లైఫ్‌స్టైల్

Trending:


బంగాళాదుంప తొక్కని పీల్ చేసి పారేస్తున్నారా.. ఈ లాభాలు దక్కవు..

మనం సాధారణంగా బంగాళాదుంపలు వండినప్పుడు వాటి తొక్కల్ని తీసిపారేస్తాం. కానీ, ఇందులో శరీరానికి అవసరమయ్యే గుణాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.


Beer: బీర్ తాగుతున్నారా అయితే బీకేర్‌ఫుల్.. ఈ ఐదు వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది..!

వేసవిలో చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడుతుంటారు.. అయితే చల్లటి బీర్ ఆరోగ్యానికి హానికరం.. మీరు కూడా బీర్ తాగాలనుకుంటే.. మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. వేసవిలో చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడుతుంటారు.. అయితే చల్లటి బీర్ ఆరోగ్యానికి హానికరం.. మీరు కూడా బీర్ తాగాలనుకుంటే.. మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం రోజుల్లో యువత బ్రీర్ అంటే ఇష్టపడుతుంటారు.. అయితే అందరికీ ఎంతో నచ్చచే బీర్.. ఐదు వ్యాధులను ఆహ్వానిస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. బీర్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అదే బీర్ తాగితే శరీరంలో క్యాలరీలు పెరగడంతో పాటు బరువు కూడా పెరుగుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది. బీర్ కాలేయానికి హాని కలిగించవచ్చు. బీరును నిరంతరాయంగా తీసుకోవడం వల్ల కాలేయం వాపు వస్తుంది. ఇది లివర్ సిర్రోసిస్‌కి కూడా దారి తీస్తుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనాల ప్రకారం, ఆల్కహాల్ మరియు బీర్ వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. దీని వల్ల మౌత్ లివర్, బ్రెస్ట్, గొంతు క్యాన్సర్ వస్తుంది. బీరును నిరంతరం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇది అధిక రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్‌కు దారితీస్తుంది. బీర్‌లో పోషకాలు లేవు. అందువల్ల, మెగ్నీషియం లోపం, విటమిన్ బి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగించే ఫోలిక్ యాసిడ్ మరియు జింక్‌ను నాశనం చేస్తుంది.


చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి

చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి కొంతమంది చాలా చలాకీగాఉంటారు. పంచ్​ లు వేస్తూ  హుషారుగా ఉంటారు.  బాడీ అంతా సన్నగా.. నాజుగ్గా ఉంటారు.  కాని చేతుల విషయంలో మాత్రం చాలాలావుగా ఉండి.. అటూ..ఇటూ కదపడానికి వారు పడే ఇబ్బంది అంతా కాదు.  స్పూన్​ తో ఆహారం తినాలన్నా ఆపసోపాలు పడతారు అలాంటి వారు కొన్ని వర్కౌట్స్ చేస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ...


Shani Jayanti 2024 జూన్ మాసంలో ఈ 3 రాశులపై శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు..! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...

Shani Jayanti 2024 వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని దేవుని ఆశీస్సులు ఉన్న రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో శని జయంతి సందర్భంగా కొన్ని రాశుల వారికి ఏలి నాటి శని దోషం నుంచి ఉపశమనం లభించనుంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...


Saturn Retrograde: జూన్‌ 30 నుంచి ఈ రాశులవారికి గుడ్‌ లక్‌ స్టార్ట్‌ కాబోతోంది!

Shani Vakri - Saturn Retrograde : జూన్‌ 30న కుంభ రాశిలో శని తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశితో పాటు ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


చనిపోయిన ఆత్మీయుల వస్త్రాలు, ఇతర వస్తువులు వాడుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?

చాలా మంది చనిపోయిన ఆత్మీయుల విలువైన వస్తువులు, వస్త్రాలు వాళ్ల జ్ఞాపకాలుగా దాచుకోవడం లేదా ధరించడం చేస్తుంటారు. ఇలా చెయ్యడం మంచిదేనా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. కొంతమంది వాడుకోవచ్చని, కొంతమంది వాడొద్దని సలహాలు ఇస్తుంటారు. మరి దీని గురించి శాస్త్ర పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం. పుట్టిన ప్రతి ప్రాణి తన జీవిత యాత్ర ముగించుకుని మరణాన్నిఆశ్రయించడం అనేది నిత్య సత్యం. మరణించిన వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు, అతడికి సంబంధించిన విషయాలు మాత్రమే...


Immortal: ఈ ప్రపంచంలో మరణం లేని జీవి ఏంటో మీకు తెలుసా..?

