంటారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా కొన సాగుతుంది.బంధువుల వల్ల మాట పడాల్సి వస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, విలాసాల మీద ఖర్చులు పెరిగే అవకాశంఉంది. ఆరోగ్యం నిల కడగా సాగుతుంది. బంధుమిత్రుల వ్యక్తిగత వ్యవహారాల్లోతలదూర్చకపోవడం మంచిది. నిరు ద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. దూరప్రాంతంలో మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాలుపరవాలేదనిపిస్తాయి. ఆర్థిక వ్యవహా రాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికలావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందిముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్ర త్తగా ఉండాలి.ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారంలో తొందరపాటు నిర్ణ యాలుతీసుకోవద్దు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచిశుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలులభిస్తాయి. ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగాసాగిపోతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలుఅనుకూలంగా మార తాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగులకుసమయం చాలా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారు బాగాబిజీ అయిపోతారు. వ్యాపారాలు నల్లేరు మీది బండిలా సాగిపోతాయి. సొంతనిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ధనపరంగా కొద్దిగా మోసపోయేసూచనలున్నాయి. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే పెండింగు పనులు, వ్యవహారాలుసకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి.బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాలో వీలైనంతగాజాగ్రత్తగా ఉండడం మంచిది.. కర్కాటకం (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)వారమంతా అనుకూలంగా సాగిపోతుంది. చిన్నా చితకా సమస్యలున్నా అధిగమిస్తారు.ఉద్యో గంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లోనష్టాల నుంచి బయట పడతారు. ముఖ్యమైన కార్యకలాపాలన్నీ నిదానంగాపూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో శుభ వార్త వింటారు. కుటుంబ వ్యవహారాలకుసంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మంచి వ్యక్తులతో పరిచయాలుఏర్పడతాయి. కుటుంబపరంగా ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది.ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్లలకు సంబంధించి మంచి పరిణామాలు చోటుచేసు కుంటాయి. ప్రస్తుతానికి పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేసుకోవడంమంచిది. ప్రయా ణాలు లాభి స్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.మిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందు తుంది. సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో స్థిరత్వంలభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు.ఆస్తి సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. దైవ కార్యాల్లోపాల్గొంటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకున్నపనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. స్తోమతకు మించి మిత్రులకు ఆర్థికసహాయం చేస్తారు. అనారోగ్యం సమస్యలు, ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి.కుటుంబ వ్యవహారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికివృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు వస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అవు తాయి. వ్యక్తిగత వ్యవహారాలలోకార్యసిద్ధి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కన్య (Virgo):(ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)చిన్నా చితకా సమస్యలుండవచ్చు. స్వల్ప అనారోగ్యం కూడా ఉండే అవకాశముంది.అయితే, ఇతర పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎంత సానుకూల దృక్పథంతోవ్యవహరిస్తే అంత మంచిది. కొన్ని ప్రయత్నాలు ఆలస్యం అయ్యే అవకాశముంది.ఆర్థిక ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలోసంపాదన పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు గడి స్తారు. దైవ కార్యాల్లోపాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవ హారాలునిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగంలభిస్తుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది.తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలులాభిస్తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. కొద్దిపాటి ఆస్తి కలిసి వచ్చేఅవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులకుఅనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటి వ్యవహారం ఒకటి సానుకూలంగా పరిష్కారంఅవుతుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం విషయంలో శుభ వార్తలుఅందుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచ యాలుపెరుగుతాయి. కొన్ని వ్యవహారాలు ఆశాజనకంగా పూర్తవుతాయి. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.ప్రయాణా ల్లోనూ, ఆరోగ్యం విషయంలోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.ఆదాయానికి లోటుండదు.. వృశ్చికం(Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)కుటుంబ పరిస్థితులు బాగా సానుకూలంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యతపెరుగు తుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ధనపరంగాఆశించిన పురోగతి ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులకు కళ్లెం వేయగలుగుతారు.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకమైన వాతా బవరణం ఉంటుంది. ఉద్యోగంలో సహచరులనుంచి సమస్యలు ఎదురవుతాయి. అయితే, అధికారుల మద్దతు ఉంటుంది. అనుకోనిప్రయాణాలకు అవకాశం ఉంది. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆస్తివిషయంలో కొద్దిగా మోసపోయే సూచనలున్నాయి. రాదనుకున్న డబ్బు చేతికిఅందుతుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. ధనుస్సు(Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగ్గప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. దైవ కార్యాలలోపాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి నిపుణు లకు ఆదరణపెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచికూడా చాలా వరకు బయటపడతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొత్తప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యో గులకుఉద్యోగపరంగా ముఖ్యమైన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశంఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలువెల్లి విరుస్తాయి. మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి, పనిభారం తగ్గి సామరస్య వాతావరణంనెలకొంటుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. మిత్రులతో అకారణ వివాదాలుతలెత్తే సూచనలున్నాయి. నిరుద్యోగులు శుభ వార్త వింటారు. వివాహ ప్రయత్నాలుఅనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి.మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాల్లో కుటుంబసభ్యుల సహాయం అందుతుంది. కొందరు బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది.ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండడం గానీ, వాగ్దానాలు చేయడం కానీచేయకపోవడం శ్రేయస్కరం. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడంఅవసరం. ఒక ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారం ఒకటి అనుకోకుండా అనుకూలంఅవుతుంది. ఆదాయం బాగా పెరుగు తుంది. కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆదాయం, ఆరోగ్యం సంతృప్తికరంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుపూర్తవు తాయి. వారమంతా ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోతుంది. ఉద్యోగజీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి జీవితాలవారికిడిమాండ్ పెరుగుతుంది. బంధువుల రాకపోకలుంటాయి. చిన్ననాటి మిత్రులతో విందుకార్యక్రమంలో పాల్గొంటారు. విహార యాత్రకు వెళ్లే సూచనలు న్నాయి. దూరప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది.ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వాహన ప్రమాదాల విషయంలోకూడా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.. మీనం(Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు, చికాకులు తగ్గిపోయి మనశ్శాంతి ఏర్పడుతుంది.కార్యసిద్ధికి, వ్యవహార జయానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలుఅందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతోపరిచయాలు ఏర్పడతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకుసమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువుల్లో కొందరుఅపనిందలు వేయడం గానీ, దుష్ప్రచారం చేయడం గానీ జరు గుతుంది. మితిమీరినఔదార్యంతో మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకుపరవాలేదనిపిస్తుంది. వృథా ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. తండ్రి వైపుబంధు వుల నుంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించినఫలితాలను పొందుతారు. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


