పుచ్చకాయను పిల్లలకు ఇలా పెడితే లొట్టలేసుకుని మరీ తింటారు..!

ఎండాకాలంలో పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది శరీరంలో వేడిని తగ్గించి, చలవ చేస్తుంది. శరీరంలో తేమను నిలిపి ఉంచుంతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చపండు. చిన్న పిల్లలతో పాటు పెద్దవారు కూడా దీనిని ఎంతగానో ఇష్టపడతారు.

పిల్లలు వేసవిలో పుచ్చకాయ తింటే చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కొందరు చిన్నారులు వీటిని తినడానికి అంత ఇష్టపడరు. దీని కారణంగా ఎంతో మేలు జరుగుతుందని పెద్దలు చెపుతున్నా.. వారు తినడానికి మారాం చేస్తుంటారు. అయితే పుచ్చకాయను పిల్లలతో తినిపించడాని కొన్ని పద్ధతులు ఉన్నాయి. దీనిని సాధారణ ముక్కలుగా కాకుండా.. చాకో బార్, ఐసీ క్రీమ్ లా కట్ చేసి ఇస్తే లొట్టలేసుకుంటూ తింటారని నిపుణులు అంటున్నారు.

ఇదీ చదవండి : తిరుమలలో కార్చిచ్చు.. భారీగా ఎగసిపడుతున్న మంటలు.. !

సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పుచ్చకాయ తీసుకువెళ్లి.. ఇంటిల్లపాది తింటుంటారు. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తినాలంటే ఇలా చేయాలంటున్నారు. ఐస్క్రీమ్ లా తయారు చేయాలంటే ముందుగా పుచ్చకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎప్పటిలాగే కట్ చేసుకుని పెట్టుకున్న ఈ మొక్కలను మళ్లీ సపరేట్గా ఐస్ బార్ లా వచ్చేలా కట్ చేసి పెట్టుకోవాలి.

దానికి గాను పుచ్చకాయ మొక్కకు చివర కట్ చేయాలి. మిగిలిన మొక్కని పచ్చగా కనిపిస్తున్న పుచ్చకాయ మొక్క దగ్గర అటువైపు ఇటువైపు చిన్నగా కట్ చేసి ఆ పచ్చదనాన్ని తీసివేయాలి. మధ్యలో చిన్నగా ఉన్న పచ్చగా ఉన్న మొక్కను ఉంచాలి. అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే ఐస్ క్రీమ్ బార్ లా ఉండే పుచ్చకాయ మొక్కలు రెడీ అయిపోతాయి.

ఇలా తయారుచేసి చిన్నపిల్లలకి పెడితే లొట్టలు వేసుకొని మరీ తింటారు. విశాఖలో నెత్తి మీద సూర్యుడు భగభగలాడుతూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం ఒక్క నిమిషం బయటకి అడుగు పెట్టాలంటే భయంగా ఉంది పరిస్థితి ఏర్పడింది. ఈ వేసవి తాపానికి ఇలాంటి చల్లని పానీయాలు పుచ్చకాయలు ఎంతో అవసరం. వేసవికాలం వచ్చిందంటే చాలు పుచ్చకాయలు మనకి అందుబాటులో ఉంటాయి. ఎప్పటి లాగే ఇప్పుడు కూడా పుచ్చకాయలు నగరంలో పలుచోట్ల మనకి అందుబాటులో దొరుకుతుండటంతో వేసవి తాపం నుండి తట్టుకోవడానికి ప్రజలు ఎగబడి కొంటున్నారు.

2024-04-19T14:50:18Z dg43tfdfdgfd