నాన్న కష్టం చూడలేక కొడుకు ఇంత పని చేశాడా .. మీరే చూడండి..

పంచర్ షాప్ వారి జీవన ఆధారం 30 ఏళ్లుగా దీన్నే ఉపాధిగా మార్చుకుని తన కుటుంబాన్ని పోషిస్తున్న నాగేశ్వర్ కి అనుకోకుండా ఓ రోజు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదం లో కాలికి బలమైన గాయం కావడం తో పని చేసే వీలు లేకుండా పోయింది. కానీ పంచర్ షాప్ తీయనిది.. ఇంట్లో వెసులు బాటు ఉండేది కాదు. దీంతో మెల్లి మెల్లిగా షాప్ తెరిచి పంచర్ వేయడం ప్రారంభించారు. పని చేసే క్రమం లో చిన్న చిన్న పరికరాలు తీసుకోవడానికి కాలి నొప్పితో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనే వారు. దీన్ని చూసిన నాగేశ్వర్ రావ్ కొడుకు భగత్ మనసు చలించింది. నాన్న కష్టానికి సులువైన పని గా మార్చడానికి ఒక పరికరానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. అంతే పనికి రాని వస్తువులను తీసుకుని వీల్ చైర్ ని తయారు చేశాడు. ఈ పరికరం తయారు చేశాక తన పని సులువు గా మారిందని నాగేశ్వర్ తెలిపారు.

పనికి రాని వస్తువులతో ఎన్నో అవిష్కరణలు..

భగత్ పనికి రాని ఇనుము వస్తువులను రీసైక్లింగ్ చేస్తూ ఎన్నో పరికరాలకు శ్రీకారం చుట్టాడు. అలా ఎలక్ట్రిక్ స్కూటీ, రైతులకి ఉపయోగపడే పరికరాలు, ఎయిర్ పిస్టన్, వంటివి వాటికి శ్రీకారం చుట్టి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు . గత కొన్ని రోజుల నుండి మరో ప్రాజెక్టు చేస్తున్న సందర్భం లో నాన్న నాగేశ్వర్ కి ప్రమాదం జరగటం తో రొటేటింగ్ చైర్ ని తయారు చేసినట్టు భగత్ తెలిపారు .

Poultry Business: కోళ్ల ఫారం బిజినెస్..ఈ ఒక్క టెక్నిక్ తో వీళ్లు లక్షల్లో సంపాదిస్తున్నారు

పని చేసే విధానం..

రీసైక్లింగ్ చేసి తయారు చేసిన రొటేటింగ్ చైర్ చిన్న చిన్న పనులు చేసే వారికి ముఖ్యంగా కాళ్ళు నొప్పులు గా ఉండే వారికి మాటి మాటీ కూర్చున్న చోటు నుండి లేవకుండా చుట్టూ పక్కన ఉన్న వస్తువులు రొటేట్ అవుతూ తీసుకోవడంతో సులభంగా పనులు చేసుకోవచ్చు. ఇది కాళ్ల నొప్పులు ఉన్నవారికి కాకుండా ఇంట్లో మహిళలకు బట్టలు పిండే సమయంలో వంట పాత్రలు కడిగే సమయం లో ఉపయోగ పడుతుంది.

2024-03-28T02:58:05Z dg43tfdfdgfd