భూమిపై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు చరిపోక తప్పదు. మనిషి మాత్రమే కాదుమొక్కలు, తీగలు, పక్షులు, జంతువులు ఇలా అన్ని జీవరాశులు మరణానికి గురవుతాయి. అయితే భూమిపై ఒక్క జీవి మాత్రమే చనిపోదని మీరు నమ్మగలరా.. కానీ ఇది నిజం. అవును ఇది నిజం. లోకంలో చావని జీవి ఒకటి ఉంది. అదే జెల్లీ ఫిష్. దీనికి Turritopsis dohrnii అనే శాస్త్రీయ నామం కూడా ఉంది. ఈ రకమైన జెల్లీ ఫిష్ ఎప్పుడూ చనిపోదు. ఇది జగత్తు యొక్క అమర జీవి. అందువల్ల ఈ జీవి వయస్సును ఖచ్చితంగా అంచనా వేయలేము. ఈ జీవికి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడైతే అది పరిపక్వం చెందుతుందో.. అది యవ్వనంలోకి లేదా బాల్యంలోకి వెళుతుంది. ఆ విధంగా జీవి యవ్వనాన్ని దాటి మళ్లీ పెరిగి వృద్ధాప్యానికి చేరుకుంటుంది. ఆ తర్వాత అది యవ్వనంలోకి వెళ్లి పరిపక్వం చెందుతూ తన జీవితకాలాన్ని పొడిగిస్తుంది. ఈ విధంగా దాని వృద్ధాప్యాన్ని మార్చడం ద్వారా... జీవి జీవశాస్త్రపరంగా ఎప్పటికీ చనిపోదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అద్భుతమైన లక్షణం కోసం దీనిని ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్ అని కూడా పిలుస్తారు. నేషనల్ జియోగ్రాఫిక్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఈ జెల్లీ ఫిష్‌లు బెదిరింపు లేదా అనారోగ్యంగా భావించినప్పుడు వెంటనే పాలిప్ స్థితికి వెళతాయి. ఆ విధంగా అవి పాలిప్ దశను దాటడం ద్వారా తమ జీవితాన్ని పునరుద్ధరించుకుంటాయి. పాలిప్ దశ గుండా వెళ్ళే జెల్లీ ఫిష్ తమ చుట్టూ శ్లేష్మం లాంటి ద్రవం రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. ఆ తర్వాత దాదాపు 3 రోజుల పాటు బరిలో నిలిచి పుంజుకుంటాయి. ఇందులో జెల్లీ ఫిష్ శరీరంలోని కణాలన్నింటినీ కొత్త కణాలుగా మార్చి వయసును పూర్తిగా తగ్గిస్తుంది. అందువలన పదేపదే తమను తాము భర్తీ చేయడం ద్వారా, వారు వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి. అయితే జెల్లీ ఫిష్ గురించి శాస్త్రవేత్తలకు మరో అభిప్రాయం ఉంది. అంటే మరో పెద్ద చేప వాటిని తిన్నా లేదా అకస్మాత్తుగా పెద్ద జబ్బు వచ్చినా చనిపోతాయి. కానీ వారు ఎప్పుడూ వృద్ధాప్యంతో చనిపోవు.


చనిపోయిన వాళ్ల దుస్తులు.. వేరే వాళ్లు వేసుకంటే ఏమౌతుంది..?

అమ్మమ్మో, నానమ్మో చనిపోతే.. వాళ్ల చీరలు దాచుకొని.. వారి గుర్తుగా ఉంచుకుంటారు. వారి దుస్తులు దాచుకోవడం వరకు ఒకే కానీ.. కొందరు.. ఏదో ఒక సందర్భంలో ఆ చీరను కట్టుకునేవాళ్లు కూడా ఉంటారు. చావు, పుట్టుకలు మన చేతుల్లో ఉండవు. అవన్నీ దైవ నిర్ణయం. మనకు ఎంతో ఇష్టమైన వారు చావు రూపంలో మనకు దూరం అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే.. మనం అమితంగా ప్రేమించిన వాళ్లు దూరం అయినప్పుడు బాధగా ఉంటుంది. అమ్మమ్మో, నానమ్మో చనిపోతే.. వాళ్ల చీరలు దాచుకొని.. వారి గుర్తుగా...


ఉందిలే మంచీకాలం ముందు ముందునా.. ఈ సంకేతాలు శుభ సూచకాలు

జీవితమన్నాకా మంచీచెడు, సుఖదు:ఖాలు చాలా సహజమైన విషయాలు. అంతా మంచే ఉండదు. అలాగని ఎప్పుడూ చెడే జరగదు. ఇప్పుడు కీడు కాలం సాగుతోందని చింతిస్తూ కూర్చునే పనిలేదు. త్వరలోనే మంచి రోజులు రావచ్చు. అలా మంచి రోజులు వస్తున్నాయని చెప్పేందుకు సూచనగా మనలను సన్నద్ధం చేస్తూ కొన్ని సంకేతాలు మనకు ప్రకృతి చూపుతుందట. కావల్సిందల్లా అది గమనించగలిగే నిశిత దృష్టి మాత్రమే. మరి ఆ మంచి సంకేతాలేమిటో? వాటిని ఎలా గుర్తించాలో? శాస్త్రం చెబుతున్న విషయాలు తెలుసుకుందాం. నీరునిండిన...


ఎండాకాలంలో తాటి ముంజలను ఎందుకు తింటరో తెలుసా?

