దండకారణ్యంలో శక్తివంతమైన ఆలయం.. ఒక్కసారి నిద్రిస్తే మీరు అనుకున్నది జరగాల్సిందే

అది ఒకప్పుడు దండకారణ్యం.. ప్రాచీన కాలం నాటి ఆలయం. ఆ ఆలయంలో ఉన్న స్వామి వారు ఎవరు..!? ఆ ఆలయం విశిష్టతను, స్థల పురాణాన్ని లోకల్18 స్పెషల్ స్టోరీలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి బావుసాయిపేట గ్రామాలకు మధ్యలో రాముల గుట్ట అనే ప్రాంతంలో మామిడిపల్లి గ్రామానికి చెందిన శ్రీ సీతారామస్వామివారి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం మాఘమాస జాతర,రథోత్సవాలు కన్నుల పండువగా,ఘనంగా జరుగుతాయనే విషయం మనందరికీ తెలిసిందే.

ఈ స్థల పురాణం, ఆలయం విశిష్టత గురించి ఆలయ అర్చకులు తిరుణ హరి కృష్ణస్వామిని అడగగా.. అర్చకులు లోకల్18తో మాట్లాడుతూ.. ఈ శ్రీ సీతారాముల స్వామి వారి ఆలయం ప్రాచీన,శాలివాహన కాలం నాటి ఆలయమని అన్నారు. శ్రీ రాజరాజ నరేంద్రుడు పాలించిన సమయంలో మహామునిపల్లెగా పిలవబడిందని చెప్పారు. ఈ కొండ ప్రాంతం, దండకారణ్యం,ఈ దండకారణ్యం ఈ అరణ్యంలోపల శ్రీరాముడు అరణ్యవాసంలో భాగంగా ఈ మహామునిపల్లె ప్రాంతానికి రావడం ఈ మహాముని పల్లెలో గుండు కింద మహాముని తపస్సు చేస్తున్న సమయంలో ఆ ప్రాంతానికి, శ్రీరామచంద్రుడు ఆ మహాముని వద్దకు వచ్చి స్వామివారు సేద తీరాడం జరిగిందని అర్చక స్వాములు చెబుతున్నారు.

రేపటి నుంచి వారి రేషన్ కార్డులు రద్దు? ఈ కొత్త రూల్ తెలుసుకోండి!

కాలక్రమేన మహాముని పల్లె కాస్త.. మామిడిపెళ్లిగా పిలవబడుతుందని అర్చక స్వాములు పేర్కొన్నారు. ఇది ప్రాచీన వైష్ణవ ఆలయం అని ఈ ఆలయంలో వైష్ణవ కుటుంబం తిరుణ హరి కృష్ణ స్వామి,లక్ష్మణ్,శ్రీనివాస్ అనే ముగ్గురు స్వాములు అనునిత్యం స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి 9 రోజులపాటు మామిడిపల్లి శ్రీ సీతారాముల స్వామి వారి ఆలయంలో కన్నుల పండుగగా,శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని,ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించి సేవలు తరిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా.

శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్క రోజుల్లోనే ఎంత తగ్గాయంటే..

పుష్య మాసం వెళ్లి మాఘమాసంలో మాఘమాస పుణ్య స్థానం దర్శనం.. మాఘ మాస జాతర అంగరంగ వైభవంగా ఈ నేపథ్యంలో భక్తజనం అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి సేవలో తరిస్తే ఆయురారోగ్యాలతో పాటు పాడిపంటలు సమృద్ధిగా పండుతాయి అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అయితే కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లతో సుదూర ప్రాంతాల నుంచి రాముల గుట్టకు చేరుకొని అక్కడే చాలామంది భక్తులు వంటావార్పు చేసుకుని నిద్ర చేస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం మామిడిపల్లి సీతారాముల స్వామి వారి ఆలయాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తుంది.

ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం.. శ్రీరామనవమి నేపథ్యంలో మామిడిపల్లి గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా భక్తి భావంతో రాముల వారి మాలధారణ చేసుకొని కంకర్యాలు అత్యంత వైభవంగా వైభవంగా నిర్వహిస్తారని, విశిష్ట వైష్ణవ పాంచరాజ విధానం రూపంలో స్వామివార్లకు పూజా కార్యక్రమాలు చేస్తామని అర్చకులు తిరుణ హరి కృష్ణ స్వామి తెలిపారు.రాముల గుట్ట అనగానే ఈ ప్రాంత ప్రజలకు మామిడిపల్లి శ్రీ సీతారాముల ఆలయం గుర్తుకు వస్తోంది. ఈ ఆలయానికి అతి సమీపంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.పచ్చని ప్రకృతి నడుమ కొండపై బండకింద శ్రీసీతారాముల వారు అంత్యంత శోభాయమానంగా వెలుగొందుంటున్నారు. మూడు రోజులపాటు ప్రతి సంవత్సరం మాఘమాస జాతర(మామిడిపల్లి జాతర)ఘనంగా జరిగిందని భక్తులు,అర్చకులు చెబుతున్నారు.

2024-04-30T03:21:09Z dg43tfdfdgfd