పచ్చి పాలతో పాదాలను మసాజ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?

పచ్చి పాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ పచ్చి పాలతో ఒక నెల రోజుల పాటు పాదాలను మసాజ్ చేస్తే మీరు ఎన్నో సమస్యల నుంచి బయటపడతారని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

నిజానికి మసాజ్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా పాదాల అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేయడం వల్ల చర్మానికి, శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలా మంది ఫుట్ మసాజ్ కోసం ఆవాల నూనె, కొబ్బరి, బాదం నూనెను ఉపయోగిస్తుంటారు. కానీ  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పచ్చిపాలతో అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే? 

మెరుగైన రక్త ప్రసరణ

అరికాళ్లకు పచ్చి పాలతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ క్రమబద్ధం అవుతుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అలాగే రక్తం గడ్డకట్టే సమస్య కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల మీకు రాత్రిపూట అసౌకర్యంగా ఉండదు. 

 

బరువు తగ్గడానికి 

బరువు తగ్గాలనుకుంటే పచ్చి పాలతో పాదాలకు మసాజ్ చేయండి. రాత్రిపూట పాదాలకు మసాజ్ చేయడం వల్ల మీ మెటబాలిజం పెరుగుతుంది. దీంతో మీరు తిన్న ఆహారం చాలా సులువుగా జీర్ణమవుతుంది. అలాగే ఉదర సంబంధ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

 

మంచి నిద్ర

పెరుగుతున్న ఒత్తిడి, అలసట వల్ల చంచలత ఉండి చాలా మందికి రాత్రిళ్లు అస్సలు నిద్ర పట్టదు. మీరు రాత్రి పూట ప్రశాంతంగా పడుకోవాలంటే మాత్రం పడుకునే ముందు పచ్చి పాలతో పాదాలకు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు బాగా నిద్రపోతారు. 

 

పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం 

పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి రావడం సర్వ సాధారణం. కానీ దీనివల్ల సరిగ్గా నిద్రపోరు. అలాగే ఇది మీ రోజువారి కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే ఈ సమయంలో మీరు పచ్చి పాలతో పాదాలకు మసాజ్ చేస్తే కడుపు నొప్పి తగ్గుతుంది. దీంతో మీరు రాత్రిళ్లు కంటినిండా నిద్రపోతారు. 

 

ఒత్తిడి ఉపశమనం 

రాత్రి పడుకునే ముందు పచ్చి పాలతో పాదాలకు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల పాదాల అరికాళ్లలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. మీరు పని ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ రాత్రిపూ పచ్చి పాలతో పాదాలకు మసాజ్ చేయండి.

పాల ప్రయోజనాలు 

పాలలో ప్రోటీన్ తో పాటుగా కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి, పొటాషియం, విటమిన్ డి వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. పచ్చి పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మసాజ్ కు కూడా అంతే ఉపయోగపడతాయి.

2024-05-02T06:25:06Z dg43tfdfdgfd