తాటి ముంజలు ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతాయి. దీన్ని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. నిజానికి ఎండకాలంలో తాటి ముంజలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? ఎండాకాలంలో మార్కెట్ లో రకరకాల పండ్లు దొరుకుతాయి. వీటిలో తాటి ముంజలు ఒకటి. నిజానికి తాటి ముంజలు ఒక్క ఎండాకాలంలోనే దొరుకుతాయి. అందుకే చాలా మంది వీటిని ఈ కాలంలో బాగా తింటుంటారు. ఈ పండ్లు తాటి చెట్లకు కాస్తాయి. ఈ పండ్లను ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. దీని ఆకారం.. చూడటానికి స్నోబాల్ లాగా...


మీ అరచేతిపై ఈ గుర్తులు ఉన్నాయా..? జీవితంలో మీకు తిరుగు ఉండదు..!

మన అరచేతుల్లో కనిపించే రేఖలు కేవలం గీతలు మాత్రమే కాదు, అవి మన వ్యక్తిత్వం, భవిష్యత్తు గురించి అనేక విషయాలు తెలియజేస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ నమ్మకం ఆధారంగా పుట్టుకొచ్చిందే హస్తసాముద్రిక శాస్త్రం (Palmistry). ఈ శాస్త్రం ప్రకారం, అరచేతి (Palm)లోని వివిధ రేఖలకు, గుర్తులకు ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు, జీవిత రేఖ (Life line) ఒక వ్యక్తి ఆరోగ్యం, శక్తిని సూచిస్తుంది. విధి రేఖ (Destiny line) వారి జీవిత పథాన్ని, అదృష్టాన్ని తెలుపుతుంది....


Milk for Moisturizer: పాలను ఇలా వాడితే మీ ముఖం మిలమిలా మెరిసిపోతుంది..

Milk for Moisturiser: మాయిశ్చరైజింగ్‌ గుణాలు ఉన్న బ్యూటీ ఉత్పత్తులను వినియోగిస్తాం. అయితే, పాలను కూడా మాయిశ్చరైజింగ్ చేసుకోవడానికి వాడొచ్చు. ఇది సహజసిద్ధంగా మీ చర్మానికి మాయిశ్చర్‌ను అందిస్తుంది.


Kitchen Vastu: ఈ 3 వస్తువులు పొరపాటున కూడా వంటగదిలో కిందపడకూడదు..

Kitchen Vastu: ఈ 3 వస్తువులు పొరపాటున కూడా వంటగదిలో కిందపడకూడదు..


రాశిఫలాలు 17 మే 2024: ఈరోజు కన్య, తులాతో సహా ఈ రాశులకు హర్ష యోగం, లక్ష్మీదేవి ఆశీస్సులతో రెట్టింపు ఆదాయం..!

horoscope today 17 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు హర్ష యోగం, లక్ష్మీనారాయణ యోగం వల్ల కన్య, తులా, సింహం రాశులతో సహా ఈ రాశులకు రెట్టింపు ప్రయోజనాలు కలగనున్నాయి. మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...


ఈ ఆహారాలతో జుట్టు రాలుతుంది.. జాగ్రత్త!

కొన్ని ఆహారాలు జుట్టు రాలడానికి కారణమవుతాయి. అవేంటో తెలుసుకుని ముందుగాలే జాగ్రత్తపడటం మంచిది.


Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Cherakurasam Paramannam: పండగ వస్తే ఇంట్లో పరమాన్నం కచ్చితంగా ఉండాల్సిందే. ఎప్పుడూ పంచదారతోనో, బెల్లంతోనో కాకుండా ఒకసారి చెరుకు రసంతో వండి చూడండి.


Sweetcorn Dosa: స్వీట్ కార్న్ దోశ రెసిపీ, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Sweetcorn Dosa: ఎప్పుడూ ఒకే రకమైన దోశలు కాకుండా కాస్త కొత్తగా స్వీట్ కార్న్ దోశను ప్రయత్నించండి. వీటిని చేయడం చాలా సులువు. రుచిగా కూడా ఉంటుంది.


Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. పండిన మామిడిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిలో ఏవి అధికంగా తింటే ఆరోగ్యమో తెలుసుకోండి.


ఈత చెట్టు నీరాతో చక్కెర తయారీ.. ఈ అమ్మాయి ఐడియా అదుర్స్..!!

తాటిచెట్టు నుంచి సేకరించిన కళ్ళుతో బెల్లం తయారు చేయడం చూశాం గతంలో.. అలానే ఈత చెట్టు నుంచి నీరాను సేకరించి చక్కెర తయారు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రియ నేరెళ్ల అనే అమ్మాయి. తాటి, ఈత, ఖర్జూర, చెట్లనుంచి కళ్ళు తీస్తారానేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే సూర్యోదయం కంటే ముందు సేకరిస్తే దాన్ని నీరాఅంటారు. పల్లెటూర్లో ఉండే వాళ్లకు నీరా గురించి అయితే ఎక్కువ తెలుస్తుంది.. కొత్త కుండ ఈత చెట్టుకు కట్టడం వల్ల ఈత కళ్ళు...


