పాదాల నలుపు తగ్గి తెల్లగా మెరవాలంటే ఇలా చేయండి..

నేటికాలంలో ముఖం దగ్గర్నుంచీ పాదాల వరకూ అందంగా కనిపించాలంటే కొన్ని ఫాలో అవ్వాలి. అందులో ముఖ్యంగా పాదాలు అందంగా కనిపించేందుకు ఏం చేయాలో తెలుసుకోండి.

పాదాలు అందంగా కనిపించాలంటే కేవలం పెడిక్యూర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే, అందుకోసం పార్లర్స్‌కి వెళ్ళాలి. అలా కాకుండా ఇంట్లోనే ఏం చేయాలో తెలుసుకోవండి. పాదాల రంగు మారడానికి కారణాలు..

కొంతమందికి బాడీ అంతా ఓ రంగులో ఉంటే పాదాలు మాత్రం వేరే రంగులో ఉంటాయి. దీంతో వాళ్ళు కాస్తా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇలా పాదాల రంగు మారడానికి చాలా కారణాలున్నాయి. సూర్యకిరణాలు, కాళ్ళు పగలడం, అలర్జీలు, గీతల వంటి కారణాలతో పాదాల రంగు మారి నల్లగా కనిపిస్తాయి. ఇలా పాదాలపై ఉన్న టాన్ పోగొట్టుకోవడానికి ఇంట్లోనే మంచి టాన్ రిమూవింగ్ ప్యాక్‌ తయారు చేయొచ్చు. అదెలానో తెలుసుకోండి..

పసుపు..

పసుపు కూడా చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. ఇది చర్మ అందాన్ని, కాంతిని పెంచుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పాదాల్లోని సమస్యల్ని దూరం చేసి రంగు మెరుగ్గా చేసి అందంగా కనిపించేలా చేస్తాయి. ​Also Read : Oats Pack : స్కిన్‌ మెరవాలంటే ఓట్స్‌ని ఇలా ప్యాక్ వేయండి..

నిమ్మరసం..

నిమ్మరసంలో ఆమ్ల గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడడంలో కీ రూల్ పోషిస్తాయి. నిమ్మరసాన్ని జుట్టు, చర్మానికి అప్లై చేయొచ్చు. దీని వల్ల సన్ ట్యాన్ దూరమవుతుంది. అలాగే కాళ్ళని మెరిపించడంలో కూడా నిమ్మరసం బాగా పనిచేస్తుంది. పాదాల్లో దుర్వాసనని దూరం చేస్తుంది.

శనగపిండి..

ప్రతిఇంట్లోనూ శనగపిండి వాతారు. దీనిని వాడడం వల్ల మృతకణాలు దూరమవుతాయి. అంతేకాకుండా చర్మంపై టాన్ కూడా తగ్గుతుంది. సాధారణంగా సన్ ట్యాన్‌ని దూరం చేయడానికి ఈ శనగపండి మంచి ఎక్స్‌ఫోలియెంట్‌లా పనిచేసి కాళ్ళ రంగు, టాన్‌ని పోగొడుతుంది.

వేప పొడి..

ఈ వేపపొడిలో ఎన్నో అద్భుతగుణాలు ఉంటాయి. దీనిని వాడడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. దీనిని జుట్టు, చర్మానికి రాయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఫంగల్, ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తాయి. ఇలాంటి పాదాల సమస్యల్ని కూడా వేప పొడి దూరం చేస్తుంది. ​Also Read : రోజూ పడుకునే ముందు ఈ ప్యాక్ రాస్తే మీ ముఖం మెరిసిపోద్ది..

ప్యాక్ ఎలా వేయాలంటే..

ఓ చిన్న గిన్నెలో వేప పొడి, పసుపు, శనగపిండి వేసి బాగా కలపండి. ఇందులో పాలు కొద్దికొద్దిగా వేసుకుంటూ ప్యాక్‌లా కలపండి. దీనిని పాదాలకి రాసి ఆరిన తర్వాత క్లీన్ చేయండి. దీని వల్ల పాదాలు అందంగా మచ్చలు లేకుండా ఉంటాయి. గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Beauty News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-02T07:42:50Z dg43tfdfdgfd