నూనె వాడకుండానే చికెన్ ఫ్రై.. అదిరిపోతుంది టేస్ట్..

Chicken Fry Recipe: చికెన్‌ని ఇష్టపడేవారంతా కూడా ఎక్కువగా ఫ్రై చేసుకుని తింటారు. అయితే, నూనె లేకుండానే చికెన్‌ని ఎలా ఫ్రై చేయాలో తెలుసుకోండి.

Chicken Fry Without Oil: చికెన్ అంటేనే చాలా మందికి ఇష్టం. దీంతో చికెన్ ఫ్రై చేస్తే మరీ ఇష్టం. అయితే, ఫ్రై అంటే ఎక్కువగా ఆయిల్ వేయాలి. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకోసం ఆయిల్ లేకుండా చికెన్‌ని ఎలా ఫ్రై చేయాలో తెలుసుకోండి.చికెన్..

నాన్‌వెజ్ ప్రియులకి చికెన్ అంటే భలే ఇష్టం. దీనిని ఎన్నోరకాలుగా వండుతారు. అయితే, ఫ్రైని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది ఎంతో టేస్టీగా ఉన్నప్పటికీ వాడే నూనె కారణంగా ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే, నూనె లేకుండానే రుచిగా చికెన్‌ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.

మసాలాలు..

చికెన్ ఫ్రై కోసం ముందుగా చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, ఎండు మిర్చి, సోపు, ఉల్లిపాయలు, కొబ్బరి పాలు, పెరుగు అవసరం. చికెన్ ముందుగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

Also Read : Blood Pressure : ఈ 4 జ్యూస్‌లు తాగితే బీపి కంట్రోల్ అవుతుంది..

మ్యారినేట్..

అల్లం వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు, సోంపు, ఎండుమిర్చి అన్నింటిని కలిపి గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్‌లో పెరుగు కలిపి చికెన్‌‌ని మారినేట్ చేయాలి. తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి కనీసం 2 గంటలు ఉంచండి.

Also Read : చాక్లెట్స్‌ని ఇలా స్టోర్ చేస్తే ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంటాయి..

వండడం..

ఇప్పుడు స్టౌపై ప్యాన్ పెట్టి అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు వేసి ఉడికించండి. తర్వాత అందులో చికెన్ వేసి బాగా ఫ్రై చేయండి. కాస్తా ఉడికాక చికెన్‌లోని నీరే మొత్తం ఫ్రైకి సరిపోతుంది. కావాలనుకుంటే కొబ్బరిపాలు వేయండి. చివరగా కరివేపాకు వేస్తే ఫ్రై అదిరిపోతుంది. ​​​Read More : Home remedies News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-02-29T11:50:34Z dg43tfdfdgfd