ఈ పుదీనా ఫేస్‌ప్యాక్స్‌తో మొటిమలు, మచ్చలు దూరమై ముఖం మెరుస్తుంది..

ఎండలు పెరిగిపోయాయి. దీంతో ముఖం వాడిపోయినట్లుగా కనిపిస్తుంది. అలా కాకుండా చర్మం మెరవాలంటే పుదీనాతో ఇలా ఫేస్ ప్యాక్ వేయండి..


పళ్లు తోమేటప్పుడు వాంతులు ఎందుకు అవుతాయి?

మనం ప్రతిరోజూ పళ్లను తోముతాం. అయితే కొంతమందికి మాత్రం పళ్లు తోమేటప్పుడు వాంతులు అవుతుంటాయి. దీనికి కారణమేంటో తెలుసా? మన దినచర్యలో పళ్లను తోముకోవడం ఒక భాగం. పళ్లను తోముకోవడం వల్ల నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా అంతా బయటకు పోతుంది. దంతాలు, నోరు క్లీన్ అవుతాయి. అయితే కొంతమందికి ప్రతిరోజూ ఉదయం పళ్లు తోముతున్నప్పుడు వికారంగా అనిపించడం, వాంతులు అవడం వంటి సమస్యలు వస్తుంటాయి. అసలు ఇలా ఎందుకు అవుతుందో ఇప్పుడు చూసేద్దాం పదండి. పిత్తం సమస్య పళ్లో తోమేటప్పుడు...


జీన్స్ కు అంటిని మొండి మరకలను ఎలా పోగొట్టాలి?

అబ్బాయిలు, అమ్మాయిలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జీన్స్ ప్యాంట్ లను ఉపయోగిస్తున్నారు. కానీ జీన్స్ ప్యాంట్ లను మెయింటైన్ చేయడం కాస్త కష్టమైన పనే. ఎందుకంటే వీటికి ఏవైనా మరకలు అంటినప్పుడు అంత సులువుగా పోవు. కానీ కొన్ని చిట్కాలతో జీన్స్ ప్యాంట్ కు అంటుకున్న మరకలను చాలా ఈజీగా పోగొట్టొచ్చు. ఎలాగంటే? జీన్స్ వేసుకోవాలనే క్రేజ్ ఈ రోజుల్లో ప్రతి మహిళలో ఉంది. స్కూల్ నుంచి కాలేజీకి అమ్మాయిలు, ఆఫీసుకు వెళ్లి పనులు చేసే అన్ని వయసుల మహిళలు కూడా జీన్స్ ను...