తెల్లని దుస్తులకు అంటిని మరకలను ఎలా పోగొట్టాలి?

వైట్ కలర్ దుస్తులను చాలా మంది ఇష్టపడతారు. కానీ వీటిని మెయింటైన్ చేయడం కాస్త కష్టమే. ఎందుకంటే ఈ డ్రెస్సులకు ఏ మరకలు అంటినా అస్సలు పోనే పోవు. అలాగే వీటిని ఉతికినా అంత తెల్లగా కనిపించవు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో మీ వైట్ కలర్ డ్రెస్సులను తిరిగి కొత్తగా చేయొచ్చు. అదెలాగంటే? 

 

వైట్ డ్రెస్ ఎవ్వరికైనా బాగుంటుంది. అందుకే ప్రతి ఒక్కరికీ వైట్ కలర్ డ్రెస్సులు ఖచ్చితంగా ఉంటాయి. కానీ వైట్ కలర్ డ్రెస్సులను వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ దుస్తులకు ఏ చిన్న మరక అంటినా అది అలాగే ఉంటుంది. వీటిని శుభ్రం చేయడం చాలా కష్టమైన పని అని చాలా మంది అనుకుంటారు. అంతేకాకుండా వైట్ కలర్ డ్రెస్సులు చాలా తొందరగా మాసిపోతాయి. మురికిగా అవుతాయి. అంతేకాకుండా వీటిని వాష్ ఒకటి రెండు సార్లు వాష్ చేస్తే మసకబారిపోతాయి. దీనికి కారణం లాండ్రీ సరిగ్గా చేయకపోవడమే. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో వైట్ డ్రెస్సులను సంవత్సరాల తరబడి కొత్త వాటిలా మెరిసేలా చేయొచ్చు. దీనికోసం మీరు పెద్దగా డబ్బును ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఏం చేయాలంటే? 

తెల్లని బట్టల మెరుపును కాపాడుకోవడానికి వంటింట్లో ఉండే బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. నిజానికి బేకింగ్ సోడాను వంట కోసం ఉపయోగిస్తారు. అయినప్పటికీ దీనిని మనం దుస్తులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. ముఖ్యంగా ఇది వైట్ డ్రెస్సులను క్లీన్ చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

బేకింగ్ సోడా ప్రత్యేకత..

సోడియం బైకార్బోనేట్ నే మనం బేకింగ్ సోడా అంటాం. దాని ఆమ్లత్వం కారణంగా ఇది సాధారణంగా ఆహారాలను పులియబెట్టడానికి, మృదువుగా చేయడానికి ఉపయోగిస్తారు. అయితే దీనిని మనం దుస్తుల మరకలు,  మచ్చలను పోగొట్టడానికి కూడా ఉపయోగించొచ్చు. 

 

బేకింగ్ సోడాతో బట్టలు ఉతకడం వల్ల కలిగే ప్రయోజనాలు

బేకింగ్ సోడాలో బట్టలు ఉతకడం వల్ల ఎలాంటి వాసన రాదు. ఎందుకంటే ఇది నీటి పిహెచ్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. దీనితో పాటుగా సహజసిద్ధంగా తెల్లని బట్టల బ్లీచింగ్ జరగడం వల్ల బట్టలు తెల్లగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఫ్యాబ్రిక్ పై ఉన్న మరకలను తొలగించి మృదువుగా చేస్తుంది. 

 

బేకింగ్ సోడాను ఎలా వాడాలి? 

బేకింగ్ సోడాను బకెట్ లో లేదా వాషింగ్ మెషీన్ లో ఉతుక్కునే తెల్లని బట్టలతో సులభంగా కలపొచ్చు. ఇందుకోసం మీరు ఒకటి నుంచి అర కప్పు సమాన బేకింగ్ సోడాను సబ్బుతో కలిపి బట్టలను నానబెట్టి క్లీన్ చేయొచ్చు. 

2024-05-01T05:35:48Z dg43tfdfdgfd