టీలో కాస్తా ఉప్పు వేసి చేస్తే ఈ లాభాలన్నీ అందుతాయి..

టీ చేసేటప్పుడు సాధారణంగా అందరూ పంచదార కలుపుతారు. కానీ, ఉప్పు వేయడం వల్ల చాలా లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

చాలా మంది ఉదయాన్నే బెడ్ కాఫీ లేదా టీ తాగడం అలవాటు. కొంతమందికి ఇది లేనిదే పొద్దు గడవదు. ఇది అందరి ఇళ్ళలో సర్వసాధారణం. చాలా మంది టీ, కాఫీలు అంటే అంతగా ఇష్టపడతారు. టీ..

మన ఇంటికి ఎవరైనా వచ్చినా, మనం ఎవరింటికి వెళ్ళినా చాలా మంది చేసే మొదటి పని.. టీ లేదా కాఫీని ఇవ్వడం. దీనిని టీ చేయడానికి చాలా మంది టీ పొడి, షుగర్ వేస్తారు. కానీ, టీ చేసేటప్పడు చిటికెడు ఉప్పు కూడా వేయడం నేడు వైరల్‌గా మారింది. ఇది టీ రుచిని అమాంతం పెంచుతుంది. దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

టీ తాగడానికి బెస్ట్ టైమ్..​ ​

ఉప్పులోని పోషకాలు..

చిటికెడు ఉప్పులో మనకి ఎన్నో పోషకాలు అందుతాయి. ఇందులో మెగ్నీషియం, సోడియం, కాల్షియం, పొటాషియం అందుతాయి. ఇవి మన మొత్త బాడీకి పోషకాలని బ్యాలెన్స్ చేస్తాయి.

మైగ్రేన్..

టీలో ఉప్పు కలిపి తాగితే మైగ్రేన్ తలనొప్పి, దానికి సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. ఇది మన బ్రెయిన్ హెల్త్‌ని కాపాడడమే కాకుండా మన బాడీలోని అవయవాల పనితీరుని మెరుగ్గా చేస్తుంది. ​Also Read : Avocado : అవకాడో తింటే ఈ సమస్యలన్నీ దూరం..

చర్మానికి మేలు..

మీరు టీని తయారుచేసేటప్పుడు చిటికెడు ఉప్పు కలిపితే మన బాడీలో జింక్ పరిమాణం పెరుగుతుంది. ఇది చర్మాన్ని పునరుద్ధరించడమే కాకుండా స్కిన్‌టోన్‌ని మెరుగ్గా చేస్తుంది. దీని వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి. చర్మ మెరుపుని కాపాడుతుంది.

నీటి కంటెంట్..

ఎండాకాలంలో మనకి విపరీతమైన చెమటలు పడుతాయి. దీని వల్ల మన బాడీలోని ఎలక్ట్రోలైట్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఓ గ్లాసు టీలో కాస్తా ఉప్పు, పంచదార కలిపి తాగితే కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి అందుకోవచ్చు. మన బాడీలోని నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.

జీర్ణశక్తి..

చాలా మంది ప్రజలు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అజీర్ణం, తిన్న ఆహారం జీర్ణమవ్వకపోవడం వల్ల ఆకలి అనిపించదు. మన జీర్ణవ్యవస్థలో ఉప్పు కీ రోల్ పోషిస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణమవ్వడానికి అవసరమైన జీర్ణరసాలను ఉత్పత్తి చేయడంలో ఉప్పు హెల్ప్ చేస్తుంది.

ఇమ్యూనిటీ..

సీజనల్ సమస్యలని దూరం చేయడంలో ఉప్పు ముందుంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయి. దీని వల్ల ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. మనం తయారుచేసుకునే టీలో కాస్తా ఉప్పు వేసి తాగితే చాలా ఇన్ఫెక్షన్స్ నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ​Also Read : ఆడవారు గసగసాలు తింటే ఈ ప్రయోజనాలన్నీ పక్కా..

రుచి పెరగడం..

మీరు తయారు చేసిన టీలో ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది. ఉప్పులోని గుణాలు చేదుని బ్యాలెన్స్ చేస్తాయి. కేవలం టీ మాత్రమే కాదు, సాధారణ టీలో కూడా ఉప్పుని వాడితే టీ రుచి పెరుగుతుంది. ఇలా చేస్తే టీ రుచి ఎక్కువ అవుతుంది. కాబట్టి, ఈ టీని ఎక్కువగా ఆస్వాదించొచ్చు. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Health News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-17T06:57:14Z dg43tfdfdgfd