నామినేషన్ ఏ రోజు వేస్తే మంచిది? శుభ ముహూర్తం ఎప్పుడు? పండితుల మాట తెలుసుకోండి

ఏపీ, తెలంగాణలో ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. అంటే 8 రోజులు అభ్యర్థులు నామినేషన్ వెయ్యవచ్చు. మధ్యలో ఆదివారం సెలవు కావడంతో.. 7 రోజులు నామినేషన్ వేసేందుకు వీలు ఉంది. ఐతే.. అభ్యర్థులు.. మంచి రోజుల కోసం చూస్తున్నారు. శుభ ముహూర్తాలు ఏ రోజు ఉన్నాయా అని పండితులను ఆశ్రయిస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత బిజీగా ఉన్నవారిగా పండితులు, జ్యోతిష్కులు మారిపోయారు. వారికి వరుస కాల్స్ వస్తున్నాయి. పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఫోన్లు చేస్తున్నారు, కొంతమంది డైరెక్టుగా కలిసి.. మంచి రోజులపై ఆరా తీస్తున్నారు. ఐతే.. పండితులు మంచి రోజు ఏది, మంచి ముహూర్తం ఎప్పుడు అనేది చెప్పేందుకు పేరు, జన్మ నక్షత్రాన్ని లెక్కలోకి తీసుకుంటున్నారు.

నిజానికి ఈ నెల 18, 19, 21, 22 తేదీలు పెళ్లిళ్లకు సరైనవి. ఈ నాలుగు తేదీల్లో చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఐతే.. నామినేషన్లకు ముహూర్తాలు వేరే ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈ నెల 18, 19, 21, 23, 24 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఐతే.. అభ్యర్థులు మాత్రం తమ పేరు, జన్మ నక్షత్రం ఆధారంగా ముహూర్తం ఫిక్స్ చేసుకోవాలని చెబుతున్నారు.

ఈ తేదీల్లో 21వ తేదీ ఆదివారం కాబట్టి.. ఆ రోజు నామినేషన్ల స్వీకరణ ఉండదు. అందువల్ల అభ్యర్థులు ఆ తేదీ కాకుండా.. మిగతా 4 తేదీల్లో నామినేషన్స్ వేసుకోవచ్చు. ఈ 4 తేదీల్లో.. 19వ తేదీ చాలా బాగుందని పండుతులు చెబుతున్నారు. అందువల్ల నేతలు కూడా ఆ తేదీన నామినేషన్ వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా చాలా మంది అభ్యర్థులు.. పండితుల సూచనల ఆధారంగా.. నామినేషన్లు వేసే తేదీని నిర్ణయించుకుంటున్నారు.

2024-04-18T02:34:47Z dg43tfdfdgfd