నిద్రపోతున్న మహిళపై పొరుగింటి వ్యక్తి నిర్వాకం.. అక్కడ చేతులు వేసి..

అహ్మదాబాద్( Ahmedabad)లోని దర్యాపూర్‌లో నివసించే పర్ణీత ఇంటి పనులు ముగించుకుని మధ్యాహ్నం ఇంట్లో విశ్రాంతి తీసుకుంది. అదే టైంలో పక్కింట్లో ఉండే ఓ వ్యక్తి ఆ మహిళ ఇంటికి వచ్చి ఆమె శరీరంపై చేతులు కదిపి వేధించడం ప్రారంభించాడు. మహిళ నిద్ర లేవగానే పక్కింటి వ్యక్తిని తోసేసింది. ఆ టైంలో మహిళ కొడుకుని చూసిన ఇరుగుపొరుగు వాళ్లంతా మహిళ కుమారుడిని కూడా చితకబాదారు. దీంతో ఆ మహిళ తన భర్త, సోదరుడికి సమాచారం అందించి పొరుగువారిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.

మహిళపై కన్నేసిన  పక్కింట్లో ఉండే వ్యక్తి ..

దర్యాపూర్‌లో నివసిస్తున్న 36 ఏళ్ల వివాహిత భర్త రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మహిళ ఇంట్లో కుట్టుపని చేస్తూ తన భర్తకు ఆర్థికంగా సహాయం చేస్తుంది. మహిళ ఇంటి పక్కన నివసిస్తున్న ఓ వ్యక్తి ఆమెకు బయటి నుంచి కుట్టడానికి దుస్తులు తెచ్చి ఇచ్చేవాడు. ఈవిధంగా అతను ఆమెకు పరిచయమనే విషయం అందరికి తెలుసు. అయితే మూడు నెలల క్రితం ఇరుగుపొరుగు వాళ్లంతా బాధితురాలిని వ్యక్తిగతంగా మంచిది కాదాని భావించుకొని మాట్లాడవద్దని తీర్మానించుకున్నారు.

Optical Illusion: ఫోటోలో దాక్కున్న కుక్కను 7సెకన్లలో గుర్తించండి.. పజిల్ ఫినిష్ చేస్తే మీరు షార్ప్

నిద్రపోతుండగా లైంగిక దాడికి యత్నం..

వివాహితురాలు ఇంట్లో మధ్యాహ్నం సమయంలో నిద్రపోతుండగా పొరుగున ఉంటున్న వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె శరీరంపై, ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ చేతులు వేసి నొక్కాడు. నిద్రలో ఉన్న మహిళ తనపై దాడి చేయడంతో వెంటనే నిద్రలేచి అతడ్ని నెట్టేసింది. ఇంతలో బయట ఆడుకుంటున్న మహిళ కొడుకు ఇంట్లోకి రావడంతో నిందితుడు వారిద్దరిని తోసేసి పారిపోయాడు. అంతా జరిగిన తర్వాత ఇరుగుపొరుగు వచ్చి మహిళ కొడుకుని కొట్టారు.

---- Polls module would be displayed here ----

పోలీస్ స్టేషన్ కి కేసు..

తనపై దాడి చేసిన పక్కింట్లో ఉండే వ్యక్తి పారిపోతే స్థానికులు తన కొడుకుపై దాడి చేస్తుండటంతో మహిళ భర్త ఇంటికి రాగానే తనకు జరిగిన సంఘటన గురించి చెప్పింది. మధ్యాహ్నం జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న భార్య భర్త, సోదరుడు పక్కింటి వారితో గొడవకు దిగారు. ఇందులో పొరుగువారు మహిళ సోదరుడిని కొట్టారు. చివరకు ఈ విషయమై దర్యాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహ్మంద్ యూనుష్‌భాయ్ మన్సూరిపై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

2024-04-16T11:47:25Z dg43tfdfdgfd