ఈ 6 కారణాల వల్లే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు..

ప్రజెంట్ కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అసలు దీనికి గల కారణాలేంటో తెలుసుకోండి.


Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Friday Motivation: ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శాంతిమయ జీవితాన్ని నేర్పుతుంది. మనసును, జీవితాన్ని అదుపులో పెట్టుకునే అందమైన మార్గం ధ్యానం.


కీర దోసను వాళ్లు మాత్రం అస్సలు తినకూడదట ఎందుకో తెలుసా?

ఈ కీరదోస లో నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. దీనిని తినడం వల్ల.. బాడీ హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కీరదోసను కూడా కొందరు అస్సలు తినకూడదట. మరి... ఈ కీరదోసను ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం... కీరదోస మార్కెట్లో సులభంగా లభించే కూరగాయ. ఇది చూడటానికి మనకు సాధారణంగానే కనిపించవచ్చు కానీ.. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో కీరదోస తినడం వల్ల... వేడి తగ్గుతుందని భావిస్తాం. ఈ కీరదోస లో నీటి శాతం...


ఫాల్సా పండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు!

చాలామందికి ఫాల్సా పండు గురించి తెలియకపోవచ్చు. కానీ ఈ పండు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో చూద్దాం.


పిల్లలకి ఈ ఫుడ్స్ పెడితే వారి ఎముకలు బలంగా మారతాయి..

ప్రతీ తల్లి కూడా తమ పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలని, వారు ఆరోగ్యంగా మారాలని కోరుకుంటుంది. అందుకోసం పిల్లలకి ఎలాంటి ఫుడ్స్ ఇవ్వొచ్చో తెలుసుకోండి.


'A'తో మొదలయ్యే ట్రెండింగ్ పిల్లల పేర్లు!

మీ బిడ్డకు Aతో ప్రారంభమయ్యే పేరు పెట్టాలని చూస్తు్న్నారా. అయితే ఈ పేర్లు చెక్ చేయండి.


Most Rich Zodiac Sign: ఈ 3 రాశుల వారు మే 19 నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు!

Most Rich Zodiac Sign: ఈ 3 రాశుల వారు మే 19 నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు!


మీ ఐక్యూకి ఇదే పెద్ద టెస్ట్.. ఈ ఫోటోలో బేసి సంఖ్యను 10సెకన్లలో గుర్తించాలి

Optical illusion: మన జీవితంలో టీవీ, మొబైల్ ఇలా ఎన్నో వినోద సాధనాలు లేని కాలం ఉండేది. ఆలోచించండి ప్రజలు అప్పట్లో తమ సమయాన్ని కాలక్షేపం చేయడానికి ఏమి చేసేవారో? అప్పట్లో వేర్వేరు ఆటలు, ఫజిల్స్ తో టైంపాస్ చేసేవారు.ముఖ్యంగా మెదడుకు వ్యాయామం అంటే ఇష్టం ఉన్నవారు గణితం, పదాలకు సంబంధించిన పజిల్స్‌ని సాల్వ్‌ చేసేవారు. మార్గం ద్వారా, ఈ చిక్కులు నేటికీ బాగా ప్రాచుర్యం పొందాయి, ఇవి మీ IQని తెలియజేస్తాయని పేర్కొన్నారు.ఓన్లీ 10 సెకన్స్..కొన్ని పజిల్స్ మీ కంటి...


కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..

కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు.. కొబ్బరి చక్కెర, కొబ్బరి పామ్ షుగర్ లేదా కొబ్బరి బ్లోసమ్ షుగర్ అని కూడా పిలుస్తారు, ఇది కొబ్బరి తాటి చెట్ల పూల మొగ్గల రసం నుండి తయారైన సహజ స్వీటెనర్. కొబ్బరి చక్కెర ఇతర రకాల చక్కెరల ఉత్పత్తిని పోలి ఉంటుంది, అయితే ఇది తక్కువ ప్రాసెసింగ్‌ తో తయారవుతుంది.  ఇది తేలికపాటి కారామెల...


తెలుగు మాసాలల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వైశాఖ మాసం విశిష్టత ఇదే..

భారతదేశ విభిన్న సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగు సాంప్రదాయం ప్రకారం జరుపుకునే పండుగలు వివిధ ప్రాంతాల్లో జరిగేటువంటి వింత ఆచారాలు నేటికి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కొన్నివందల ఏలనాటి వస్తున్న సాంప్రదాయ పద్ధతుల్లో జరిపించే పూజలు వ్రతాలు ఇలా ప్రతి ఒక్కటి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగాతెలుగు మాసాల్లో ఒకొక్క మాసానికి ఒకొక్క విశిష్టత ఉంటుందని కర్నూలుకి చెందిన జ్యోతిష్కులు వీఆర్ జోషి లోకల్ 18తో తెలిపారు. ఈ సందర్భంగా...


