నార్మల్ దోశ తిని బోర్ కొట్టిందా.. ఈ హోటల్ లో వెరీ స్పెషల్ దోశ మీకోసం వెయిటింగ్ !

ఉదయాన్నే టిఫిన్ చేయనిదే మన రోజు వారి పనులు ప్రారంభించలేము. అదే మాంసాహారులైతే ఉదయాన్నే టిఫిన్ లోకి కూడా వారి రుచికి తగినట్లుగా నాన్ వెజ్ వంటకాలను కోరుకుంటారు. ఇలా వీరి రుచికి తగినట్లుగా ప్రస్తుతం ఎన్నో టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు.. ఉదయాన్నే టిఫిన్ లోకి సైతం నాన్ వెజ్ వంటకాలు రెడీ చేస్తున్నారు. దీనితో నాన్ వెజ్ ప్రియులు ఆ టిఫిన్ సెంటర్ల వద్దకు బారులు తీరుతున్నారనే చెప్పవచ్చు. ఇలా కరీంనగర్ లో లక్ష్మీ నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ నాన్ వెజ్ టిఫిన్ కి పెట్టింది పేరనే చెప్పవచ్చు.

కష్టాల కడలితో పార్ట్ టైమ్ జాబ్.. బెస్ట్ మార్క్స్ సాధించిన ఇంటర్ విద్యార్థి !

కరీంనగర్ లో లక్ష్మి నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ ను నిర్వాహకులు నరేందర్ కొన్నేళ్ల క్రితం ప్రారంభించారు. ఈ హోటల్ ప్రారంభం నుండి దోశ స్పెషల్ కాగా.. అందులోకి చికెన్, మటన్ , మటన్ కీమా, ఎగ్ కీమా ఇలా అందజేస్తారు. అయితే చాలా తక్కువ ధరకే నాన్ వెజ్ టిఫిన్ అందిస్తుండడంతో స్థానిక ప్రజలు ఇక్కడ టిఫిన్ తినేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్ రూ. 60 ల నుండి ధర ప్రారంభం అవుతుందని లోకల్18 తో నరేందర్ తెలిపారు. కీమా దోశలు, కీమా పూరీలు ఈ టిఫిన్ సెంటర్లో మరో ప్రత్యేకత. దీనికి తోడు పాయతో కూడిన పరోట పాయసం ఈ టిఫిన్ సెంటర్ లో లభిస్తుండడం తో ఇక్కడి మాంసాహార ప్రియులకు పండగలా ఉంటుందని పలువురు ప్రజలు తెలిపారు.

Rice: ఆధార్ కార్డు చూపిస్తే కేవలం రూ.29కే బియ్యం.. త్వరపడండి!

అందరూ వెజ్ టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేస్తారని, కొంచెం వెరైటీగా ఆలోచించి నాన్ వెజ్ టిఫిన్స్ సెంటర్ ను సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండే ధరలో హోటల్ నిర్వహిస్తున్నారు వీరు. ఈ నాన్ వెజ్ టిఫిన్స్ ఏ రోజుకారోజు ఫ్రెష్ గా ఉంటాయని, తమ దగ్గర దొరికే కీమా దోశకి, అదేవిధంగా పరోటా పాయకి అమిత అభిమానులు ఉన్నారని నరేందర్ తెలిపారు. వచ్చిన కస్టమర్లే మళ్లీ మళ్లీ వస్తూ.. రోజుకో వెరైటీని టేస్ట్ చేస్తున్నారని, టేస్ట్ చాలా బాగుందని కస్టమర్లు తమకు కితాబివ్వడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. కొత్తగా నాన్ వెజ్ లో చేపల పులుసు తో కూడిన పరోటా కూడా అందుబాటులోకి తెచ్చారు ఈ హోటల్ నిర్వాహకులు. ఇంకెందుకు ఆలస్యం.. ఇన్ని రుచులు కలగలపిన నాన్ వెజ్ టిఫిన్ తినేందుకు లక్ష్మి నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ కు వెళుతున్నారా అయితే.. టేస్ట్ చేసి మీ రివ్యూ చెప్పండి మరి !

2024-04-26T14:52:08Z dg43tfdfdgfd