పనస పండును కోయడంలో ఈ యువకుడి స్టైల్ వేరు..!

పండ్లు తినడం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్లతో నిండిన పండ్లు మనకు పకృతి ప్రసాదించిన తీపి బహుమతి. అయితే పండ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు అనేక రుచులు,ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.పండ్లు తినడం ద్వారా శరీరానికి తగినంత ఫైబర్, ఖనిజాలు, యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్లు అందిస్తాయి.

అయితే వేసవిలో ఎక్కువ దొరికే పండ్లలో పనస పండు కూడా ఒకటి.కమ్మటి వాసనతో ఆకర్షించే పనస పండు అంటే ఇష్టపడని వారు ఉండరు.పనస పండు తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. పనసలో ప్రోటీన్,పొటాషియం, కాల్షియం, పోలేట్, ఐరన్, ఫాస్పరస్,జింక్, విటమిన్ ఏ, విటమిన్ సి, తయామిన్, వంటి పోషకాలు ఉంటాయి.ఇది తినడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. ఎముకలను బలపరుస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరే గుడ్ న్యూస్.. ఇక ఉచితంగానే..

అయితే వరంగల్ నగరంలో ఓ యువకుడు కొన్ని ఏళ్లుగా ఈ పనస పండ్ల వ్యాపారం చేస్తూ రాణిస్తున్నారు. వరంగల్ నగరానికి చెందిన షేక్ ఫెరోజ్ అనే యువకుడు నగరంలోని కలెక్టర్ రేట్ ప్రాంగణంలో పనస పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపారం గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నానని ఫెరోజ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వీటిని తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు చెప్పారు. వీటిని తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. నిత్యం వీటిని కొనుగోలు చేసేందుకు ఎంతో మంది వస్తుంటారని చెప్పారు.

మధ్యతరగతికి భారీ శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం?

ఈ పనస పండు ధరలు 1కిలోకు రూ:200,1/2 కిలోకు రూ:100లుగా అమ్ముతున్నట్లు తెలిపారు.వీటిని కొనుగోలు చేసేందుకు నిత్యం 50 మందికి పైగానే వస్తుంటారని చెప్పారు. అధికారులు,వైద్యుల సైతం ఇక్కడికి వచ్చి వీటిని కొనుగోలు చేస్తుంటారని వెల్లడించారు. అయితే ప్రతిరోజు 20కిలోలకు పైగానే ఈ పనస పండ్లను అమ్ముతున్నట్లు తెలిపారు. ఎక్కువ మోతాదులో కొనుగోలు చేసిన వారికి కాస్త డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ పనస పండ్లను అమ్మడం ద్వారా ప్రతి రోజు రూ:3000 పైగానే ఆదాయం వస్తుందన్నారు. అందులో ఖర్చులకు పోను రూ:500లకు పైగా అనే లాభం మిగులుతున్నట్లు వెల్లడించారు. వ్యాపారం కూడా లాభదాయకంగానే ముందుకు వెళుతుందని పేర్కొన్నారు.

2024-04-25T12:17:32Z dg43tfdfdgfd