చెరువులను చెరపట్టారు

చెరువులను చెరపట్టారు పెద్ద చెరువు, రామసానికుంట, సిద్ధమ్మ కుంట, మల్లన్న గారి కుంట, గంగవానికుంటలు కబ్జా     ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు     ఆరుట్ల శివారులో కబ్జాల పర్వం సంగారెడ్డి, వెలుగు : ఆక్రమణదారులు చెరువులు, కుంటలను చెరబడుతున్నారు. ఎఫ్ టి ఎల్ ప్రాంతాలు కబ్జాలకు గురవుతుండగా చెరువులు, కుంటల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. సంగారెడ్డికి కూతవేటు దూరం...


Today Horoscope: ఓ రాశివారి పలుకుబడి పెరుగుతుంది

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 17-5-2024, వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..) మేషం (అశ్విని ,భరణి , కృత్తిక 1) నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు) భరణి నక్షత్రం వారికి (దినాధిపతి...


Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Egg Kofta: కోడిగుడ్డుతో అనేక రకాల వంటకాలు చేయవచ్చు. వాటిల్లో ఎగ్ కోఫ్తా కూడా ఒకటి. దీన్ని స్నాక్స్ గా తినవచ్చు. శరీరానికి ఎంతో బలం.


మహిళలకు ఎంతో ఉపయోగం.. ఆత్మరక్షణకు కర్రసాములో శిక్షణ..

ప్రాచీన కళలలో కర్రసాము ఒకటి. పూర్వం కర్రసామును ఆచారంగా నిర్వహించే వారు. కాలానుగుణంగా ఆ కళపై ఆసక్తి తగ్గిపోయింది. అయితే ఆ ప్రాచీనకళలో శిక్షణ తీసుకునేందుకు బాలికలు ముందుకు వచ్చారు. కర్రసామును భావితరాలకు అందించేందుకు నిజామాబాద్ జిల్లాలోని బాలభవన్ వేదికగా మారింది. కర్రసాము నేర్చుకోవడం వల్ల తమలో ధైర్యం పెరిగిందని బాలికలు లోకల్ 18 తో చెబుతున్నారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవనంలో వేస‌వి సెల‌వుల్లో 30 ఆంశాల‌పై ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇస్తున్నారు. 50...


డిగ్రీ చదివగానే వేట షురూ.. అందాలు దాచేదే లేదంటూ వ్యాపారవేత్త కూతురు హల్చల్..

నేటితరం అందాల భామలు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో అస్సలు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో తమ అందాల సెగలు పోస్ట్ చేస్తూ యమ కిక్కిస్తున్నారు. అలాంటి ఓ బ్యూటీ గురించి ఇప్పుడు చూద్దాం. వ్యాపారవేత్త కూతురైన ఈ చిన్నది.. అందాలకు అడ్డే వద్దంటూ తెగ హల్చల్ చేస్తోంది. జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీతో పట్టభద్రురాలై.. సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారు ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది ఈ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరంటారా..? ఆమెనే హాట్ హాట్ శ్రద్ధ దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో శ్రద్ద దాస్ ముందు వరుసలో ఉంటుంది. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. నిత్యం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా వెకేషన్ ట్రిప్ ఫొటోస్ వదిలి వేడి పుట్టించింది. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Gongura Chepala Pulusu: గోంగూర చికెన్, గోంగూర రొయ్యల కూర వండుతూ ఉంటారు. అలాగే గోంగూర చేపలు కలిపి వండి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో అదిరిపోతుంది.


ఈ కిచెన్ లో లభించే వస్తువులతో ఇంటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

కేవలం మన కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలతో ఇంటిని మెరిసిపోయేలా క్లీన్ చేయవచ్చని మీకు తెలుసా? ఏ వస్తువులతో ఇంటిని సులభంగా క్లీన్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం... ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనే అందరూ అనుకుంటారు. అయితే. కిచెన్ , ఫ్రిడ్జ్, స్టవ్, హాల్ ఇలా అన్నీ ఎప్పటికప్పుడు తుడుస్తూన్నా కూడా దుమ్ము వచ్చి చేరుతూ ఉంటుంది. ఒక వాటిని క్లీన్ చేయడానికి కూడా ఒక్కోదానికి ఒక్కో క్లీనర్ మార్కెట్లో కొనుగోలు చేస్తూ ఉండాలి. అవి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే.....


Healthy Drinks: మంచి నిద్ర కోసం బెస్ట్ డ్రింక్స్.. ఇవి తాగితే ఎలాంటి స్లీపింగ్ ప్రాబ్లమ్స్

శారీరక, మానసిక ఆరోగ్యం కోసం రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. మంచి నిద్ర కోసం పోషకాహారం తినాలి, చెడు అలవాట్లు మానేయాలి. రోజూ ఒకే రకమైన స్లీపింగ్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. అయితే ఇటీవల కాలంలో చాలామంది ఒత్తిడి, డిప్రెషన్, ఇతర సమస్యల కారణంగా నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇలాంటి వారు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పద్ధతులు పాటించడంతో పాటు యోగా, మెడిటేషన్ చేస్తే ఫలితం ఉంటుంది. అయితే కొన్ని రకాల హెల్తీ డ్రింక్స్ తాగినా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు....


