తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తాటి ముంజలు తాటిచెట్ల కాయల నుంచి లభిస్తాయి. ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని 'ఐస్ యాపిల్' అని కూడా అంటారు. తాటి ముంజలు మన భారత దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లభిస్తాయి. ముఖ్యంగా మన దక్షణ భారత దేశంలో విరివిగా దొరుకుతాయి. చలికాలంలో పూతగా మొదలై వేసవి ప్రారంభంలో తాటి ముంజలు ఏర్పడుతాయి.సమ్మర్ వచ్చేసింది.

తిరుమల శ్రీవారి దగ్గర భారీగా బంగారం నిల్వలు... ఎన్ని వేల కిలోలో తెలుసా?

వేడి దాటిని తట్టుకునేందుకు ఎన్నో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సీజన్‌లో పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. పండ్లలో కూడా ముఖ్యంగా పుచ్చకాయ, ఖర్బూజ వంటివి ఎక్కువ నీటి శాతంతో పాటు ప్రొటీన్లను కలిగి ఉంటాయి. అయితే వీటన్నింటికి కంటే మానవ శరీరానికి ఎక్కువ మేలు చేసేవి తాటి ముంజలు. కేవలం వేసవిలో మాత్రమే ఇవి విరివిగా లభిస్తాయి.

Tirumala Darshanam: తిరుమల శ్రీవారి దర్శనానికి లక్కీ డిప్ డేట్స్ వచ్చేశాయి... ఈ తేదీలు గుర్తుంచుకోండి

అధిక నీటి ఉండం కారణంగా తాటి ముంజలు శరీరాన్ని చల్లపరిచే గుణం ఉంటుంది. ఐస్ యాపిల్స్‌లో ఎ, బి, మరియు సి వంటి విటమిన్లు మరియు జింక్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయివేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లబరిచేది తాటి ముంజలు. ఇన్ని ఉపయోగాలున్న ఈ తాటి ముంజలను శ్రీకాకుళంలో ప్రతి సెంటర్ వద్ద జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. డజన్ రూ.100 పైనే అమ్ముతున్నారు. తమకు అన్ని ఖర్చులు పోను రోజుకు రూ.1000 వరకు ఆదాయం ఉంటుందని చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఐస్ యాపిల్ ని తినండి... చల్లగా ఉండండి.

2024-04-17T10:19:13Z dg43tfdfdgfd