పచ్చి మిరపకాయలను నానపెట్టి.. ఆ నీరు తాగితే ఏమౌతుందో తెలుసా?

 ఆ వాటర్ ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి ఇంకా ఎక్కువ మేలు చేస్తాయని మీకు తెలుసా? ఈ నీటిని రోజూ తాగడం వల్ల.. ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో.. మన ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

పచ్చి మిరపకాయలను దాదాపు అందరు ఇళ్లల్లో వాడుతూనే ఉంటారు. దాదాపు ప్రతి వంటలోనూ పచ్చి మిరపకాయలను ఉపయోగిస్తూనే ఉంటాం. చాలా రకాల కూరల్లో కారం కంటే.. మిరపకాయలు ఉపయోగించడం వల్లే రుచి మరింత పెరుగుతుంది. దాదాపు అందరూ పచ్చి మిరపకాయలను కేవలం కారం కోసం మాత్రమే వాడతారు. కానీ.. దీనిలోనూ చాలా  ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి6, ఐరన్, కాపర్, పొటాషియం లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

 

ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో  పచ్చి మిరపకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల  మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇదే పచ్చి మిరపకాయలను రాత్రిపూట నీటిలో నానపెట్టి... ఆ వాటర్ ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి ఇంకా ఎక్కువ మేలు చేస్తాయని మీకు తెలుసా? ఈ నీటిని రోజూ తాగడం వల్ల.. ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో.. మన ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

 

పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీని ఫ్రీ రాడికల్స్, పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. అంతేకాదు.. గ్రీన్ చిల్లీలో విటమిన్ సి ఉంటుంది. బిటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఈ రెండూ మన రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి.

గ్రీన్ చిల్లీ వాటర్ తాగడం వల్ల.. మన చర్మం అందంగా మారడంతో పాటు... కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. బ్లడ్ లో షుగర్ లెవల్స్్ ని కంట్రోల్ చేస్తాయి. డయాబెటిక్ పేషెంట్స్ కి అయితే... ఈ వాటర్ దివ్య ఔషధంలా పని చేస్తాయి.

ఈ  గ్రీన్ చిల్లీ వాటర్ గుండె ఆరోగ్యానికి కూడా  చాలా బాగా పని చేస్తాయి.  మన శరీరంలోని కొలిస్ట్రాల్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలోనూ సహాయం చేస్తాయి. అంతేకాదు.... ఈ నీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈజీగా  బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

ఈ చిల్లీ వాటర్ ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం.. ముందు.. 3 లేదంటే నాలుగు గ్రీన్ చిల్లీ లను శుభ్రం చేయాలి. ఈ నీటిని మనం రాత్రిపూట ఒక గ్లాసులో నానపెట్టాలి. దాంట్లో చిటికెడు ఉప్పు వేయాలి.  అలా వదిలేసి... ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఈ చిల్లీ వాటర్ తాగిన తర్వాత కాసేపటి వరకు.. ఏమీ తినకూడదు.. తాగకూడదు.  అరగంట తర్వాత.. ఏదైనా తినవచ్చు.

2024-05-01T04:35:46Z dg43tfdfdgfd