వైట్ డ్రెస్ లో జాబిలమ్మలా దీపికా పిల్లి.. చిరునవ్వులతో ముంచేస్తూ క్రేజీ ఫోజులు

కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. అదే తరహాలో దీపికా పిల్లి...


Hair Care: మీ జుట్టుకు నూనె ఇలా రాస్తున్నారా.. అయితే హెయిర్ ఫాల్ అయ్యే ప్రామాదం ఉంది..!

ఒత్తైన జుట్టు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం ఏవేవో చర్యలు తీసుకుంటారు. అయితే జుట్టు సంరక్షణలో మొదటి తప్పు తలకు నూనె రాసుకోవడంతో మొదలవుతుంది. రోజూ నూనె రాసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని.. అయితే ఇది జుట్టుకు హానికరమని చెబుతారు. తలకు నూనె రాసుకోవడం వల్ల జుట్టు సూర్యరశ్మి బారిన పడకుండా కాపాడుతుంది, దీనితో పాటు ఒత్తుగా పెరుగుతుంది. అయితే జుట్టుకు తరచూ నూనె రాయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది అంటున్నారు నిపుణులు. అందుకే జుట్టుకు ఎంత నూనె అవసరమో అంతే రాసుకోవాలంటున్నారు. తలకు తరచూ నూనె రాసుకోవడం వల్ల స్కాల్ప్, జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది తలపై ఉండే వెంట్రుకల కుదుళ్లను మూసుకుపోయేలా చేస్తుందంట. దీనితో పాటు ముఖంపై మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతుందని వైద్యులు అంటున్నారు. అలాగే ఇది తలపై సహజ నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. అందుకే పొడి జుట్టు ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు నూనెను అప్లై చేయడం మంచిదని అంటున్నారు వైద్యులు. దీని కారణంగా జుట్టు తంతువులు స్కాల్ప్ తేమ, పోషణకు సహాయపడుతుంది. ఆయిలీ హెయిర్ లేదా ఆయిల్ స్కాల్ప్ ఉన్నవారు ప్రతి రెండు వారాలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి నూనె రాసుకుంటే సరిపోతుంది. కొబ్బరి నూనె, ఆముదం వంటి కొన్ని నూనెలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో శిరోజాలకు సంబంధించిన సమస్యలను నివారిస్తాయి. మీ స్కాల్ప్ మరియు హెయిర్ టైప్ ప్రకారం నూనె రాసుకోవడం ద్వారా మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోండి. (గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం వైద్యులు అందించింది.. ఏదైనా నివారణను ప్రయత్నించే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.)


Hemoglobin Foods: హెమోగ్లోబిన్‌ లెవల్స్‌ పెరగాలంటే తప్పకుండా ఈ పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.!

Hemoglobin Increasing Foods: హెమోగ్లోబిన్ అనేది మన రక్తంలో ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్. ఇది శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హెమోగ్లోబిన్‌ పెంచడంలో కొన్ని ఆహారపదార్థాలు ఎంతో సహాయపడుతాయి.


గన్నేరు పువ్వు తింటే నిజంగానే చనిపోతారా..? ఆ రాష్ట్రంలో ఎందుకు నిషేధించారు..?

చూడటానికి పూలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. దీంతో... ఎవరికైనా కోయాలి అనిపిస్తుంది. కొందరు దేవుడికి ఈ పూల దండలను కూడా సమర్పిస్తూ ఉంటారు గన్నేరు మొక్కలను ఎవరూ స్పెషల్ గా పెంచాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ పెరిగేస్తూ ఉంటాయి. చూడటానికి పూలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. దీంతో... ఎవరికైనా కోయాలి అనిపిస్తుంది. కొందరు దేవుడికి ఈ పూల దండలను కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే... కేరళలో మాత్రం ప్రస్తుతం ఈ పూలను బ్యాన్ చేశారు. మరీ ముఖ్యంగా ఈ పూలను...


మీ అరచేతిలో ఈ రేఖ ఉంటే... మీకు డబ్బు కి తిరుగుండదు..!

మన అర చేతిలో ఒక రేఖ కనుక ఉంటే.. మనకు జీవితంలో డబ్బు వస్తుందో రాదో తెలుస్తుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. కేవలం డబ్బు మాత్రమే కాదు.. మన చేతిలో మన ఆయుష్షు, విద్య , ఆరోగ్యం రేఖలు కూడా ఉంటాయి. మీ చేతి గీతలను బట్టి.. మీ జీవితం ఉంటుంది అంటే మీరు నమ్ముతారు. హస్తసాముద్రికం పై నమ్మకం ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. భారతదేశంలో చాలా మంది దీనిని బాగా నమ్ముతారు. మన చేతి రేఖల ఆధారంగా మన జీవితంలో ప్రేమ, పెళ్లి, డబ్బు లాంటి విషయాలు కూడా తెలుస్తాయట....


ఈ విషయాలను ఎవరికీ చెప్పొద్దు!

