పరగడపున జ్యూస్‌లు తాగుతున్నారా.. జాగ్రత్త..

జ్యూస్‌లు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే, వీటిని ఎప్పుడు తాగాలో, ఎలా తాగాలో కూడా తెలిసి ఉండాలి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

జ్యూస్‌లు పరగడపున పండ్ల రసాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, దంతక్షయం, జీర్ణక్రియ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బదులుగా, పోషకాల శోషణ, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడానికి పండ్ల రసాలను ఇతర సమయాల్లో భోజనంతో పాటు తీసుకుంటారు. ఫస్ట్ మీల్..

రోజులో మనం మొదటిసారిగా తీసుకునే భోజనం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే, రాత్రి టైమ్‌లో మన శరీరానికి ఏ ఫుడ్ అందదు. కానీ, అవయవాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. అయితే, ఉదయాన్నే ఆకలి అవుతుంది. ఆ ఆకలి తీర్చుకోవడానికి పోషకాహారం తీసుకోవాలి. దీని వల్ల శరీర అవయవాలకి మేలు జరుగుతుంది. అలా కాకుండా చక్కెర కలిపిన పండ్ల రసాలు తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

జుట్టు, స్కిన్‌కి హెల్ప్ చేసే బెస్ట్ డ్రింక్..​ ​

తాజా పండ్ల రసాల్లో..

తాజా పండ్లలో కరికే, కరగని పైబర్ రెండూ ఉంటాయి. వాటిని తిన్న తర్వాత జీర్ణం చేయడానికి మన జీర్ణ వ్యవస్థకి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, రక్తంలో షుగర్ లెవల్స్ మెల్లిగా పెరుగుతాయి. కానీ, పండ్ల రసాల విషయానికొస్తే పీచు తొలగిపోతుంది. కాబట్టి, ఈ జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని తక్కువ సమయంలోనే జీర్ణం చేసి రక్తంలోకి చక్కెరని విడుదల చేస్తుంది. అప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. దీనిని డాక్టర్స్ షుగర్ స్పైక్‌ అని చెబుతారు. అది మంచిది కాదు. దీని వల్ల గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యల్ని పెంచుతాయి.

జీర్ణ సమస్యలు..

మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే పండ్లని అలానే తినాలి. అప్పుడే ఫైబర్ చక్కగా అందుతుంది. ఆహారం కూడా చక్కగా జీర్ణమవుతుంది. ​Also Read : ఓట్స్ తింటున్నారా.. ఈ సమస్యలు వస్తాయట జాగ్రత్త..

దంత సమస్యలు..

పండ్ల రసాలని పరగడపున తసీుకుంటే దంతాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే పండ్ల రసాల్లో కొద్దిగా ఆమ్లాలు ఉంటాయి. ఇవి దంతాల ఎనామిల్‌ని కరిగించి కేవిటీస్, జివ్వుమనే అనుభూతిని కలిగిస్తాయి. కానీ, మనం అవే జ్యూస్‌ని లంచ్, డిన్నర్‌లో తీసుకుంటే అసిడిటీని తగ్గిస్తాయి. ఆల్కలీన్ ఫుడ్స్ పూర్తిగా అసిడిటీని బ్యాలెన్స్ చేస్తాయి. కాబట్టి, పరగడపున కాకుండా ఏమైనా తిన్నప్పుడు మాత్రమే పండ్ల రసాలను తీసుకోండి.

క్రేవింగ్స్ పెరగడం..

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లే.. కొన్ని రోజుల తర్వాత అదికూడా అకస్మాత్తుగా తగ్గుతుంది. దీని కారణంగా, కేలరీలు కూడా తగ్గుతాయి. దీని వల్ల అలసిపోవడం జరుగుతుంది. బ్రెయిన్ ఈ అలసట కారణంగా ఏదైనా తినాలనే క్రేవింగ్స్ పెరుగుతాయి. దీంతో ఎక్కువ తింటారు. బరువు పెరిగే అవకాశం ఉంది. ​Also Read : ఈ 4 మూలికల్ని వాడితే గుండె రక్తనాళాల్లో కొవ్వు తగ్గుతుందట..

లంచ్, డిన్నర్‌లో తీసుకోవడం..

పండ్ల రసాలను పగరడపున కాకుండా లంచ్, డిన్నర్‌తో తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఆకలి తగ్గుతుంది. ఆహారాలతో తీసుకున్నప్పుడు పోషకాల శోషణ పెరుగుతుంది. పండ్ల రసాలను మన భోజనంలో తీసుకున్నప్పుడు శరీరానికి ఎలాంటి పోషకాల కొరత ఉండదు. పండ్ల రసాలు రుచికరంగా ఉంటాయి. దీంతో మనం ఫుడ్‌ని ఆస్వాదిస్తూ తీసుకోవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Health News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T06:16:38Z dg43tfdfdgfd