టమాటా నార్లు ఎండిపోతున్నాయా.. అయితే టిప్స్ పాటించండి..

వ్యవసాయం చేసే ప్రతి రైతన్న పంటలు చేసి, మంచి లాభాలు అర్జించాలని తపన పడుతుంటారు. అదే విధంగా పోటీ పడి మరీ పంటలు సాగు చేస్తుంటారు. సీజన్లో పంటలు వేసి మంచి లాభాలు పొందాలని కొన్ని నెలలు మునుపే భూమిని గుల్ల చేసి సారం చేస్తారు. ప్రత్యేకించి ధీమాగా ఆ నెలలో సాగు చేస్తే కచ్చితంగా మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతాయని సాగు చేస్తారు. ఇలా ధీమాతో చేసే పంట టమోటా. ఇదే క్రమంలోనే చిత్తూరు జిల్లాలో కొన్ని వేల ఎకరాలు టమోటా సాగు చేశారు.. ఈ టమోటా సాగు కూడా విడతల రూపంలో సాగు చేస్తున్నారు.

కొంత మంది రైతన్నలు డిసెంబర్ నెల నుండి ఏప్రిల్ వరకు విడతలగా టమోటా సాగు చేస్తున్నారు. కానీ చెప్పుకోలేని కష్టం ఒక్కసారిగా ఎదురుపడ్డది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక గత నెల రోజులుగా నాటుతున్న టమోటా నార్లు ఎండిపోతున్నాయి. ఎందుకు ఇలా ఎండిపోతున్నాయి రైతన్నకు దిక్కుతోచక నర్సరీ యజమానులపై చిరాకు పడుతున్నారు. నర్సరీ యజమాని నార్లను చాలా చక్కగా ఇచ్చాను మీ భూమిలో ఏదైనా సమస్య ఉన్నదేమో అని సర్ది చెప్పే పరిస్థితులు దాపురించాయి.

ఈ మాస్టార్ మల్టీ టాలెంట్ కి ఫిదా అవ్వాల్సిందే.. ఇదే అతడి ప్రతిభ..

తల ప్రాణం తోకకు వచ్చినట్టు ఉన్నదని నర్సరీ యజమానులు చెబుతున్నారు. ఈ అంతు చిక్కని సమస్య ఆ నోటా ఈ నోటా పడి ఉద్యాన శాఖకి పాకింది. దీనికి చక్కటి సలహా ఇచ్చారు.. బైరెడ్డిపల్లి మండలం,చప్పిడిపల్లి పంచాయతీలోని రైతు భరోసా కేంద్రంలో ఉద్యాన శాఖ సహయకుడిగా పని చేస్తున్నరాజు. రైతన్నల సమస్యలను చక్కగా వివరించారు.. ఈ సందర్భంగా రాజు లోకల్18 తో మాట్లాడుతూ.. ఏ పంట సాగు చేయాలన్నా యాజమాన్య పద్ధతులు మనకు తొలి మెట్టు. సీజన్ వస్తే చాలు ఒకరి మీద ఒకరు పడి టమోటా నార్లు తీసుకొచ్చి మరీ నాటేస్తున్నారన్నారు.

నర్సరీలో అనేక రకాల నార్లు వచ్చేసాయ్, ధరలు చూస్తే ఎన్నడూ లేని ధరలు చెబుతున్నారు. పలు రకాల కంపెనీకి చెందినవి, ఇవి దిగుబడి ఎక్కువ అని నర్సరీ యజమాని చెప్పిన వెంటనే డబ్బులు వెచ్చించి నర్సరీ నుండి నార్లను తీసుకెళ్లి నాటేస్తున్నారన్నారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాలని తెలిపారు. ప్రతి రైతన్న మీరు నాటే ముందు నార్లు 30 రోజులు గడువు పూర్తి అయిందా చూడాలి, సీజన్ పోతుందని ఒకరి మీద ఒకరు దూకేయకూడదన్నారు.

Admissions: గిరిజన గురుకుల పాఠశాలలో.. 3 వ తరగతికి అడ్మిషన్లు ప్రారంభం..

తీసుకెళ్లి నారును రెండు రోజులు బాహ్య వాతావరణంలో పెట్టాలన్నారు. అప్పుడు ఆ నాట్లు బాహ్య వాతావరణానికి బాగా అలవాటు పడతాయి. నాట్లు నాటుతాము అనుకొన్న మునుపు రోజు డ్రిప్ ద్వారా నీటిని భూమికి అందించాలి. అలా అందివ్వడం వల్ల భూమిలో ఉన్న ఉష్ణోగ్రతలు తగ్గి చల్లదనం ఇస్తుందన్నారు. తరువాత నార్లను నాటినాము అంటే త్వరగా వేర్లు భూమిలోకి పాతుకొని నీటిని పీల్చుకొని మొక్క ఎండి పోకుండా చక్కగా పెరుగుతుందన్నారు.

ఇలా చేసిన తరువాత రోజుకు రెండు సార్లు నీరందిస్తే పంట చాలా చక్కగా ఏపుగా వస్తుందన్నారు. నార్లు ఎక్కడ ఎండిపోకుండా ఉంటాయన్నారు. రైతన్నలు వేల సంఖ్యలో డబ్బులు వెచ్చించి, నార్లను కొనుగోలు చేసి, వాటిని ఈ ఎండల తీవ్రతకు తట్టుకోలేక ఎండిపోతున్నాయన్నారు. వీటిని అధికమించాలి అంటే తగు జాగ్రత్తలు తప్పనిసరి. ఈ విషయంపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారా... అయితే పైన తెలిపిన 4 టిప్స్ పాటించండి చాలు పంట చక్కగా వస్తుందని చెప్పారు.

2024-05-02T13:15:46Z dg43tfdfdgfd