కొన్ని విషయాలను మనం ఎవరితోనూ షేర్‌ చేసుకోకూడదు. వాటిని సీక్రెట్‌గా మన చెంతనే ఉంచుకుంటే మానసికంగా దృఢంగా ఉండవచ్చు. భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు రావు.


White Rice : ఒక నెలరోజుల పాటు అన్నం తినకపోతే.. ఏమి జరుగుతుందో తెలుసా ?

ఆసియాలో నివసించే చాలా మందికి బియ్యం ప్రధాన ఆహారం. కనీసం రోజులో ఒక్కసారైనా అన్నం తింటేరు మనం సంతృప్తి చెందుతాం. అన్నం మన జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. కానీ చాలా మందికి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎక్కువ మొత్తంలో రైస్ ఆహారంగా తీసుకోవడం శరీరానికి ఆరోగ్యకరమైనదా? అన్నంలో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో స్టార్చ్ అనేక ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో అన్నం ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి బరువు పెరుగుతారు. కానీ అన్నం ఆహారాన్ని పూర్తిగా వదిలేయాలని చెప్పలేము. అయితే ఒక నెల పాటు అన్నం తినకుండా ఉంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. కానీ మీరు బియ్యాన్ని ఇతర ధాన్యంతో లేదా అదే మొత్తంలో కేలరీలను అందించే కార్బోహైడ్రేట్-రిచ్ ఫుడ్‌తో భర్తీ చేయకూడదు. "బియ్యం ఆహారం మానుకోవడం ఖచ్చితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది" అని పోషకాహార నిపుణులు చెప్పారు. అదే సమయంలో, "మీరు అన్నం మానేసిన నెలలో మాత్రమే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది, లేదా మీరు మళ్లీ అన్నం తీసుకోవడం ప్రారంభించిన తర్వాత గ్లూకోజ్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది." తక్కువ మోతాదులో అన్నం తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదని కూడా నిపుణులు చెబుతున్నారు. Avoid Rice : నెల రోజులు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..? నెల రోజులు అన్నం తిననప్పుడు శరీరంలో క్యాలరీలు లేకపోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్‌లను తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అని బాలాజీ ఆక్సన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ చీఫ్ న్యూట్రిషనిస్ట్ ప్రియా పర్మా చెప్పారు. రైస్ డైట్‌ను వదిలివేయడం వల్ల బి విటమిన్లు , బియ్యం నుండి కార్బోహైడ్రేట్లు అందించే కొన్ని ఖనిజాలలో లోపాలకు దారితీస్తుందని ఆయన చెప్పారు. అయితే ఇది వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. కానీ మీరు మీ ఆహారం నుండి పూర్తిగా అన్నం తగ్గించాలా అని మీరు నిజంగా అనుకంటే, సమాధానం ఖచ్చితంగా కాదు. ఒక నెల పాటు అన్నం ఆహారం వదులుకోవడం ఎవరిదైనా సరే పర్సనల్ ఛాయిస్. . అన్నం ఆహారాన్ని ఇష్టపడేవారు తమ ఆహారంలో భాగంగా అన్నం ఆహారాన్ని చేర్చుకోవచ్చు. కానీ అవి మితంగా ఉంటాయి. మన ఆహార జాబితాలో మరింత పోషకమైన ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా ఆహార జాబితా నుండి అన్నం తొలగించడం మంచి విధానం కాదు. అన్నం భోజనంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు , కూరగాయలను జోడించడం ద్వారా, అన్నం మరింత పోషకమైన భోజనంగా మార్చవచ్చు. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తికి ఆధారం. కాబట్టి వాటిని ఆహార జాబితా నుండి పూర్తిగా తొలగించడం వల్ల మనం బలహీనులం అవుతాం. అంతే కాదు, ఈ ప్రక్రియ కండరాల క్షీణతకు దారితీస్తుంది . శరీరంలో పోషకాలు ఖనిజాల లోపానికి దారితీస్తుంది. శరీరంలోని కొవ్వును తగ్గించడమే మన లక్ష్యం అని, కండర ద్రవ్యరాశిని తగ్గించడం సరికాదని వైద్యులు చెప్పారు.


Lemon Juice Uses: నిమ్మరసంతో కిడ్నీలో రాళ్లు మాయం అవుతాయా? లాభాలు గురించి తెలుసుకోండి!

Lemon Juice Benefits In Telugu: నిమ్మరసం ఒక అద్భుతమైన పానీయం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కిడ్నీ స్టోన్స్‌ను కరిగించడంలో సహాయపడటమే కాకుండా, ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియ మెరుగుపరచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది.


మండుటెండల్లో వంటగదిలో వేడి తగ్గించి చల్లగా ఉంచే అద్భుత చిట్కాలు..

ఈ వేసవిలో భారీ ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెట్టాయి. ప్రస్తుతం ఉపరితల ద్రోణి కారణంగా వాతావరణం కాస్త చల్లబడింది. అయితే టెంపరేచర్స్ మళ్లీ పెరగవచ్చు. ఈ హాట్ సీజన్‌లో ఇంటి లోపలి వాతావరణాన్ని చల్లగా ఉంచుకోవాలి. ముఖ్యంగా సమ్మర్‌లో వంట చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాగే కొన్ని సింపుల్ మెయింటెనెస్స్ టిప్స్ పాటిస్తే వంటగదిలో వేడి తగ్గుతుంది. అవేంటో చూడండి.* ఓవెన్ వాడకం తగ్గించడంఓవెన్ నుంచి భారీగా వేడి ఉత్పత్తి అవుతుంది. అందుకే వేసవిలో కిచెన్‌లో...


అడ్వెంచర్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే పర్వతాలు!

ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు చాలా ఉన్నాయి. అందులో ట్రెక్కింగ్ ప్రియులు, అడ్వెంచర్ ప్రియులు అధిరోహించడానికి అనుగుణంగా కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో పాపులర్ పర్వతాలు ఏంటో చూద్దాం.


పెద్దక్కగా పుట్టడం శాపమా, అది ఒక మానసిక సమస్యగా మారుతోందా?

ఆమె వయసు ఆరేళ్లే. కానీ ప్రతి సాయంత్రం ఆమె తన స్నేహితులతో ఆడుకోవడానికి బయటికి వచ్చినప్పుడు ఆమె ఒంటరిగా ఉండదు. పసిబిడ్డ అయిన సోదరుణ్ని ఆమె జాగ్రత్తగా చూసుకోవాలి.


నెయిల్ పాలిష్ వాడితే క్యాన్సర్ వస్తుందా..?

గోరు పగుళ్లు ఏర్పడినప్పుడు, బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. నెయిల్ పాలిష్‌లోని రసాయనాలు మీ గోళ్లలోకి ప్రవేశించి మీ శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. దాదాపు అందరు అమ్మాయిలు అందంగా , ఆకర్షణీయంగా కనిపించడానికి ఇష్టపడతారు. అందంగా కనిపించడంలో నెయిల్ పాలిష్ పాత్ర కూడా కీలకమే. వివిధ రంగుల నెయిల్ పాలిష్‌లు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. మహిళలు తమకు నచ్చిన వాటిని అప్లై చేస్తారు. కానీ, నెయిల్ పాలిష్ మీ ఆరోగ్యానికి ఎంత...


Health Tips: బాదాం, కిస్ మిస్ నానబెట్టి తినాలా? వద్దా ? ఏది మంచిది

అన్ని వయసుల వారు క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రోజంతా మనల్ని చురుకుగా ఉంచుకోవడం చాలా అవసరం. అల్పాహారంలో పాలు, గింజలు, పండ్లు మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని కూడా చేర్చండి. పప్పు పప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే ఆరోగ్యానికి మంచిదని మనం విన్నాం. ఇది నిజామా? ఈ విషయాన్ని వివరిస్తూ నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలను అల్పాహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ డిక్సా బావ్సర్ చెబుతున్నారు. అలాగే బాదం, ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించాడు. "మీ రోజును ప్రారంభించడానికి నానబెట్టిన బాదం మరియు ఎండుద్రాక్ష ఉత్తమ మార్గం" అనే క్యాప్షన్‌తో ఆమె ఫోటోలు వీడియోలను షేర్ చేసింది. బాదంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు , ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. నానబెట్టిన బాదం , ఎండుద్రాక్ష తినడం వల్ల రోజంతా చురుగ్గా ఉండటమే కాకుండా నిండుగా ఉండేలా చేస్తుంది. నానబెట్టిన బాదం , ఎండుద్రాక్ష తినడం వల్ల మన శరీరం వాటిలోని పోషకాలను ఉత్తమంగా గ్రహిస్తుంది. నానబెట్టిన బాదం ,ఎండుద్రాక్షలను ఉదయాన్నే తింటే రుతుక్రమ సమస్యలు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. దీన్ని రోజూ ఉదయం తినడం వల్ల జీర్ణక్రియ జరుగుతుంది. నానబెట్టిన ఎండుద్రాక్ష బాదం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడటం వలన జ్ఞాపకశక్తికి కూడా మంచిది. బాదం, ఎండుద్రాక్షలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శారీరక ఆరోగ్యానికే కాకుండా జుట్టు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల మెరిసే చర్మం కోసం నానబెట్టిన బాదం , ఎండుద్రాక్షలను రోజూ తినండి. ఇది కొలెస్ట్రాల్ , రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది గుండెకు మంచిది. మీరు ఎసిడిటీని నివారించడానికి నానబెట్టిన బాదంపప్పులను కూడా తినవచ్చు. ఇవి కాకుండా నానబెట్టిన బాదంపప్పులు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. అలాగే, నానబెట్టిన బాదంలో విటమిన్ బి17 ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి. బాదం, ద్రాక్షలో ప్రొటీన్లు, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫైబర్ వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, అన్ని వయసుల వారు రోజూ తినాలని డాక్టర్ డిక్సా బౌసర్ వివరించారు.